పేదరాసి పెద్దమ్మ కథ

వికీపీడియా నుండి
(పేదరాశి పెద్దమ్మ కథ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పేదరాశి పెద్దమ్మ కథ
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం గిడుతూరి సూర్యం
తారాగణం కాంతారావు,
కృష్ణకుమారి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ శ్రీకాంత్ & శ్రీకాంత్ ఎంటర్ప్రైజస్
భాష తెలుగు

పేదరాశి పెద్దమ్మ కథ 1968లో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో నిర్మలమ్మ (నిర్మల) పేదరాసి పెద్దమ్మగా నటించింది. చందమామలో ఉండే ముసలమ్మ కథగా చిత్రం కథ సాగుతుంది. కాంతారావుతో పాటు జి.రామకృష్ణ రెండవ హీరోగా నటించారు. రామకృష్ణ నిర్మాణంలో కూడా పాలు పంచుకున్నారు.

చిత్రకథ

[మార్చు]

ప్రభాకరరెడ్డి మానవలోకానికి మహారాజు. అతనికి సంతానం లేదు. దంపతులు సంతానం కోసం పూజలు చేస్తుంటే పార్వతి పరమశివునితో వారికి సంతానం అనుగ్రహించమంటుంది. ఐతే సంతానం కలిగితే వారు కష్టాలపాలౌతారని చెప్పి, పార్వతి కోరిక మేరకు సంతానం కలుగజేయ సంకల్పంచి జంగమ దేవర రూపంలో రాజమందిరానికి వెళతాడు. రాజుకూ ఒక ఫలం, పిల్లలు లేని మంత్రికి రెండు ఫలాలు ఇస్తాడు. రాజనాల ఒక మాంత్రికుడు. అతని సహాయకుడు పొట్టి వీరయ్య. తను పుజించే భైరవికి తన తల సమర్పించి, తనకు చావు లేని విధంగా వరమడుగుతాడు. మానవలోక మహారాజు సంతానం ద్వారా తప్ప వేరెవరి చేతిలోనూ మరణం లేని విధంగా వరం పొందుతాడు. మహారాణి గర్భవతి అని తెలుసుకుని మాంత్రికుడు రాజసులోచనను రాజు దగ్గరకు పంపుతాడు. రాజసులోచనను రాజు పెళ్ళి చేసుకుని రాజ్యానికి తీసుకొస్తాడు. మహామంత్రి (మిక్కిలినేని) కి కొత్తరాణి మీద అనుమానం కలుగుతుంది. రాజసులోచన మహారాణి పైన, మంత్రి పైన రాజుకు అనుమానం కలిగించి రాణి కన్నులు తీయించేలా చేస్తుంది. రాజు తమ్ముని వలలో వేసుకుని రాజును కూడా ఖైదు చేయిస్తుంది. ఖైదులోఉన్న రాణి ప్రసవించినపుడు, మంత్రి తనకు పుట్టిన ఇద్దరు పిల్లలలో ఒకరిని రాణి దగ్గర ఉంచి రాకుమారుడ్ని రక్షిస్తాడు. రాకుమారుడు (కాంతారావు), మంత్రి మిగిలిన కుమారుడు విద్యాపతి (రామకృష్ణ) పెరిగి పెద్దవారౌతారు. గతం తెలుసుకున్న ఇద్దరు రాజును రాజ్యాన్ని కాపాడతానికి పూనుకుంటారు. నాగమణిని సాధించేందుకు బయలు దేరిన ఇద్దరు దారిలో విడిపోతారు. ఒక దేవకన్యను ముసలి రూపంలో ఉన్న రక్కసి బారినుండి కాపాడి ఆమె సహాయంతో కాంతారావు నాగలోకానికి వెళతాడు. నాగకుమారి (కృష్ణకుమారి) తో ప్రేమలో పడతాడు. నాగలోకాన్ని పక్షి రాక్షసుని బారినుండి కాపాడి నాగమణితో భూలోకానికి వస్తాడు. ఈ లోగా విద్యాపతి పేదరాసి పెద్దమ్మ కూతురు విజయలలితను వృక్షరాక్షసుని బారినంది రక్షించి ఆమెను ప్రేమిస్తాడు. కాంతారావు కోసం వెతుకుతున్న రామకృష్ణ బంగారు వీణ రుపంలో ఉన్న యక్షకన్యకు నిజరూపం రప్పిస్తాడు. యక్షకన్యల వరం పొందుతాడు. రామకృష్ణ కోసం వెదుకుతూ విజయలలిత ముని శాపానికి గురౌతుంది. పగలు ముదుసలిగా రాత్రులు నిజరూపంలో గడుపుతూ మాంత్రికుచే అపహరంపబడుతుంది. మాంత్రికుడు నాగకన్యను కూడా అపహరించి చిలుకగా మార్చివేస్తాడు. రాకుమారుడు వీరిని రక్షించి, మాంత్రికుని సంహరించి, రాజును రాజ్యాన్ని కాపాడటం మిగతాకథ.

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
 • నిర్మాత: పింజల సుబ్బారావు
 • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గిడుతూరి సూర్యం
 • కథ : ఎస్.ఎం.సంతానం
 • మాటలు: చిల్లర భావనారాయణ
 • ఛాయాగ్రహణం: హెచ్.ఎస్.వేణు
 • సంగీతం: ఎస్.పి.కోదండపాణి
 • పాటలు: సినారె, శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు, చిల్లర భావనారాయణ, జి.విజయరత్నం
 • నేపథ్య గాయకులు:ఘంటసాల, బాలమురళీకృష్ణ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, పిఠాపురం, మాధవపెద్ది, కౌసల్య
 • కూర్పు: కందస్వామి
 • కళ: కుదరవల్లి నాగేశ్వరరావు
 • నృత్యం: కె.ఎస్.రెడ్డి

పాటలు

[మార్చు]
 1. ఇదియే అందాల మానవసీమ ఇలయే ప్రేమికుల మురిపాల - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆరుద్ర
 2. ఓహోహో ఓ జవరాలా నా సుమబాల - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి - రచన: జి.విజయరత్నం
 3. ఓ జలకాలలోనా పులకించిపోనా అలలాగ చెలరేగి ఈ వేళ - పి.సుశీల బృందం - రచన: డా. సి.నారాయణరెడ్డి
 4. కులుకు నడకల చినదానా తళుకు బెళుకుల నెరజాణ - ఘంటసాల బృందం - రచన: శ్రీశ్రీ
 5. గులాబి బుగ్గలున్న వన్నెలాడి నేనే చలాకి కన్నులున్న - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: డా. సి.నారాయణరెడ్డి
 6. వీరులమంటే వీరులం రణశూరులమంటే - పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, కౌసల్య - రచన: కొసరాజు
 7. శివమనోరంజనీ వరపాణి స్వరరాణీ కనవే జననీ - మంగళంపల్లి బాలమురళీకృష్ణ - రచన: చిల్లర భావనారాయణ

బయటి లింకులు

[మార్చు]