వరుణ్ సందేశ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వరుణ్ సందేశ్
Vaarun sandesh.jpg
జన్మ నామం వరుణ్ సందేశ్
జననం (1989-07-21) జూలై 21, 1989 (వయస్సు: 28  సంవత్సరాలు)
రాయగడ, ఒడిషా, భారతదేశం[1], నివాసం : న్యూ జెర్సీ, అమెరికా
హైదరాబాద్, భారత్
ప్రముఖ పాత్రలు హ్యాపీ డేస్,
కొత్త బంగారు లోకం

వరుణ్ సందేశ్ ఒక తెలుగు నటుడు. పూర్వీకులది ఆంధ్రప్రదేశ్ అయినప్పటికి అమెరికాలో స్థిరపడ్డారు.

నేపధ్యము[మార్చు]

ఒడిషాలోని రాయగడలో జన్మించాడు. తరువాత వీరి కుటుంబం హైదరాబాద్ మారడంతో అక్కడ నాలుగేళ్ళు ఉన్నాడు. తర్వాత అమెరికా వెళ్ళి పోయాడు. విద్యాభ్యాసమంతా అమెరికా లోనే జరిగింది. హ్యాపీడేస్ చిత్రం కోసం శేఖర్ కమ్ముల నిర్వహించిన నటనా పోటీలలో పాల్గొని ఆ చిత్రంలో చందు పాత్రను పోషించాడు. ఆచిత్ర విజయంతో వరుస అవకాశాలు చేజిక్కించుకొని నటునిగా స్థిరపడ్డాడు. హైదరాబాదుకు తన మకాం మార్చాడు.

కుటుంబము[మార్చు]

ఇతను ప్రముఖ రచయిత జీడిగుంట శ్రీరామచంద్రమూర్తి మనవడు. ఇతని బాబాయి జీడిగుంట శ్రీధర్ పేరుగల నటుడు.[2][3]. వీరి కుటుంబంలో తల్లి గృహిణి, తండ్రి ఐ.బి.ఎంలో ఉద్యోగి. చెల్లెలు వీణా సాహితీ అలా మొదలైంది చిత్రానికి సాహిత్యాన్ని సమకూర్చింది.[4]. తన సహనటి శ్రద్దా దాస్తో కొన్నాళ్ళు సహజీవనం చేశాడు.[5][6][7]

నటించిన చిత్రాలు[మార్చు]

 1. ఢి ఫర్ దోపిడి (2013)
 2. చమ్మక్ చల్లో (2013)
 3. కుదిరితే కప్పు కాఫీ (2011)
 4. బ్రహ్మిగాడి కథ (2011)
 5. హ్యాపీ హ్యాపీగా (2010)
 6. మరో చరిత్ర (2010)
 7. ఎవరైనా ఎపుడైనా (2009)
 8. కుర్రాడు (2009)
 9. కొత్త బంగారు లోకం (2008)
 10. హ్యాపీ డేస్ (2007)

బయటి లంకెలు[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వరుణ్ సందేశ్ పేజీ

మూలాలు[మార్చు]

 1. "Varun Sandesh". www.idlebrain.com. Retrieved 2008-10-30. 
 2. http://www.maastars.com/3097/varun-sandesh-interview
 3. http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/waiting-for-the-turn/article3388744.ece
 4. http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/article902496.ece
 5. http://articles.timesofindia.indiatimes.com/2011-07-29/news-interviews/29825269_1_shraddha-das-film-industry-bollywood-film
 6. http://entertainment.oneindia.in/telugu/news/2011/varun-sandesh-broke-shraddha-das-heart-290711.html
 7. http://articles.timesofindia.indiatimes.com/2012-03-04/news-interviews/31119769_1_shraddha-das-hindi-film-prakash-jha