ఎల్. బి. శ్రీరామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎల్. బి. శ్రీరాం (లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి)
l.b.sriram
L.B.sriram
జననం
లంక భద్రాద్రి శ్రీరామ్

వృత్తినటుడు
స్క్రిప్టు రచయిత
హాస్యనటుడు
రంగస్థల నటుడు
పురస్కారాలునంది పురస్కారాలు

ఎల్.బి.శ్రీరాం గా పేరొందిన లంక భద్రాద్రి శ్రీరామ చంద్రమూర్తి ఒక నటుడు, రచయిత, దర్శకుడు. ఆయన ముందుగా రంగస్థలం పై పేరు తెచ్చుకుని, తరువాత రేడియోలో పనిచేసి తరువాత సినిమా పరిశ్రమలో ప్రవేశించాడు. ముందుగా సినీ రచయితగా పనిచేసి తరువాత నటుడుగా నిరూపించుకున్నాడు. 400కి పైగా సినిమాల్లో నటించాడు. నాలుగు సార్లు నంది పురస్కారాలను అందుకున్నాడు. యూట్యూబులో ఎల్. బి. శ్రీరాం హార్ట్ ఫిలింస్ పేరుతో లఘుచిత్రాలు కూడా రూపొందిస్తున్నారు.[1]


వ్యక్తిగత జీవితం

[మార్చు]

శ్రీరామ్ మే 30న తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం సమీపంలోని నేదునూరు అనే అగ్రహారంలో జన్మించాడు. ఈయన తండ్రి వేదపండితుడు. రాష్ట్రపతి పురస్కార గ్రహీత. అప్పటి జమీందారు ఆయన పాండిత్య ప్రతిభకు మెచ్చి ఒక ఇల్లు బహుమానంగా ఇచ్చాడు. అందులోనే వారి కుటుంబం నివాసం. శ్రీరామ్ పెద్దన్నయ్య కూడా వేద పండితుడే.[2] శ్రీరామ్ మొదట రంగస్థల నటుడిగా రాష్ట్రవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. తరువాత కొద్ది రోజులు ఆలిండియా రేడియోలో కూడా పనిచేశాడు. శ్రీరాం కొడుకు గ్రాఫిక్స్ విభాగంలో పనిచేస్తున్నాడు.

రంగస్థల జీవితం, రచనలు

[మార్చు]

ఈయన రచయితగా అనేక రచనలు చేశారు. అందులో అనేక ప్రసిద్ధ నాటికలు ఉన్నాయి. 1983లో రచించిన గజేంద్రమోక్షం నాటిక బాగా ప్రసిద్ధి చెందింది.ఈ నాటిక అనేక వేల ప్రదర్శనలు జరిగింది.

సినిమా జీవితం

[మార్చు]

కిష్కిందకాండ సినిమా ద్వారా రచయితగా గుర్తింపు పొందిన శ్రీరాం అపుడపుడు కొన్ని సినిమాలలో అతిథి పాత్రలు వేసేవారు. హలో బ్రదర్ (1994), హిట్లర్ (1997) లాంటి విజయవంతమైన చిత్రాలకు మాటల రచయితగా పనిచేశాడు. తరువాత ఇ.వి.వి. సినిమా చాలా బాగుంది ద్వారా పల్లెటూరి యాసతో మాట్లాడే పాత్రతో మంచి నటుడిగానూ గుర్తింపు పొందారు. దాంతో చాలా సినిమాల్లో అవకాశం వచ్చింది. హాస్య పాత్రల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. అంతేకాకుండా సెంట్ మెంట్, భావోద్వేగాలతో మిళితమైన అమ్మో ఒకటో తారీఖు అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఎల్. బి. శ్రీరామ్ ఒంటెద్దు బండి అనే నాటకం ఆధారంగా తీయబడింది. అంతేకాకుండా చాలా నాటకాలు రచించారు.

నిర్మాతగా

[మార్చు]

షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్

[మార్చు]

అవార్డులు

[మార్చు]

నటించిన చిత్రాల జాబితా

[మార్చు]

రచయితగా సినిమాల జాబితా

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "నష్టాలొస్తున్నాయని తెలిసే చేస్తున్నా!". ఈనాడు. 25 September 2016. Archived from the original on 25 September 2016. Retrieved 25 September 2016.
  2. "ఎన్నో మిథునాలు సృష్టిస్తున్నా." ఈనాడు. 26 May 2019. Archived from the original on 27 May 2019. Retrieved 27 May 2019.
  3. సాక్షి, సినిమా (22 November 2018). "'శరభ' మూవీ రివ్యూ". Archived from the original on 22 November 2018. Retrieved 19 March 2020.