శ్రీముఖి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీముఖి
Sreemukhi at ETV Sarada Sankranthi Special Event.png
జననంశ్రీముఖి
(1993-05-10) 1993 మే 10 (వయస్సు: 27  సంవత్సరాలు)
నిజామాబాద్
జాతీయతభారతీయురాలు
చదువుబి.డి.ఎస్
వృత్తినటి, మోడల్, వ్యాఖ్యాత
క్రియాశీలక సంవత్సరాలు2012–ప్రస్తుతం
తల్లిదండ్రులురాం కిషన్ & లత
బంధువులుశుశ్రుత్ (సోదరుడు)

శ్రీముఖి ఒక ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, నటి. అదుర్స్ అనే కార్యక్రమంతో వ్యాఖ్యాతగా ప్రవేశించింది.[1] 2012 లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాతో వెండితెరపై ప్రవేశించింది. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో కథానాయిక అయ్యింది.[2]

వ్యక్తిగతం[మార్చు]

శ్రీముఖి స్వస్థలం నిజామాబాద్. తండ్రి రాం కిషన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి. తల్లి లత బ్యూటీషియన్. ఈమెకు శుశ్రుత్ అనే తమ్ముడున్నాడు. పదో తరగతి, ఇంటర్మీడియట్ లో తొంభై శాతానికిపైగా మార్కులు తెచ్చుకుంది. వైద్యవిద్య నభ్యసించాలనుకున్నది. బి. డి. ఎస్ లో సీటు కూడా సంపాదించింది. కానీ మధ్యలో టీవీ వ్యాఖ్యాతగా అవకాశం రావడంతో చదువు మధ్యలోనే ఆపేసింది.[3]

కెరీర్[మార్చు]

శ్రీముఖి సినిమాల్లోకి ప్రవేశించక మునుపు[4] అదుర్స్, సూపర్ సింగర్ 9 అనే కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి పలువురు అభిమానుల్ని సంపాదించుకుంది.[5][6] తర్వాత 2012 లో త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలు రాజీ పాత్రతో సినిమా రంగంలోకి ప్రవేశించింది. తర్వాత పవన్ సాదినేని దర్శకత్వంలో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో కథానాయికగా నటించింది. నేను శైలజ సినిమాలో హీరో రామ్ కు సోదరిగా నటించింది. శేఖర్ కమ్ముల సినిమా లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది. ధనలక్ష్మి తలుపు తడితే సినిమాలో, నారా రోహిత్ సినిమా సావిత్రి సినిమాల్లో కథానాయికగా నటించింది. తెలుగులోనే కాకుండా తమిళంలో ఎట్టుతిక్కుం మధయానై, కన్నడంలో చంద్రిక అనే సినిమాల్లో నటించింది. నానీ హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్‌మేన్ సినిమాలో కూడా ఓ పాత్రలో నటించింది.

రానా దగ్గుబాటి, ఆలీతో కలిసి దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించింది.[7] ఈటీవీ ప్లస్ లో ప్రసారమవుతున్న పటాస్, మా టీవీ లో ప్రసారమవుతున్న భలే చాంస్ లే రెండో దశ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది.

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2012 జులాయి రాజి తెలుగు
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సోనియా తెలుగు అతిథి పాత్ర
2013 ప్రేమ ఇష్క్ కాదల్ శాంతి తెలుగు కథానాయికగా మొదటి సినిమా
2015 ఎట్టుదిక్కుం మధయానై సారా తమిళం
చంద్రిక శిల్ప తెలుగు

కన్నడ

ఒకేసారి తెలుగు, కన్నడ భాషలలో చిత్రీకరించారు
ధనలక్ష్మి తలుపు తడితే చిత్ర తెలుగు
ఆంధ్రా పోరి స్వప్న తెలుగు
2016 నేను శైలజ స్వేచ్ఛ తెలుగు
సావిత్రి బేబీ తెలుగు
జెంటిల్_మేన్ నిత్య తెలుగు
మనలో ఒకడు తెలుగు
2017 బాబు బాగా బిజి తెలుగు

మూలాలు[మార్చు]

  1. "Telly shows are more fun than films: Sree Mukhi". Retrieved 17 September 2014. Cite web requires |website= (help)
  2. "Prema Ishq Kadhal: Love, sex and dhoka". Cite web requires |website= (help)
  3. Eenadu. "ఎక్కడైనా రాములమ్మనే! - EENADU". www.eenadu.net (ఆంగ్లం లో). మూలం నుండి 2019-11-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2019-11-07.
  4. "Sree Mukhi talks about her debut on TV". Retrieved 12 December 2015. Cite web requires |website= (help)
  5. "Sree Mukhi talks about her debut on TV". Cite web requires |website= (help)
  6. "Sreemukhi trendy outfits at Super Singer 9". Cite web requires |website= (help)
  7. "Sreemukhi It was amazing to host SIIMA". Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=శ్రీముఖి&oldid=2885579" నుండి వెలికితీశారు