లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
దర్శకత్వంశేఖర్ కమ్ముల
రచనశేఖర్ కమ్ముల
నిర్మాతశేఖర్ కమ్ముల
చంద్రశేఖర్ కమ్ముల
తారాగణం
  • అమల
  • అభిజిత్
  • సుధాకర్
  • కౌషిక్
  • శ్రియ
  • అంజులా ఝావేరి
ఛాయాగ్రహణంవిజయ్ సి. కుమార్
సంగీతంమిక్కీ జె. మేయర్
నిర్మాణ
సంస్థ
ఎమిగోస్ క్రియేషన్స్
విడుదల తేదీ
14 సెప్టెంబరు 2012 (2012-09-14)
సినిమా నిడివి
167 minutes
భాషతెలుగు
బాక్సాఫీసు17.5 crore (US$2.2 million)(17 days)[1]


లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ (ఆంగ్లం: Life is Beautiful) 2012లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ సినిమాకు కథ, దర్శకత్వాన్ని శేఖర్ కమ్ముల అందించాడు. ఈ సినిమాలో కొత్తవారైన అభిజిత్, సుధాకర్, కౌషిక్ నటించారు. ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో అమల అక్కినేని, శ్రియ, అంజులా ఝావేరి ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ కమ్ముల సంయుక్తంగా ఎమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ సి. కుమార్ ఛాయాగ్రాహకుడు.[2]

విశాఖపట్నంలో ఉండే అమల ( అమల అక్కినేని) తనకు ట్రాన్స్ ఫర్ అయింది, వేరే ఊరు షిఫ్ట్ అవ్వాలి కాబట్టి తాతయ్య, అమ్మమ్మ ల దగ్గర ఉండమని తన ముగ్గురు పిల్లల్ని హైదరాబాద్ పంపిస్తుంది. దీంతో తన ఇద్దరి చెల్లెల్ని తీసుకుని శ్రీనివాస్ (అభిజిత్) హైదరాబాద్ లోని సన్ షైన్ వ్యాలీ కాలనీకి వస్తాడు. ఈ కాలనీలో అతనికి నాగరాజు ( సుధాకర్), అభి (కౌషిక్) లు పరిచయం అవుతారు. నాగరాజు ( సుధాకర్)తో చివరికి అనేక తగాదాల నడుమ తన ప్రేమను అంగీకరిస్తుంది. అదేవిధంగా శ్రీనివాస్ (అభిజిత్) తన అత్తమ్మ కూతురు పద్దు (షాగన్) ప్రేమలో పడుతాడు. దీనిని వాళ్ళ అమ్మ తిరస్కరిస్తుంది. ఇది ఇలా ఉండగా శ్రియ, అభి (కౌషిక్) ల మధ్య సన్నిహితం పెరుగుతుంది. ఇది గోల్స్ ఫేజ్ వారికీ నచ్చకపోగా తనపై కోపాన్ని పెంచుకుంటారు. ఈ క్రమంలో శ్రియ అందాల పోటీల్లోలో పాల్గొని గెలుపొందుంతుంది. ముఖ్యంగా ఈ కథ అంతా గోల్డ్ ఫేజ్ కి, సన్ షైన్ వాలీకి నడుమ జరుగుతుంది. ఈ కథలో ప్రేమలో ఎవరెవరు పడ్డారు? శ్రీనివాస్ (అభిజిత్) అమ్మ ఎందుకు వారిని హైదరాబాద్ కి పంపించింది? అసలు కాలనిల నడుమ తగువులు ఎందుకు? తెలుపడమే మిగితా కథ సారాంశం.

నటవర్గం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

లీడర్ సినిమా విడుదల ఏడు నెలల తర్వాత 2010, ఆగస్టు నెలలో శేఖర్ కమ్ముల ఈ సినిమా యొక్క ప్రకటనను విడుదల చేసారు. ఈ సినిమాని మొదట హీరో వరుణ్ సందేశ్‌తో తీయాలని యోచించారు కానీ తర్వాత ఈ సినిమాని కొత్తవారితో తీయాలని యోచించి ఎనిమిది నెలల పాటు ఆడిషన్ నిర్వహించి నూతన నటీనటులను ఎంపిక చేసారు. ఆ తర్వాత ఈ సినిమా నిర్మాణం జూన్ 2011లో మొదలు పెట్టి ఫిబ్రవరి 2012 వరకు పూర్తీ చేసి జులై 6, 2012న తొలి బుల్లి ప్రచార చిత్రాన్ని సినిమా బృందం విడుదల చేసింది. అదే విధంగా ఈ సినిమాని శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ కమ్ముల సంయుక్తంగా అమిగోస్ బ్యానర్ పై నిర్మించారు.

సంగీతం

[మార్చు]
Untitled

ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని స్వరపరిచారు.

సం.పాటపాట రచయితగాయకుడు(లు)పాట నిడివి
1."లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్"అనంత శ్రీరామ్కె.కె.05:21
2."బ్యూటీఫుల్ గర్ల్"వనమాలికార్తిక్04:40
3."అటు ఇటు ఉగుతు"అనంత శ్రీరామ్శ్రీ రామచంద్ర05:28
4."ఇట్స్ యువర్ లవ్"అనంత శ్రీరామ్నరేష్ అయ్యర్05:08
5."అమ్మ అనీ కొత్తగా"వనమాలిశశికిరణ్, శ్రావణ భార్గవి05:34
6."లైఫ్ ఈజ్ బ్యూటీ పాప్"అనంత శ్రీరామ్  
మొత్తం నిడివి:31:57

విడుదల

[మార్చు]

ఈ సినిమా సెప్టెంబర్ 14 2012 న విడుదలయింది.

పురస్కారాలు

[మార్చు]

ఈ సినిమాకి అమల అక్కినేనికి 63 వ ఫీల్ంఫేర్ ఉత్సవంలో ఉత్తమ నటీగా సపోర్టీంగ రోల్ విభాగంలో అవార్డు వరించింది. ఇదే సినిమాలోని పాత్రకు గాను ఉత్తమ సహాయ నటిగా అమల అక్కినేనికి సినీమా అవార్డు లభించింది.

వసూళ్లు

[మార్చు]

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 17.5 కోట్లను ( 17 రోజులకు) వసూలు చేసింది

మూలాలు

[మార్చు]
  1. "infoonlinepages.com".
  2. "లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ : రివ్యూ". www.apherald.com. Retrieved 30 March 2018.