విచిత్ర కుటుంబం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విచిత్ర కుటుంబం
దర్శకత్వంకె.ఎస్.ప్రకాశరావు
రచనభమిడిపాటి రాధాకృష్ణ (చిత్రానువాదం/మాటలు)
నిర్మాతవి.కె.పి. సుంకవల్లి
తారాగణంనందమూరి తారక రామారావు,
సావిత్రి,
ఘట్టమనేని కృష్ణ,
శోభన్ బాబు,
విజయనిర్మల
ఛాయాగ్రహణంఆర్. సంపత్
కూర్పుఆర్. దేవరాజన్
సంగీతంటి.వి.రాజు
నిర్మాణ
సంస్థ
శ్రీరాజ్ ఆర్ట్ ఫిలింస్
విడుదల తేదీ
మే 28, 1969 (1969-05-28)
సినిమా నిడివి
171 ని.
భాషతెలుగు

విచిత్ర కుటుంబం 1969 లో కె. ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో ఎన్. టి. రామారావు, సావిత్రి, కృష్ణ, విజయ నిర్మల, శోభన్ బాబు, నాగభూషణం ముఖ్య పాత్రల్లో నటించారు.

రాజశేఖరం ఒక న్యాయవాది. అమాయకురాలైన తన భార్య కమలతో కలిసి గౌరవప్రదంగా, సంతోషంగా జీవిస్తుంటాడు. అతని తమ్ముడు కృష్ణ, ఊళ్ళో అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటూ గొడవపడుతూ ఉంటాడు. ఈ తగాదాలనుంచి కమల మరిదిని కాపాడుతూ ఉంటుంది. అదే ఊళ్ళో నాగరాజు అనే భూస్వామి అక్రమాలకు పెట్టింది పేరు. అతని భార్య సుశీలకు ఇవన్నీ తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉంటుంది. నాగరాజు, రాజశేఖరం కుటుంబాల మధ్య బంధుత్వం ఉన్నా రాజశేఖరం నాగరాజు ఆగడాలను అడ్డుకుంటూ ఉండటంతో నాగరాజు అతనిమీద కక్ష పెంచుకుంటూ ఉంటాడు. నాగరాజు తల్లిదండ్రులు అతని ప్రవర్తన నచ్చక ఆస్తినంతా తమ చిన్న కొడుకు రాఘవ పేరు మీద రాసి ఉంటారు. దాంతో నాగరాజు తన తమ్ముడిని కూడా సరిగ్గా పట్టించుకోడు. రాజశేఖరం దంపతులు అతన్ని చిన్నప్పటి నుంచి బాగా చూసుకుని పై చదువుల కోసం రష్యాకి పంపిస్తారు. కమల చెల్లెలు రాధ అల్లరి పిల్ల. అక్క గారింటికి వచ్చి కృష్ణతో ప్రేమలో పడుతుంది.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి టి. వి. రాజు సంగీత దర్శకత్వం వహించగా అన్ని పాటలు సి. నారాయణ రెడ్డి వ్రాసారు.

  1. ఆడవే జలకమ్ములాడవే ఆడవే కలహంసలాగ జలకన్యలాగ- ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: డా॥ సినారె
  2. ఊపులో ఉన్నావు మావా మాంచి కైపులో ఉన్నావు మావా - ఎల్. ఆర్. ఈశ్వరి (గాయకుడు ?)
  3. ఎర్రా ఎర్రాని దానా బుర్రా బుగ్గలదానా బుర్రా బుగ్గలమీద - పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్. ఆర్. ఈశ్వరి
  4. కాచుకో చూసుకో దమ్ము తీసి రొమ్ముకాచి - ఎల్. ఆర్. ఈశ్వరి, ఘంటసాల - రచన: డా॥ సినారె
  5. నలుగురు నవ్వేరురా స్వామి గోపాల నడివీధిలో నా - పి.సుశీల
  6. పోతున్నావా తొందరపడి పోతున్నావా మనసారా వలచిన - పి.సుశీల
  7. రంగురంగుల పూలు నింగిలోనే చాలు చల్లని బంగరు - పి.సుశీల, ఘంటసాల - రచన: డా॥ సినారె
  8. శ్రీమన్ మంగళమూర్తి (శ్లోకం) - ఘంటసాల

మూలాలు

[మార్చు]
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.