యాంకర్
బుల్లితెర వ్యాఖ్యాత (ఆంగ్లం: Television presenter) టెలివిజన్ కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రేక్షకులను ఆ కార్యక్రమంలో లీనమయ్యేలా వారిని ఆనందపరుస్తూ, వారికి ఉత్సాహాన్ని అందిస్తూ వారిచే కేరింతలు పెట్టించే వారినిబుల్లితెర వ్యాఖ్యాత యాంకర్ అంటారు. ఈ విధంగా వ్యాఖ్యాత ప్రేక్షకులను కార్యక్రమానికి హత్తుకుపోయేలా కట్టిపడేయడాన్ని యాంకరింగ్ అంటారు.
బుల్లితెర వారికి సినిమా
[మార్చు]ఈ రోజుల్లో, ఇతర రంగాలలోని వ్యక్తులు బుల్లితెర వ్యాఖ్యాతగా కార్యక్రమం పోషించడం సర్వసాధారణం, కోట్లాది మంది టీవీ వీక్షకులకు పరిచయం కావడానికి వేదికగా ఉండడంతో బుల్లితెర వ్యాఖ్యాత ఎంతోమందికి పరిచయమవుతున్నారు, ఆ తర్వాత వారికి ఇష్టమైన రంగంలో రాణించడానికి బుల్లితెర పరిచయం వారికి ఉపయోగపడుతుంది, దానికి ఉదాహరణ జబర్దస్త్ (హాస్య ప్రదర్శన) నుండి సినిమా రంగానికి పరిచయమైన ఎంతోమంది సినిమా నటులు, ముఖ్యంగా పిల్లల టెలివిజన్ ధారావాహికలలో, టెలివిజన్ వ్యాఖ్యాతగా బుల్లితెర పరిచయం వారికి సినిమా రంగానికి పరిచయమైన బుల్లితెర వ్యాఖ్యాతలు ...
బుల్లితెర తెలుగు యాంకర్లు
[మార్చు]- శాంతిస్వరూప్ ప్రభుత్వ ప్రచార సాధనమైన దూరదర్శన్ లో తొలి తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాత.
- సుమ కనకాల కేరళకు చెందిన ఈమె మాతృ భాష తెలుగు కానప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు.
- ఝాన్సీ (నటి) బుల్లితెర వ్యాఖ్యాత. అనేక సినిమాలలో, ధారావాహికలలో నటించింది.
- ఉదయభాను బుల్లితెర వ్యాఖ్యాత. అనేక సినిమాలలో, ధారావాహికలలో నటించింది.
- భైరగౌని కార్తీక తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాత, నటి, రేడియో జాకీ, ఆర్కిటెక్.
- ప్రదీప్ మాచిరాజు బుల్లితెర వ్యాఖ్యాత. అనేక సినిమాలలో, ధారావాహికలలో నటించిండు.
- రవి (వ్యాఖ్యాత)బుల్లితెర వ్యాఖ్యాత. అనేక సినిమాలలో, ధారావాహికలలో నటించిండు.
- అనసూయ భరధ్వాజ్బుల్లితెర వ్యాఖ్యాత. అనేక సినిమాలలో, ధారావాహికలలో నటించింది.
- రష్మి గౌతమ్ బుల్లితెర వ్యాఖ్యాత. అనేక సినిమాలలో, ధారావాహికలలో నటించింది.
- సుడిగాలి సుధీర్ బుల్లితెర వ్యాఖ్యాత. సినిమాలలో, ధారావాహికలలో కమెడియన్.
- శ్రీముఖి బుల్లితెర వ్యాఖ్యాత. అనేక సినిమాలలో, ధారావాహికలలో నటించింది.
- బిత్తిరి సత్తి (చేవెళ్ళ రవి) వ్యాఖ్యాత. సినిమాలలో, కమెడియన్.
- మంగ్లీ (సత్యవతి) బుల్లితెర వ్యాఖ్యాత. ధారావాహికలలో నటించింది.
- వర్షిణి బుల్లితెర వ్యాఖ్యాత. ధారావాహికలలో నటించింది.
- సుమలతా రెడ్డి తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాత, నటి, న్యూస్ రీడర్.
రెండు రకాలుగా
[మార్చు]సినిమా రంగంలో చాలా తొందరగా అవకాశాలు రావడానికి కి ఇబ్బంది లేకుండా అవకాశాలు వస్తున్నాయి అలాగే సినిమా ఇండస్ట్రీలో ముందు పరిచయమై దానిలో అవకాశాలు సినిమాలు తగ్గితే మళ్ళీ తెరకు వస్తున్నా పేరున్న కళాకారులు కూడా టెలివిజన్ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతలుగా నిర్వాహకులు రావడం దీనికి ఉదాహరణ సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో ను రెండు రకాలుగా విజయవంతమైన వారు కూడా ఉన్నారు. బుల్లి తెర వ్యాఖ్యాతగా చేసి రాజకీయంగా ఇతర రంగాల్లోని స్థిరపడిన వారు ...
ఇతర భాషల్లో
[మార్చు]- కొందరు టీ.వి. లో యాంకరింగ్ చేస్తూ సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు, అలాగే ప్రముఖ సినీ నటులూ టీ.వి.లో యాకరింగ్ చేస్తున్నారు. 'కౌన్ బనేగా కరోడ్ పతి' అనే టెలివిజన్ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ యాంకరుగా నటించారు.
- డోనాల్డ్ ట్రంప్ అమెరికా రాయకీయ నాయకుడు, వ్యాపారవేత్త, బుల్లితెర వ్యాఖ్యాత, రచయిత.
- కొంతమంది సమర్పకులు నటుడిగా, మోడల్‌గా, గాయకుడిగా, హాస్యనటుడిగా మరికొందరు శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు వంటి విషయ నిపుణులు కావచ్చు, (ఉదాహరణకు, డేవిడ్ అటెన్‌బరో). బ్రిటిష్ హాస్యనటుడు మైఖేల్ పాలిన్, ఇప్పుడు ప్రయాణం గురించి కార్యక్రమాలను ప్రదర్శిస్తారు (80 రోజుల్లో ఎరౌండ్ ది వరల్డ్ వంటివి),, ఒక దశాబ్దం పాటు సైంటిఫిక్ అమెరికన్ ఫ్రాంటియర్స్ సమర్పించిన అమెరికన్ నటుడు అలాన్ ఆల్డా.[1] మరొక ఉదాహరణ అమెరికన్ స్టాండ్-అప్ కమెడియన్ జో రోగన్, అతను UFC లో వ్యాఖ్యాత.
ఇది కూడ చూడు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Zimmer, Ben (July 18, 2009). "Was CronkiteReally the First "Anchorman"? How we came to use the term". Slate.