విజయ నరేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయ నరేష్

నరేష్
జన్మ నామంనరేష్ కృష్ణమూర్తి
జననం (1960-01-20) 1960 జనవరి 20 (వయసు 64)
ప్రముఖ పాత్రలు నాలుగు స్తంభాలాట
శ్రీవారికి ప్రేమలేఖ
చిత్రం భళారే విచిత్రం

విజయ నరేష్ లేదా నరేష్ తెలుగు సినీ నటుడు. ఇతను నటి విజయ నిర్మల కుమారుడు. అనేక తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ముఖ్యంగా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.[1][2]

నేపథ్యము[మార్చు]

బాలనటుడిగా 1972లో పండంటి కాపురం చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. 1982లో ఇతని తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో ప్రేమ సంకెళ్ళు చిత్రంలో కథానాయకుడిగా నటించాడు, కానీ ఆ చిత్రం విజయవంతం కాలేదు. తర్వాతి కాలంలో అనేక హాస్య ప్రధాన చిత్రాలలో నటించి నటుడిగా మంచిపేరు తెచ్చుకున్నాడు. ఇతను కథానాయకిడిగా నటించిన చిత్రం జంబలకిడి పంబ తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించిన హాస్యచిత్రంగా నిలిచింది. కొద్దికాలంగా సహాయ పాత్రలను పోషిస్తున్నాడు. ప్రతినాయక పాత్రలను కూడా పోషించనున్నట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 2019 మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో అంతకు మునుపు అధ్యక్షుడైన శివాజీ రాజా మీద 69 ఓట్ల ఆధిక్యంతో గెలిచి అధ్యక్షుడయ్యాడు.[3]

వ్యక్తిగత జీవితము[మార్చు]

ఇతని వివాహము మూడుసార్లు జరిగింది. మొదటి సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు నవీన్ జన్మించిన తర్వాత మనస్ఫర్ధల కారణంగా విడిపోయారు. తర్వాత రెండో పెళ్ళి చేసుకున్నాక అది కూడా విడాకులవరకు వచ్చింది. 50 ఏళ్ళ వయస్సులో ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకుడు అయిన రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను 2010 డిసెంబరు 3న హిందూపురంలో వివాహం చేసుకున్నాడు. ముగ్గురు కొడుకులు.[4][5]

రాజకీయ జీవితము[మార్చు]

1990వ దశకంలో రాజకీయ అనిశ్చితి వల్ల వాజ్‌పేయి ప్రభుత్వం కేవలం పదమూడు రోజులో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ సమయంలో వాజపేయి ప్రసంగానికి ఉత్తేజితుడై భారతీయ జనతా పార్టీలో చేరి కొంతకాలం చురుకైన పాత్ర పోషించాడు. యువ నాయకుడి నుంచి రాష్ట్ర జనరల్ సెక్రటరీ స్థాయికి ఎదిగాడు. 2009లో పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తరువాత బిజెపిని వదిలిపెట్టాడు.

నటించిన చిత్రాల పాక్షిక జాబితా[మార్చు]

పురస్కారాలు[మార్చు]

  1. నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు: ఎస్వీ రంగారావు పురస్కారం[12][13][14][15]
  2. ఫిలిప్పీన్స్ రాజధాని మనిలాలో నరేష్ విజయకృష్ణ కి 'సర్' అనే బిరుదు తో పాటు గౌరవ డాక్టరేట్ ని ప్రదానం చేశారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్ సంస్థ తో పాటు ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ విభాగాలు కలిసి నిర్వహించిన సమావేశాలలో నరేష్ ను మిలటరీ ఆర్ట్స్ గుడ్ విల్ అంబాసిడర్ గా, లెఫ్టినెంట్ కల్నల్ గా నియమించారు. ఈ విధమైన గౌరవం పొందిన తొలి నటుడు దేశంలో నరేష్.[16]

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". ర‌మేష్ గోపిశెట్టి. Archived from the original on 19 July 2020. Retrieved 19 July 2020.
  2. Andhrajyothy (25 November 2023). "నరేష్ విజయకృష్ణకు అరుదైన గౌరవం, 'సర్' డాక్టరేట్ బిరుదు ప్రదానం". Archived from the original on 25 November 2023. Retrieved 25 November 2023.
  3. "'మా' అధ్యక్షుడిగా నరేష్‌". 12 March 2019. Archived from the original on 12 March 2019.
  4. http://www.cinejosh.com/ap-telugu-gossips/4/7198/senior-hero-naresh-naresh-marriage-with-ramya-jandhyala-actor-naresh-character-artist-naresh-bjp-leader-naresh-.html
  5. నటుడు నరేష్ పేరుకు ముందు విజయ[permanent dead link]
  6. 123 తెలుగు, సినిమా రివ్యూ (5 December 2014). "Lakshmi Raave Maa Intiki Telugu Movie Review". www.123telugu.com. Archived from the original on 23 March 2018. Retrieved 8 August 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  7. సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్‌' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 March 2020. Retrieved 2 April 2020.
  8. సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
  9. ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడ‌వురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
  10. సాక్షి, సినిమా (24 January 2020). "'డిస్కో రాజా' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 25 January 2020. Retrieved 24 January 2020. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 24 జనవరి 2020 suggested (help)
  11. ఈనాడు, సినిమా (24 January 2020). "రివ్యూ: డిస్కోరాజా". Archived from the original on 24 January 2020. Retrieved 24 January 2020.
  12. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
  13. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  14. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  15. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  16. "నరేష్ కి అరుదైన గౌరవం". ఈనాడు దినపత్రిక. 26 November 2023.

బయటి లంకెలు[మార్చు]