సీతారామ వనవాసము
సీతారామ వనవాసము (1977 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
---|---|
నిర్మాణం | పింజల సుబ్బారావు |
తారాగణం | రవి, జయప్రద |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | పి.ఎస్.ఆర్.పిక్చర్స్ |
భాష | తెలుగు |
సీతారామ వనవాసము 1977, మార్చి 31న విడుదలైన తెలుగు పౌరాణిక చిత్రం. ఈ సినిమా తెలుగుతో పాటు మరో మూడు భాషలలో విడుదలయ్యింది[1]. పి. ఎన్ ఆర్ . పిక్చర్స్ పతాకంపై పింజల సుబ్బారావు నిర్మించిన ఈ చిత్రం, పౌరాణిక బ్రహ్మ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రంలో రవికుమార్, జయప్రద, గుమ్మడి వెంకటేశ్వరరావు,సత్యనారాయణ, అంజలీదేవి , పండరీబాయి మొదలగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం కె. వి మహదేవన్ సమకూర్చారు.
నటీనటులు
[మార్చు]- కైకాల సత్యనారాయణ - రావణుడు
- గుమ్మడి వెంకటేశ్వరరావు - దశరథుడు
- రవి - రాముడు
- జయప్రద - సీత
- బి.సరోజాదేవి - మండోదరి
- అంజలీదేవి - కౌసల్య
- విజయలలిత - కైకేయి
- మల్లాది
- నాగరాజు - భరతుడు
- ప్రసాద్ బాబు - లక్ష్మణుడు
- వల్లూరి బాలకృష్ణ
- చిల్లర భావనారాయణరావు
- హలం
- ఝాన్సీ
- సూర్యకాంతం
- కల్పన
- జమున - శబరి
- పండరీబాయి - అనసూయ
- శ్రీధర్ - ఇంద్రజిత్తు
- మిక్కిలినేని- సముద్రుడు
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాత: పింజల సుబ్బారావు
- దర్శకుడు: కమలాకర కామేశ్వరరావు
- మాటలు: చిల్లర భావనారాయణరావు
- పాటలు:దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేటూరి సుందరరామమూర్తి, సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, కొసరాజు, చిల్లర భావనారాయణరావు
- సంగీతం: కె.వి.మహదేవన్
- నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- ట్రిక్ ఛాయాగ్రహణం: బాబు భాయ్ మిస్త్రీ
- ఛాయాగ్రహణం: కె.ఎస్.ప్రసాద్
పాటలు
[మార్చు]- జయహో జయహో జయహో జయ జయ సీతారామ, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం. పులపాక సుశీల, వసంత బృందం
- అడుగిడదు అడుగిడక ఆగలేదు - రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి, గానం.పులపాక సుశీల
- దయచేయును దయచేయును శ్రీరాముడు దరిచేర్చే,రచన: సి నారాయణ రెడ్డి,గానం.పి.సుశీల
- వస్తున్నాడమ్మా రాముడు వస్తున్నాడమ్మా దాశరథి, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- నల్లనల్లగున్నావు నవ్వులు వెదజల్లేవు నిన్ను వదలి, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.పి సుశీల
- నాస్వామి దశకందరా దానవలోక పరిపాలన దురంధరా, రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి, గానం.పి . సుశీల
- రావో రావణ రవితేజా రసికరాజ రమణి మనోజ, రచన: వేటూరి, గానం.పి.సుశీల బృందం
- వెళ్లాలా రామా వెళ్లి తీరాలా కూరిమి తమ్మునితో బంగారు, రచన: సి. నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- రామే భూమిసుతా పులశ్చ హనుమాన్ (శ్లోకం), గానం.విస్సంరాజు రామకృష్ణ .
కథాసంగ్రహం
[మార్చు]ఈ రంగుల చిత్రంలో రామాయణంలోని సీతారామ కల్యాణం, కైకేయి వరాలు, సీతారామలక్ష్మణులు వనవాసం వెళ్ళడం, అరణ్యవాసంలో ముఖ్యమైన ఘట్టాలు, సీతాపహరణం, జటాయువు వధ, సుగ్రీవమైత్రి, వాలి వధ, సముద్రలంఘనం, లంకాదహనం, రావణసంహారం, సేతుబంధనం, శ్రీరామపట్టాభిషేకం మొదలైన ఘట్టాలు చిత్రీకరించారు. రామాయణంలో లేని శూర్పణఖ కుమారుణ్ణి లక్ష్మణుడు చంపడం వంటి కొన్ని కల్పనలు ఉన్నాయి[2]
మూలాలు
[మార్చు]- ↑ బాబూభాయ్ మిస్త్రీ ప్రకటన
- ↑ "సీతారామ వనవాసము చిత్రసమీక్ష". Retrieved 12 September 2020.
. 3. ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ .