మరో చరిత్ర (2010 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మరో చరిత్ర
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం రవి యాదవ్
నిర్మాణం దిల్ రాజు
ఎన్.ఎం.పాషా
తారాగణం వరుణ్ సందేష్, అనితా గేలర్, శ్రద్ధా దాస్
సంగీతం మిక్కీ జె. మేయర్
ఎస్.ఎస్. తమన్
గీతరచన అత్రేయ
వేటూరి సుందరరామమూర్తి
ఛాయాగ్రహణం రవి యాదవ్
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్
భాష తెలుగు

మరోచరిత్ర 2010 లో వచ్చిన తెలుగు సినిమా. ఇది కమల్ హాసన్, సరిత నటించి, 1978 లో అదే పేరుతో వచ్చిన చిత్రానికి అనుకరణ. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, కొత్తగా వచ్చిన అనిత ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు, రవి యాదవ్ దర్శకత్వం వహించాడు. కె. బాలచందర్ కథ, ఉమర్జీ అనురాధ సంభాషణలు రాసారు. 2008 హిందీ చిత్రం రేస్కు చెందిన రవి యాదవ్ ఛాయాగ్రహణం. మిక్కీ జె మేయర్ పాటలకు స్వరరచన చెయ్యగా, నేపథ్య సంగీతాన్ని తమన్ ఇచ్చాడు. ఈ చిత్రం 2010 మార్చి 25 న విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అపజయం పాలైంది.

బాలు ( వరుణ్ సందేశ్ ) అమెరికాలో పుట్టిన బాధ్యత తెలియని కుర్రాడు. అతను ఇంటి మీద గాలి మళ్ళి తాను చదివే కోర్సును వదిలేస్తాడు.ఇంతలో, భారతదేశంలో జన్మించిన స్వప్న (అనిత) అమెరికా వెళ్లి బాలు ఇంటి పక్క ఇంట్లో చేరుతుంది. ఆమెకు ఇంగ్లీష్ తెలియదు కాబట్టి ఆమె ఇంటి బయట ఉన్నప్పుడు మాట్లాడదు. అంచేత ఆమె మూగది అని అనుకుంటూంటారంతా. బాలు స్వప్నతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు కాని ఆమె సమాధానం ఇవ్వదు. అతను ఆమెతో మాట్లాడాలని, ఆమె పేరు తెలుసుకోవాలనీ ఆమెను వెంబడిస్తాడు. ఓ సారి రెండు కుటుంబాలూ ఆలయంలో ఉన్న సమయంలో బాలు, స్వప్న మాట్లాడటం చూస్తాడు. ఒక రోజు స్వప్న తాను అతన్ని ప్రేమిస్తున్నానని, అతనితోనే ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాననీ చెబుతుంది. అతను కూడా ఆమెను ప్రేమిస్తున్నానని చెబుతాడు. కానీ వారి కుటుంబాలు ఒకరినొకరు ఇష్టపడవు. స్వప్న కుటుంబం తక్కువ క్లాసు భారతీయ కుటుంబం అని బాలు తండ్రి భావిస్తాడు. వారికి అమెరికాలో ఎలా జీవించాలో తెలియదని అంటాడు. స్వప్న, బాలుల ప్రేమ గురించి తెలుసుకున్నప్పుడు, వారిద్దరినీ వారివారి కుటుంబాలు వెళ్ళగొడతాయి. బాలు ఆమె కుటుంబాన్ని ఒప్పించటానికి, తాము ఒక సంవత్సరం పాఅటు ఒకరినొకరు కలుసుకోమని, మాట్లాడూ కోమనీ చెప్పి, ఆ తరువాత తామిద్దరూ పెళ్ళి చేసుకుంటామనీ, ఒకవేళ అలా ఉండలేకపోతే వాళ్లకు ఇష్టమైనవాళ్లకు ఇచ్చి పెళ్ళి చెయ్యవచ్చనీ లేదంటే చెప్పి ఒప్పిస్తారు..

