Jump to content

ఇ.వి.వి.సత్యనారాయణ

వికీపీడియా నుండి
ఇ.వి.వి.సత్యనారాయణ
జననం
ఈదర వీర వెంకట సత్యనారాయణ

(1956-06-10)1956 జూన్ 10
మరణంజనవరి 21, 2011(2011-01-21) (aged 54)
మరణ కారణంకాన్సర్
ఇతర పేర్లుఇ.వి.వి
వృత్తిసినిమా దర్శకుడు, నిర్మాత
పిల్లలుఆర్యన్ రాజేష్, నరేష్
తల్లిదండ్రులు
  • వెంకటరావు (తండ్రి)
  • వెంకటరత్నం (తల్లి)

ఇ.వి.విగా ప్రసిద్ధిచెందిన ఈదర వీర వెంకట సత్యనారాయణ (జూన్ 10, 1958 - జనవరి 21, 2011) [1] తెలుగు సినిమా దర్శకుడు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించాడు. ఈవివి దర్శకుడు జంధ్యాల శిష్యుడు. ఇతని మొదటి సినిమా రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా నిర్మింపబడిన చెవిలో పువ్వు. ఈ సినిమా అంతగా విజయవంతం కాలేదు. కొద్ది కాలం తర్వాత నిర్మాత రామానాయుడు ప్రేమ ఖైదీ చిత్రంలో అవకాశ మిచ్చాడు. ఆ చిత్రం విజయవంతం కావటంతో పలు అవకాశాలు వచ్చాయి. జంధ్యాల ఒరవడిలో హస్యప్రధాన చిత్రాలు నిర్మించాడు. జంధ్యాల కంటే కొంతఘాటైన హస్యాన్ని చిత్రాల్లో ప్రవేశపెట్టాడు. రాజేంద్ర ప్రసాద్ తో ఆ ఒక్కటి అడక్కు, అప్పుల అప్పారావు, ఆలీబాబా అరడజనుదొంగలు వంటి చిత్రాలు, నరేష్తో జంబలకిడి పంబ మొదలైన చిత్రాలు తీశారు. సీతారత్నంగారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది (శోభన్ బాబు) లాంటి చిత్రాలతర్వాత ఆమె, తాళి వంటి మహిళా ప్రధానమైన చిత్రాలు తీశాడు. అగ్రనటులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో చిత్రాలు తీశాడు. కొద్ది విరామం తర్వాత కుమారులిద్దర్ని హీరోలుగా పరిచయం చేశాడు.

తొలినాళ్ళు

[మార్చు]

సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాలోని దొమ్మేరులో వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. నాన్న వెంకటరావు, అమ్మ వెంకటరత్నం. ఈయన కుటుంబానికి దొమ్మేరులో 70 ఎకరాల పొలం ఉండింది. బాల్యం నుండి సినిమాలంటే ఆసక్తితో కనీసం వారానికి రెండు సినిమాలైన చూసేవాడు. ఇంటర్మీడియట్ వరకు బుద్ధిగానే చదివినా, ఇంటర్‌కు నిడదవోలు వెళ్ళిన సత్యనారాయణ కాలేజికి వెళ్ళకుండా రోజూ ఉదయం ఆట, మధ్యాహ్నం ఆట సినిమాలను చూడటంతో హాజరు తక్కువై ఇంటర్మీయడ్ తప్పాడు. అప్పుడు సత్యనారాయణ తండ్రి ఆయన్ను కాలేజీకి పంపించి లాభం లేదని నిశ్చయించి తండ్రితో పాటు పొలం పనులు చూసుకోవటానికి నియమించాడు. 19 యేళ్ళకే 1976లో సరస్వతి కుమారితో పెళ్ళైంది. తర్వాత ఇద్దరు కొడుకులు పుట్టారు. వీళ్ళకు రాజేష్, నరేష్ అని పేరు పెట్టారు. కొన్నాళ్ళకు వ్యవసాయంలో పెద్ద నష్టాలు రావడంతో పొలాలు అమ్మేయవలసిన పరిస్థితి కలిగింది. ఆ పరిస్థితుల్లో అక్కడ ఉండటానికి సత్యనారాయణ తెగ ఇబ్బంది పడి ఎక్కడికైనా మరో ఊరికి కొన్నాళ్ళు వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇ.వి.వి స్నేహితుడు నిర్మాత నవతా కృష్ణంరాజు మేనల్లుడైన సుబ్బరాజును సంప్రదించి ఒక సిఫారుసు ఉత్తరం పట్టుకుని మొదటిసారి మద్రాసు వెళ్ళాడు. నవతా కృష్ణంరాజును కలిసి ఉత్తరం ఇవ్వగా ఆయన సినీరంగంలో జీవితం అనుకున్నంత సులభం కాదని, తిరిగి సొంత ఊరికి వెళ్ళిపొమ్మని హితవు చెప్పాడు. దాంతో పూర్తిగా నిరాశచెందిన సత్యనారాయణ, తిరిగి వెళ్ళినా చేసేదేమీ లేదనుకుని మద్రాసులోనే ఉండి వివిధ ప్రదేశాలు తిరుగుతుండేవాడు. పాండీబజారుకు వెళ్ళి అక్కడ సహాయదర్శకులు చెప్పుకునే మాటలు వినేవాడు. ప్రతి ఉదయం నవత కృష్ణంరాజు కార్యాలయం గేటు వద్ద నుంచుని ఉండేవాడు. ఒక నెలరోజుల తర్వాత కుర్రవాని పట్టుదలను చూసి ఏం చెయ్యగలవు అని అడిగాడు. సహాయ దర్శకున్ని అవుతానని చెప్పిన ఇ.వి.విని కనకాల దేవదాసు క్రింద ఓ ఇంటి భాగోతం సినిమాకు సహాయదర్శకునిగా అవకాశం ఇప్పించాడు.[2]

