Jump to content

జయప్రద

వికీపీడియా నుండి
జయప్రద
జయప్రద


పదవీ కాలం
2004 – 2014
ముందు బేగం నూర్ బానో
తరువాత నైపాల్ సింగ్
నియోజకవర్గం రాంపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1962-04-03) 1962 April 3 (age 63)
రాజకీయ పార్టీ సమాజ్‌వాది పార్టీ
వృత్తి సినిమా నటి, రాజకీయవేత్త
మతం హిందూ మతం

తెలుగు సినీరంగంలో జయప్రద లేదా జయప్రద నహతాగా పరిచితురాలైన లలితారాణి నటి, పార్లమెంటు సభ్యురాలు. జయప్రద 1962 ఏప్రిల్ 3ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించింది.[1]

సినీ ప్రవేశం

[మార్చు]

జయప్రదకు బాల్యంలో డాక్టరు అవ్వాలని కోరిక ఉండేది. ఈమె తల్లి ఈమెను ఏడవఏటి నుండే నాట్య సంగీత శిక్షణకు పంపింది. తన తండ్రి, బాబాయిలు సినిమా పెట్టుబడిదారులైనప్పటికీ ఈమెకు సినీరంగ ప్రవేశం వారి ద్వారా లభించలేదు. 14 ఏళ్ల వయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం. ప్రభాకరరెడ్డి ఈమెను చూసి జయప్రద అని నామకరణం చేసి 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో మూడు నిమిషాలు నిడివికల ఒక పాట ద్వారా ఈమెను చిత్రసీమకు పరిచయం చేశాడు. అలా మొదలైన ఈమె సినీ ప్రస్థానం 2005 వరకు మూడు దశాబ్దాలలో ఆరు భాషలలో (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలి) 300కు పైగా సినిమాలలో నటించింది.

పాఠశాల తర్వాత ఈమె రాజమండ్రిలోని రాజలక్ష్మి మహిళా కళాశాలలో చదివింది. ఈమె 1986 జూన్ 22న సినీనిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహమాడింది.

రాజకీయ ప్రవేశం

[మార్చు]

నందమూరి తారక రామారావు ఆహ్వానంతో 1994 అక్టోబర్ 10తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఈమె చంద్రబాబు నాయుడు పక్షంలో చేరి తెలుగు దేశం పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలైంది. 1996 ఏప్రిల్‌లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైంది. ఆ తరువాత పార్టీ నాయకులతో వచ్చిన గొడవల వలన తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి, జయప్రద ములాయం సింగ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీలో చేరి ఆంధ్ర నా జన్మ భూమి కానీ ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి అన్న నినాదంతో ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నియోజవర్గం నుండి 2004 మే 13లోక్‌సభకు ఎన్నికైంది.

జయప్రద నటించిన తెలుగు చిత్రాలు

[మార్చు]
Kamanuru

ఇవి కూడ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Mana Telangana (1 February 2022). "జయప్రదకు మాతృ వియోగం". మన తెలంగాణ. Archived from the original on 1 ఫిబ్రవరి 2022. Retrieved 1 February 2022.
  2. Indiancinema, Movies. "Eenaati Bandam Yenaatido (1977)". www.indiancine.ma. Retrieved 12 August 2020.
  3. సాక్షి, సినిమా (22 November 2018). "'శరభ' మూవీ రివ్యూ". Archived from the original on 22 November 2018. Retrieved 19 March 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=జయప్రద&oldid=4586924" నుండి వెలికితీశారు