హలో బ్రదర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
‌హలో బ్రదర్
దర్శకత్వంఇ.వి.వి. సత్యనారాయణ
రచనఎల్. బి. శ్రీరామ్ (మాటలు)
నిర్మాతకె. ఎల్. నారాయణ
తారాగణంఅక్కినేని నాగార్జున ,
సౌందర్య ,
రమ్యకృష్ణ
ఛాయాగ్రహణంఎస్. గోపాల రెడ్డి
కూర్పుకె. రవీంద్రబాబు
సంగీతంరాజ్ - కోటి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1994
భాషతెలుగు

హలో బ్రదర్ 1994లో ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేయగా రమ్యకృష్ణ, సౌందర్య జంటగా నటించి మంచి ప్రజాదరణ పొందిన సినిమా ఇది.[1]

కథ[మార్చు]

ఎస్.పి. చక్రవర్తి మిశ్రో అనే బందిపోటు దొంగను నిర్భందిస్తాడు. తప్పించుకోవడం కోసం మిశ్రో తనను తానే కాల్చుకోవడంతో పోలీసులు అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకుని వస్తారు. అదే సమయానికి చక్రవర్తి భార్య ఇద్దరు కవల పిల్లలకు జన్మనిస్తుంది. ఆ పిల్లలిద్దరూ దగ్గర్లో ఉంటే అసంకల్పితంగా ఒకరినొకరు అనుకరిస్తారని వైద్యులు చెబుతారు. మిశ్రో చక్రవర్తి భార్త గీతను గాయపరిచి వారిలో ఒక పిల్లాడిని తీసుకుని పారిపోతాడు. చక్రవర్తి అతణ్ణి వెంబడిస్తుంటే మిశ్రో ఆ పిల్లాడిని రైలు పట్టాలపై పడుకోబెట్టేస్తాడు. చక్రవర్తి అతన్ని కాల్చి చంపుతాడు. రైలు పట్టాలపై ఉన్న బిడ్డను వేరే దంపతులు చేరదీస్తారు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  • ప్రియరాగాలే గుండె లోన పొంగుతున్న ఈ వేళ , రచన: భువన చంద్ర,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కె ఎస్ చిత్ర
  • కన్నెపిట్టరో కన్ను కొట్టరో, రచన: భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • అబ్బా ఏందెబ్బా , రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • ఎక్కండయ్యా బాబు వచ్ఛిందయ్యా బండి , రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • మనసిచ్చీ ఇచ్చీ బరువాయే , రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • చుక్కేసి పక్కేసి , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర.

ఇతర వివరాలు[మార్చు]

  1. ఈ సినిమాలో ఇద్దరు నాగార్జునలు ఉండే సన్నివేశాల్లో నాగార్జునకి డూప్ గా నటుడు శ్రీకాంత్ నటించాడు.[2].1994లో విడుదలైన ‘హలో బ్రదర్‌’ సినిమా 70 కేంద్రాల్లో 50 రోజులు, 24 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది.

మూలాలు[మార్చు]

  1. "హలో బ్రదర్ సినిమా". iqlikmovies.com. Retrieved 27 February 2018.
  2. Andrajyothy (29 September 2021). "Hello Brother: నాగార్జునకు డూప్‌గా నటించింది ఎవరో తెలుసా?". Archived from the original on 29 సెప్టెంబరు 2021. Retrieved 29 September 2021.