వీరాంజనేయులు విహారయాత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీరాంజనేయులు విహారయాత్ర
దర్శకత్వంఅనురాగ్‌ పలుట్ల
రచనఅనురాగ్‌ పలుట్ల
నిర్మాతబాపినీడు.బి, సుధీర్ ఈదర
తారాగణం
ఛాయాగ్రహణంఅంకూర్ సీ
కూర్పునరేష్ అడపా, హరి శంకర్ టి.ఎన్
సంగీతంసింజిత్ ఎర్రమల్లి
నిర్మాణ
సంస్థ
ఎ విన్ ఒరిజినల్
విడుదల తేదీ
14 ఆగస్టు 2024 (2024-08-14)
దేశంభారతదేశం
భాషతెలుగు

వీరాంజనేయులు విహారయాత్ర 2024లో విడుదలకానున్న తెలుగు వెబ్​సిరీస్‌. ఎ విన్ ఒరిజినల్ బ్యానర్‌పై బాపినీడు.బి, సుధీర్ ఈదర నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు అనురాగ్‌ పలుట్ల దర్శకత్వం వహించారు. నరేష్, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ టీజర్‌ను జులై 26న,[1] ట్రైలర్‌ను జులై న విడుదల చేయగా, సిరీస్‌ను ఆగ‌స్ట్ 14న ఈటీవీ విన్ ఓటీటీలో విడుదల చేయనున్నారు.[2]

వీరాంజనేయులు (బ్రహ్మానందం) ఒక కుటుంబ పెద్ద. ఆయన చనిపోయినా ఆయన అస్తికలు మాత్రం ఇంకా ఏ నదిలో కలపకుండా ఉండడంతో ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరపకూడదని శాస్త్రి చెప్పడంతో కూతురు పెళ్లి కోసం ఇష్టం లేకున్నా వీరాంజనేయులు కొడుకు కుటుంబంతో సహా అస్థికలు కలపడానికి బయల్దేరతారు. అది కూడా వీరాంజనేయులు తన అస్థికలను గంగలో కలపమని కోరడు. గోవాలో కలపమని కోరడంతో చేసేది లేక గోవాకే బయల్దేరతారు. ఇక అలా వెళ్తున్న ఈ కుటుంబానికి మధ్యలో ఎదురైనా పరిస్థితులు ఏంటి ? చివరికి వీరు గోవా చేరుకున్నారా ? లేదా ? అనేదే మిగతా కథ.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఎ విన్ ఒరిజినల్
  • నిర్మాత: బాపినీడు.బి, సుధీర్ ఈదర
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనురాగ్‌ పలుట్ల
  • సంగీతం: సింజిత్ ఎర్రమల్లి
  • సినిమాటోగ్రఫీ: అంకుర్ సి
  • ఎడిటర్: నరేష్ అడపా, హరి శంకర్ టి.ఎన్
  • పాటలు: శనపతి భరద్వాజ్ పాత్రుడు, కృష్ణ కాంత్, కిట్టు విస్సాప్రగడ

మూలాలు

[మార్చు]
  1. "వినోదాత్మకంగా వీరాంజనేయులు విహారయాత్ర టీజర్". 26 July 2024. Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
  2. Eenadu (20 July 2024). "'ఈటీవీ విన్‌'లో 'వీరాంజనేయులు విహార యాత్ర'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
  3. Hindustantimes Telugu (16 April 2024). "డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్ర‌హ్మానందం కామెడీ మూవీ వీరాంజ‌నేయులు విహార‌యాత్ర - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
  4. Mana Telangana (27 July 2024). "నాలుగు కాలాల పాటు గుర్తుండే సినిమా వీరాంజనేయులు విహారయాత్ర". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.