శరభ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శరభ
శరభ సినిమా పోస్టర్
దర్శకత్వంఎన్‌. నరసింహారావు
స్క్రీన్ ప్లేఎన్‌. నరసింహారావు
నిర్మాతఅశ్వనీ కుమార్‌ సహదేవ్‌
తారాగణంఆకాష్‌ కుమార్‌, మిస్తీ చక్రవర్తి, జయప్రద, నెపోలియన్‌, పొన్‌వన్నన్‌
ఛాయాగ్రహణంరమణ సాల్వ
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
ఏకెఎస్ ఎంటర్టైన్మెంట్
పంపిణీదార్లుఏకెఎస్ మీడియా ఎంటర్టైన్మెంట్, దుబాయి మను
విడుదల తేదీ
నవంబరు 22, 2018
సినిమా నిడివి
144 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

శరభ 2018, నవంబరు 22న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎన్‌. నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆకాష్‌ కుమార్‌, మిస్తీ చక్రవర్తి, జయప్రద, నెపోలియన్‌, పొన్‌వన్నన్‌ తదితరులు నటించగా కోటి సంగీతం అందించాడు.[1][2]

కథా నేపథ్యం

[మార్చు]

శరభ (ఆకాష్‌ కుమార్‌) సిరిగిరిపురంలో సరదాగా కాలం వెల్లదీసే అల్లరి కుర్రాడు. కొడుకే ప్రాణంగా బతికే పార్వతమ్మ (జయప్రధ) ఎన్ని తప్పులు చేసినా శరభను ఒక్క మాట కూడా అనదు. దివ్య (మిస్తీ చక్రవర్తి) సెంట్రల్‌ మినిస్టర్ (షియాజీ షిండే) కూతురు. తన జాతక దోశాలకు సంబంధించిన శాంతి కోసం మినిస్టర్‌ తన కూతురిని సిరిగిరిపురంలోని గురువు (పొన్‌వన్నన్‌) గారి దగ్గర విడిపెట్టి వెళతాడు. గురువుగారు దివ్యను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యతను శరభ, పార్వతమ్మలకు అప్పగిస్తాడు. చిన్న గొడవతో ప్రారంభమైన దివ్య, శరభల పరిచయం తరువాత ప్రేమగా మారుతుంది. అదే సమయంలో దివ్య ప్రమాదంలో ఉందని తెలుస్తోంది. 17 మంది అమ్మాయిలను బలి ఇచ్చిన ఓ రాక్షసుడు 18వ బలి కోసం దివ్యను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే సమయంలో శరభ గతానికి సంబంధించిన ఓ విషయం తెలుస్తుంది. అసలు శరభ గతం ఏంటి..? ఆ రాక్షసుడు దివ్యను ఎందుకు బలి ఇవ్వాలనుకున్నాడు..? రాక్షసుడితో శరభ చేసే పోరాటంలో దైవ శక్తి ఎలా సహాయపడింది..? అన్నదే మిగతా కథ.[3]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
 • దర్శకత్వం: ఎన్‌. నరసింహారావు
 • నిర్మాత: అశ్వనీ కుమార్‌ సహదేవ్‌
 • స్క్రీన్ ప్లే: ఎన్‌. నరసింహారావు
 • సంగీతం: కోటి
 • ఛాయాగ్రహణం: రమణ సాల్వ
 • కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
 • నిర్మాణ సంస్థ: ఏకెఎస్ ఎంటర్టైన్మెంట్
 • పంపిణీదారు: ఏకెఎస్ మీడియా ఎంటర్టైన్మెంట్, దుబాయి మను

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలు లహరి మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.

 1. సై శరభ సై (రచన: శ్రీమణి, నిడివి: 04:26 ని.)
 2. టామ్ & జెర్రీ (రచన: శ్రీమణి, నిడివి: 03:51 ని.)
 3. కాలికింది నిప్పయింది కాలం (రచన: రామజోగయ్య శాస్త్రి, నిడివి: 01:44 ని.)
 4. సామి వెలిసెను (రచన: రామజోగయ్య శాస్త్రి, గానం: కైలాష్ ఖేర్, నిడివి: 04:46 ని.)
 5. ఒట్టేసి చెబుతున్న నేనిలా (రచన: ఓక్టావియో పిజాబో, గానం: చిన్మయి, యాజిన్ నిజార్, నిడివి: 04:10 ని.)
 6. హరిహి హోం (రచన: వేదవ్యాస రంగభట్టర్‌, నిడివి: 2:37 ని.)

మూలాలు

[మార్చు]
 1. "Sharabha (2018) Cast - Actor, Actress, Director, Producer, Music Director". Cinestaan. Retrieved 19 March 2020.[permanent dead link]
 2. Sharabha Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes, retrieved 19 March 2020
 3. సాక్షి, సినిమా (22 November 2018). "'శరభ' మూవీ రివ్యూ". Archived from the original on 22 November 2018. Retrieved 19 March 2020.