బాలు ఉద్యోగం కోసం న్యూయార్క్ వెళ్తాడు, అక్కడ అతను తన యజమాని సంధ్య ( శ్రద్ధా దాస్ ) ను కలుస్తాడు; ఆమె చాలా కఠినమైనది కాని మంచి వ్యక్తి. కారు ప్రమాదంలో ఒకే రోజున తన ప్రియుణ్ణీ, తండ్రినీ కోల్పోయింది, కానీ ఆమె జీవితంలో ఆ ఘటన దాటి ముందుకు వెళ్ళలేదు. చనిపోయిన ప్రేమికుడిని ఇప్పటికీ ప్రేమిస్తూంటుంది. స్వప్నను ఇష్టపడే స్వప్న బావ అమెరికాకు వచ్చి ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు. స్వప్న తల్లి కూడా అదే కోరుకుంటుంది. కానీ ఒక సంవత్సరం ఒప్పందం కారణంగా అ పెళ్ళి కుదరదు. స్వప్న బంధువు ఒక అపార్థాన్ని సృష్టించి, కొన్ని నకిలీ ఎంగేజ్మెంట్ ఫోటోలను చూపించి తానూ స్వప్నా పెళ్ళి చేసుకుంటున్నామని చెబుతాడు. బాలు అతన్ని నమ్ముతాడు. సంధ్యతో డేటింగ్ ప్రారంభిస్తాడు. బాలు పెళ్ళి చేసుకోబోతున్నాడని ఆమె బావ అదే అబద్ధాన్ని స్వప్నకూ చెబుతాడు. కాని స్వప్న దానిని నమ్మదు. ఒకరోజు సంధ్య బాలు ఫోన్‌లో స్వప్న, బాలుల వీడియోను చూసి, బాలును వివాహం చేసుకుంటానని చెప్పకుండా స్వప్నను కలుస్తుంది. ఉత్సాహంలో ఉన్న స్వప్న సంధ్యకు తనను ఎంతగా ప్రేమిస్తుందో, వారి ప్రేమకథను చెబుతుంది. అతను మరొక అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడని ప్రజలు నమ్ముతున్నారని కూడా ఆమె చెబుతుంది, కానీ తనకు బాలుపై నమ్మకం ఉందనీ, ఆ పుకార్లను నమ్మననీ ఎప్పటికీ వేచి ఉంటాననీ చెబుతుంది. ఇంతకుముందు ఒకసారి తన ప్రేమను పోగొట్టుకున్న సంధ్య, తిరిగి న్యూయార్క్ వెళ్లి, బాలుకు ఇదంతా అపార్థం అని చెబుతుంది, స్వప్న ఇంతకుముందు లాగానే అతన్ని ప్రేమిస్తోందనీ, అతను తిరిగి వస్తాడని ఎదురుచూస్తోందనీ చెబుతుంది. బాలును ఆమె వద్దకు తిరిగి వెళ్ళమని కూడా చెబుతుంది. సంవత్సరం తరువాత బాలు తిరిగి వచ్చినప్పుడు, రెండు కుటుంబాలు వారి ఒప్పందాన్ని తుంగలో తొక్కి, వారి పెళ్ళికి అడ్డుపడతాయి. బాలు, స్వప్నలు తమ తల్లిదండ్రుల కళ్ళెదురు గానే ఒక జలపాతం నుండి దూకేస్తారు. వారు చనిపోయారని నమ్ముతారు గానీ నిజం ఏమిటంటే వారు జలపాతం నుండి క్షేమంగా బయటకు వచ్చి పారిపోతారు.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

2010 ఫిబ్రవరి 14 న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తారామతి - బారాదరి వద్ద మరోచరిత్ర పాటలను విడుదల చేసారు.. రామ్ చరణ్ తేజ ఆడియో సిడిని లాంచ్ చేసి వివి వినాయక్ కు మొదటి యూనిట్ ఇచ్చారు. [1]

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "ప్రేమనే పేరుతో"  కార్తిక్ 4:29
2. "ఏ తీగ పువ్వునో"  శ్వేతా పండిట్ 3:37
3. "భలె భలే మగాడివోయ్"  శ్వేతా పండిట్ 4:17
4. "నిన్ను నన్ను"  శ్వేతా పండిట్, శ్రీమధుమిత 4:22
5. "వి డోంట్ కేర్"  రంజిత్, స్మియ్త, వరుణ్ సందేశ్ 4:36
6. "ఏ తీగ పువ్వునో"  కార్తిక్ 4:54
26:15

మూలాలు

[మార్చు]
  1. "Maro Charitra music launch - Telugu cinema - Varun Sandesh & Anita". idlebrain.com. Retrieved 14 February 2010.