పరిచయం చేసిన నటీనటులు

[మార్చు]

చిత్రాలు

[మార్చు]
  1. చెవిలో పువ్వు (1990)
  2. ప్రేమ ఖైదీ (1991)
  3. అప్పుల అప్పారావు (1991)
  4. సీతారత్నం గారి అబ్బాయి (1992)
  5. 420 (1992)
  6. జంబలకిడిపంబ (1992)
  7. ఏవండీ ఆవిడ వచ్చింది (1993)
  8. వారసుడు (1993)
  9. ఆ ఒక్కటీ అడక్కు (1993)
  10. అబ్బాయిగారు (1993)
  11. ఆలీబాబా అరడజను దొంగలు (1994)
  12. హలో బ్రదర్ (1994)
  13. మగరాయుడు (1994)
  14. ఆమె (1994)
  15. అల్లుడా మజాకా (1995)
  16. ఆయనకి ఇద్దరు (1995)
  17. తెలుగువీర లేవరా (1995)
  18. ఇంట్లోఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996)
  19. అదిరింది అల్లుడు (1996)
  20. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996)
  21. చిలక్కొట్టుడు (1996)
  22. వీడెవడండీ బాబూ (1997)
  23. నేను ప్రేమిస్తున్నాను (1997)
  24. తాళి (1997)
  25. మా నాన్నకి పెళ్ళి (1997)
  26. ఆవిడా మా ఆవిడే (1998)
  27. మావిడాకులు (1998)
  28. కన్యాదానం (1998)
  29. నేటి గాంధీ (1999)
  30. సూర్యవంశం (1999)
  31. పిల్ల నచ్చింది (1999)
  32. చాలా బాగుంది (2000)
  33. గొప్పింటి అల్లుడు (2000)
  34. అమ్మో ఒకటోతారీఖు (2000)
  35. మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది (2001)
  36. ధాంక్యూ సుబ్బారావ్ (2001)
  37. వీడెక్కడి మొగుడండి (2001)
  38. హాయ్ (2002)
  39. తొట్టిగ్యాంగ్ (2002)
  40. ఆడంతే అదోటైపు (2003)
  41. మా అల్లుడు వెరీగుడ్ (2003)
  42. ఆరుగురు పతివ్రతలు (2004)
  43. ఎవడి గోల వాడిది (2005)
  44. నువ్వంటే నాకిష్టం (2005)
  45. కితకితలు (2006)
  46. అత్తిలి సత్తిబాబు ఎల్‌కేజీ (2007)
  47. పెళ్ళైంది కానీ... (2007)
  48. ఫిట్టింగ్ మాస్టర్ (2009)
  49. బెండు అప్పారావ్ ఆర్. ఎం. పి (2009)
  50. బురిడి (2010)
  51. కత్తి కాంతారావు (2010)

నిర్మాతగా

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-12-28. Retrieved 2009-07-15.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-03-17. Retrieved 2009-07-15.
  3. ETV Bharat News (10 June 2020). "సినీ సీమలో హాస్య కేతనాలు ఎగరేసిన ఈవీవీ". Archived from the original on 14 November 2022. Retrieved 14 November 2022.