కళ్యాణ్ కృష్ణ కురసాల
కళ్యాణ్ కృష్ణ కురసాల | |
---|---|
జననం | విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | సినీ దర్శకుడు |
తల్లిదండ్రులు | కురసాల సత్యనారాయణ, కృష్ణవేణి |
బంధువులు | కురసాల కన్నబాబు, కురసాల సురేష్‌బాబు |
కళ్యాణ్ కృష్ణ కురసాల తెలుగు సినీ దర్శకుడు, రచయిత. అతను నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా తరువాత నాగ చైతన్య తో రారాండోయ్ వేడుక చూద్దాం సినిమా తీయడం జరిగింది. తాజాగా ఈ దర్శకుడు రవితేజతో నేల టికెట్టు సినిమా తీయడం జరిగింది.[1] 2015 సంక్రాంతి కానుకగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయన చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.ఈ సినిమాలో నాగ్ తండ్రి కొడుకులుగా నటించి మెప్పించారు.
దర్శకత్వం వహించిన చిత్రాలు
[మార్చు]- సోగ్గాడే చిన్నినాయనా (2016)[2]
- రారండోయ్ వేడుక చూద్దాం (2017)
- నేల టికెట్ (2018)
- బంగార్రాజు (2021)
సంవత్సరం | శీర్షిక | దర్శకుడు | రచయిత | గమనికలు |
---|---|---|---|---|
2016 | సోగ్గాడే చిన్ని నాయనా | మాటలు | దర్శకత్వ రంగ ప్రవేశం | |
2017 | రారండోయ్ వేడుక చూద్దాం | కథ & మాటలు | ||
2018 | నేల టిక్కెట్టు | కథ & మాటలు | ||
2022 | బంగార్రాజు | కథ | సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్ |
వ్యక్తిగత జీవితం
[మార్చు]కళ్యాణ్ కృష్ణ సోదరులు మొత్తం ముగ్గురు కాగా, పెద్దాయన కురసాల కన్నబాబు ఎమ్మెల్యేగా ఎన్నికయి జగన్మోహనరెడ్డి క్యాబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఇక రెండో ఆయన సురేష్, గతంలో విశాఖపట్నంలో ‘ఈనాడు’ రిపోర్టర్‌గా పని చేసిన అయన ఆ తర్వాత రోజుల్లో జర్నలిజం వృత్తిని వదిలిపెట్టి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి బాగా సంపాదించారు. సురేష్ జూలై 2019న మరణీంచాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Sreedhar (2018-05-19). "ఆయనే అదనపు ఆకర్షణ, అనుభవం కలిగిన హీరోయిన్ లా నటించింది- కళ్యాణ్ కృష్ణ (ఇంటర్వ్యూ)". telugu.filmibeat.com. Retrieved 2020-07-15.
- ↑ Dundoo, Sangeetha Devi (2016-01-16). "'Soggade' charms all the way". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-07-15.
- ↑ "సినీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇంట తీవ్ర విషాదం". Cinema Politics (in ఇంగ్లీష్). Retrieved 2020-07-15.