Jump to content

పుష్పకుమారి

వికీపీడియా నుండి
పుష్పకుమారి
జాతీయతభారతీయులు
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు1965 - 1982

పుష్పకుమారి దక్షిణ భారతదేశపు చలనచిత్ర నటి. ఈమె ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించింది. ఎక్కువగా సహాయ పాత్రలను ధరించింది. ఈమె ఆదుర్తి సుబ్బారావు, దుక్కిపాటి మధుసూధనరావు, తాతినేని రామారావు, వి.మధుసూధనరావు, కె.ఎస్.ప్రకాశరావు, బాపు, గిడుతూరి సూర్యం, బి.విఠలాచార్య, కె.విశ్వనాథ్, భానుమతీ రామకృష్ణ, బి.ఎ.సుబ్బారావు, విజయనిర్మల, కె.రాఘవేంద్రరావు,కె.బాపయ్య మొదలైన ప్రముఖ దర్శకుల సినిమాలలో నటించింది. ఎన్.టి.రామారావు, కృష్ణ, నాగేశ్వరరావు, చిరంజీవి, శోభన్ బాబు, కాంతారావు, చంద్రమోహన్ వంటి అగ్ర నటులతో కలిసి పనిచేసింది.

తెలుగు సినిమాల జాబితా

[మార్చు]

పుష్పకుమారి నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

సంవత్సరం సినిమా పేరు ఇతర నటులు
1965 తేనె మనసులు కృష్ణ
1966 ఆత్మగౌరవం అక్కినేని నాగేశ్వరరావు, కాంచన
1967 అవేకళ్లు కృష్ణ, కాంచన
1967 బ్రహ్మచారి అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత
1967 మంచి కుటుంబం అక్కినేని నాగేశ్వరరావు, షావుకారు జానకి
1969 భలే రంగడు అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ
1969 విచిత్ర కుటుంబం ఎన్.టి.రామారావు, సావిత్రి
1970 బాలరాజు కథ మాస్టర్ ప్రభాకర్, నాగభూషణం
1971 కథానాయకురాలు వాణిశ్రీ, శోభన్ బాబు
1971 ప్రేమనగర్ నాగేశ్వరరావు, వాణిశ్రీ
1971 రాజకోట రహస్యం ఎన్.టి.రామారావు, దేవిక
1971 రామాలయం శోభన్ బాబు, విజయనిర్మల
1972 కాలం మారింది శోభన్ బాబు, శారద
1973 నేరము శిక్ష కృష్ణ, భారతి
1973 మరపురాని మనిషి నాగేశ్వరరావు, మంజుల
1974 అమ్మాయి పెళ్ళి ఎన్.టి.రామారావు, భానుమతి
1974 ఓ సీత కథ చంద్రమోహన్, రోజారమణి
1974 దీక్ష ఎన్.టి.రామారావు, జమున
1974 విజయ రాముడు కాంతారావు, రాజశ్రీ (నటి)
1977 మనుషులు చేసిన దొంగలు కృష్ణ, మంజుల
1978 ఇంద్రధనుస్సు కృష్ణ, శారద
1978 సతీ సావిత్రి ఎన్.టి.రామారావు, వాణిశ్రీ
1979 హేమా హేమీలు నాగేశ్వరరావు, కృష్ణ, సుజాత, విజయనిర్మల
1979 శంకరాభరణం జె.వి.సోమయాజులు, మంజు భార్గవి
1981 సత్యం శివం నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు, శ్రీదేవి
1982 డాక్టర్ మాలతి శ్రీధర్
1982 శుభలేఖ చిరంజీవి, సుమలత

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]