అనితా చౌదరి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అనితా చౌదరి
అనితా చౌదరి.jpg
జననం అనితా చౌదరి
కలకత్తా[1]
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
వృత్తి వ్యాఖ్యాత

సీరియల్స్ తో నటనా పరిశ్రమలో అడుగుపెట్టి, వెండితెరమీద వైవిధ్య మైన ప్రాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటీమణి అనితా చౌదరి. ఈమె యాంకర్ మరియు క్యారక్టర్ నటి. పెద్ద డ్యాన్సర్‌గా మారి పేరు తెచ్చుకోవాలనుకున్న ఆమె అనుకోకుండా కెమెరా ముందుకొచ్చింది. యాంకరింగ్‌, సీరియళ్లతో అడుగుపెట్టి వెండి తెరమీద వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది.

జననం - విద్యాభ్యాసం[మార్చు]

ఈమె తండ్రి కలకత్తాలో ఉద్యోగం చేస్తుండగా అక్కడే జన్మించింది అనిత. పెరిగింది, చదువుకొన్నదీ అంతా హైదరాబాద్‌లోనే.

ఇంట్లో చెప్పకుండా కూచిపూడి నేర్చుకోవడం మొదలుపెట్టారు. డాన్స్‌ స్కూల్లో బ్యాలేలూ, కథక్‌ నేర్చుకొన్నారు. పిల్లలకు ట్యూషన్లు చెబుతూ, సమ్మర్‌ జాబ్‌లు చేస్తుండేదాన్ని. అప్పట్లో డీడీలో వచ్చే సీరియళ్లకు మంచి ఆదరణ. అలాంటి సమయంలో ఓసారి అశోక్‌రావుగారు డ్యాన్స్‌ స్కూల్లో అనితా చూసి టెలిఫిల్మ్‌లో నటించమని అడిగారు. అదే మొదటిసారి కెమెరా ముందుకు నటించడం. అయితే అది ప్రసారం కాలేదు.

కెమెరా ముందుకు[మార్చు]

ఈటీవీలో యాంకర్ల కోసం ఆడిషన్లు జరుగుతున్నాయంటే తన ఫ్రెండ్స్‌ తనకి తెలియకుండా నా ఫొటో పంపించారు. నా నటనను పరీక్షించడం కోసం 'సోది చెప్పడం వచ్చా.. చెప్పు చూద్దాం' అన్నారు. ఏం చెప్పకపోవడంతో 'సరే కెమెరా వంక చూసి నీపేరు, చదువు చెప్పేసి వెళ్లిపో' అన్నారు. కొన్నిరోజులకు ఈటీవీ నుంచి బ్రహ్మానందం గారితో కలిసి ఓ కార్యక్రమానికి యాంకరింగ్‌ చేయమని పిలుపువచ్చింది. అప్పటికి ఇంటర్‌ చదువుతున్నారు. ఆ కార్యక్రమం హిట్‌ అయింది. తరవాత నరేష్ గారితో కలిసి కౌంట్‌డౌన్‌ కార్యక్రమం. అదయ్యాక పబ్లిక్‌ డిమాండ్‌ అనే లైవ్‌ షో. ఈ కార్యక్రమాన్ని ఏడేళ్లపాటు చేశారు. అప్పటినుంచి అన్నీ వరుస అవకాశాలు వచ్చాయి. తరవాత మంజులానాయుడి దర్శకత్వంలో ఈటీవీలో అనితా చౌదరి చేసిన కస్తూరి డైలీ సీరియల్‌ పెద్ద సంచలనం. వరసగా ఆ సీరియల్‌కి ఏడు సంవత్సరాల పాటు ఉత్తమ నటి అవార్డుని అందుకొన్నారు.

మొదట్లోనే ఈవిడకి సినిమా అవకాశాలు వచ్చాయి. ఈవీవీగారు 'తాళి' తీస్తున్న సమయం. శ్రీకాంత్‌ హీరో.. హీరోయిన్‌ పాత్రకోసం స్క్రీన్‌ టెస్ట్‌ కూడా చేశారు. కాని షూటింగ్‌ ఆరునెలల పాటు రాజమండ్రిలో ఉంటుందని చెప్పడంతో చేయనన్నారు. 'హీరోయిన్‌ వేషం ఇస్తానంటే వద్దన్నదాన్ని నిన్నే చూస్తున్నా' అంటూ ఆశ్చర్యపోయారు. ఆతర్వాత ముఫ్పై సినిమాల దాకా నటించారు.

నటించిన సినిమాలు[మార్చు]

 1. మురారి
 2. రాజా (1999)
 3. సంతోషం (2002)
 4. ఆనందం
 5. ప్రాణం
 6. నువ్వే నువ్వే (2002)
 7. ఓరి నీ ప్రేమ బంగారంగానూ
 8. ఛత్రపతి
 9. ఉయ్యాల జంపాల
 10. రాజ్ (2001)
 11. వరుడు (2010)
 12. నిన్నే ఇష్టపడ్డాను (2003)
 13. మన్మధుడు (2002)
 14. నీ ప్రేమకై

ఇతర లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]