పింజల సుబ్బారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పింజల సుబ్బారావు ప్రసిద్ధి చెందిన చలనచిత్ర నిర్మాత. ఇతని స్వస్థలం మచిలీపట్నం.

సీతారామ వనవాసము

సినిమారంగం

[మార్చు]

1957లో ఇతడు సినిమాలలో నటించాలని మద్రాసు చేరుకున్నాడు. ఐదేళ్లపాటు పలు చిత్రాలలో చిన్నచిన్న వేషాలు వేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణా ఫిలిమ్స్ సంస్థలో ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా చేరి రామాంజనేయ యుద్ధం, సతీ సుకన్య చిత్రాలకు పనిచేశాడు. తరువాత కొంతకాలం చిత్రాల క్రయవిక్రయాది వ్యాపారాలు చేశాడు. పిమ్మట చలనచిత్ర నిర్మాణరంగంలో ప్రవేశించాడు[1].

ఇతడు నిర్మించిన సినిమాలు:

  1. రాజద్రోహి
  2. హంతకులొస్తున్నారు జాగర్త
  3. రణభేరి
  4. పేదరాశి పెద్దమ్మ కథ
  5. లక్ష్మీ కటాక్షం
  6. సుగుణసుందరి కథ
  7. విక్రమార్క విజయం
  8. రౌడీలకు రౌడీలు
  9. పిల్లా? పిడుగా?
  10. సీతాకళ్యాణం
  11. సీతారామ వనవాసం
  12. అడవి మనుషులు
  13. లక్ష్మీపూజ
  14. మహాశక్తి
  15. త్రిలోక సుందరి
  16. రాణీ ఔర్ జాని (హిందీ)
  17. యే రిస్తీ నా తుహై (హిందీ)

మూలాలు

[మార్చు]
  1. "సినిమారంగం- జి.వి.జి. - ఆంధ్రపత్రిక - దినపత్రిక - తేదీ: జూన్ 14,1981 - పేజీ: 4". Archived from the original on 2016-03-05. Retrieved 2015-12-12.