Jump to content

శ్రీవారికి ప్రేమలేఖ

వికీపీడియా నుండి
శ్రీవారికి ప్రేమలేఖ
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం జంధ్యాల
నిర్మాణం రామోజీరావు
కథ పొత్తూరి విజయలక్ష్మి
తారాగణం నరేష్,
పూర్ణిమ
సంగీతం రమేష్ నాయుడు
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
భాష తెలుగు

శ్రీవారికి ప్రేమలేఖ 1984లో విడుదలైన ఉషాకిరణ్ మూవీస్ వారి తొలిసినిమా. ఈ సినిమాతో రామోజీరావు నిర్మాతగా మారి తర్వాతి కాలంలో ప్రతిఘటన, మౌనపోరాటం, మయూరి లాంటి సంచలనచిత్రాలను నిర్మించాడు. ప్రేమలేఖ పేరుతో చతుర మాసపత్రికలో వచ్చిన నవల ఈ సినిమాకు ఆధారం. రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి.[1]

జంద్యాల దర్శకత్వం వహించగా, నరేష్, పూర్ణిమ జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం రమేష్ నాయుడు అందించారు.

గాయని జానకి ఈ సినిమాలో పాడిన మనసా తుళ్ళిపడకే... పాటకు జాతీయబహుమతి వచ్చింది. ఈ సినిమాలోని తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు అనే మరో పాట బహుళజనాదరణ పొందింది.

శ్రీమంతుడైన పరంధామయ్య కు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. చిన్న కొడుకు ఆనందరావు విశాఖ పట్నం లోని ఓ కంపెనీలో పనిచేస్తుంటాడు. అదే ఊళ్లో మధ్యతరగతి కుటుంబానికి చెందిన తిలక్, జానకి దంపతులకు ఇద్దరు కూతుర్లు హేమ, స్వర్ణ. అల్లరిపిల్లయైన స్వర్ణ తన స్నేహితురాళ్ళతో పందెం కాసి ఒక సోనీ అనే పేరుతో ప్రేమలేఖ రాసి తోచిన పేరు (ఆనందరావు) రాసి పంపిస్తుంది. అది ఆనందరావుకు చేరుతుంది. ఆనందరావు ఆ సోనీ ఎవరో కనుక్కోవాలని అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటాడు. ఆమెనే పెళ్ళి చేసుకోవాలని అతని కోరిక. మరో వైపు ఆనందరావు తండ్రి అతనికి పెళ్ళి సంబంధాలు చూస్తుంటాడు. హేమ ఇంటికి వచ్చిన స్వర్ణ ఎదురింట్లో ఉన్న ఆనందరావును ప్రేమిస్తుంది.

ఆనందరావు ఆఫీసులో పనిచేసే మార్గరెట్, తన చెల్లెలు రీటా ని సోనీగా నమ్మిస్తుంది. ఆనందరావు అది నిజమని నమ్మి ఆమెను ప్రేమిస్తాడు. వారిద్దరి ప్రేమను గురించి తెలుసుకున్న స్వర్ణ ఇంటికి తిరిగి వచ్చి తండ్రి చెప్పిన సంబంధాన్ని చేసుకోవడానికి సిద్ధ పడుతుంది. మార్గరెట్ నాటకం బయటపడటంతో ఆనందరావు కూడా తండ్రి చెప్పిన సంబంధాన్ని అంగీకరిస్తాడు. ఆనందరావు పెళ్ళి కూతురు స్వర్ణ, తనకు ప్రేమలేఖ రాసిన సోనీ ఒకరే అని తెలుసుకుని ఇద్దరూ పెళ్ళి చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

ప్రసిద్ధ హాస్య రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి రాసిన తొలి నవల ప్రేమలేఖ చతుర పత్రికలో ప్రచురితమైంది.

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. శిష్ట్లా జానకి
  2. లిపిలేని కంటి భాష , రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,ఎస్ జానకి
  3. మనసా తుళ్ళిపడకే రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: ