శీల రవిచంద్రన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శీల రవిచంద్రన్
శీల రవిచంద్రన్ (2017)
జననం (1945-03-22) 1945 మార్చి 22 (వయసు 79)
కాణిమంగళం, త్రిసూర్‌, కేరళ
వృత్తి
 • సినిమా నటి
 • రచయిత్రి
 • సినిమా దర్శకురాలు
 • నవతా రచయిత్రి
 • చిత్రకారిణి
 • టీవి వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు
 • 1962–1981
 • 2003–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
 • జేవియర్‌
  (విడాకులు 1970)
పిల్లలుజార్జ్ విష్ణు

శీల రవిచంద్రన్ కేరళకు చెందిన సినిమా నటి, దర్శకురాలు, నవలా రచయిత్రి, టీవి వ్యాఖ్యాత. ప్రేమ్ నజీర్‌తో కలిసి అత్యధిక సంఖ్యలో (130) సినిమాలలో నటించినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించారు.[1][2] నాలుగుసార్లు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నది. 22 ఏళ్ళ సుదీర్ఘ కాలం తర్వాత 2003లో మనస్సినక్కరే ద్వారా మళ్ళీ నటించింది. 2005లో, మలయాళ చిత్రం అకాలే సినిమాలో నటించి ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. 2019లో మలయాళ సినిమాలో చేసిన కృషికి కేరళ ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన జెసి డేనియల్ అవార్డుతో సత్కరించబడింది. అత్యధిక పారితోషికం పొందిన నటీమణిగా గుర్తింపు పోయింది.[3]

జననం, విద్య[మార్చు]

శీల రవిచంద్రన్ 1945 మార్చి 22 ఒక సిరియన్ క్రైస్తవ కుటుంబంలో రైల్వే అధికారి కణిమంగళం ఆంటోనీ, గ్రేసీ దంపతులకు కేరళ రాష్ట్రంలోని త్రిసూర్‌ పట్టణంలో జన్మించింది. ఊటీలో పెరిగింది. అసుల పేరు సెలిన్. తండ్రి రైల్వేలో పనిచేసినందున త్రివేండ్రం, త్రిస్సూర్, ఊటీ, తిరుచిరాపల్లి, సేలం, ఎడపల్లి, సెయింట్ ఫ్రాన్సిస్ ఆంగ్లో-ఇండియన్ గర్ల్స్ స్కూల్, కోయంబత్తూరు వంటి ప్రాంతాలలో తన ప్రాథమిక విద్యను చదివింది.[4]

వ్యక్తిగత జీవితం[మార్చు]

రిపోర్టర్ జేవియర్‌తో శీల రవిచంద్రన్ వివాహం జరిగింది. వారు విడాకులు తీసుకున్నారు.[5]

అవార్డులు[మార్చు]

జాతీయ చలనచిత్ర అవార్డులు
కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు
 • 1969 – కల్లిచెల్లమ్మ సినిమాకి ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం
 • 1971 – ఒరు పెన్నింటే కదా, సరసయ్య, ఉమ్మచు సినిమాలకు ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం
 • 1976 – అనుభవం సినిమా ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం
 • 2004 – అకాలే సినిమాకి రెండవ ఉత్తమ నటి అవార్డు
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్
 • 1977 – ఉత్తమ మలయాళ నటి - లక్ష్మి
 • 2000 – ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు – సౌత్

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్

ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్
 • 2007– బెస్ట్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
ఇతర అవార్డులు
 • 2007 లక్స్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
 • 2006 అమృత టీవీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
 • 2019 జెసి డేనియల్ అవార్డు
 • 2019 జయన్ రాగమాలిక అవార్డు
 • 2020 మలయాళ పురస్కారం

సినిమాలు[మార్చు]

తెలుగు[మార్చు]

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం[మార్చు]

 • యక్షగానం (1976)
 • శిఖరంగల్ (1979)
 • ఒన్ను చిరిక్కూ (1983) - (కథ)

మూలాలు[మార్చు]

 1. "Records Application Search Longest Screen Partnership". Guinness World Records. 6 April 2018. Retrieved 2023-05-16.
 2. "Comeback queen". The Hindu. 27 May 2005. Archived from the original on 26 June 2007. Retrieved 2023-05-16.
 3. "Actress Sheela wins prestigious J C Daniel Award". Business Standard India. Press Trust of India. 4 June 2019. Retrieved 2023-05-16.
 4. നിത്യഹരിത നായിക ഷീലയ്‌ക്ക് 70 വയസ്‌ [Evergreen heroine Sheila is 70 years old]. Mangalam Publications. Archived from the original on 8 July 2017. Retrieved 2023-05-16.
 5. "Sheela".
 6. "Doing Malayalam proud". The Hindu. 22 July 2005. Archived from the original on 16 February 2006. Retrieved 2023-05-16.

బయటి లింకులు[మార్చు]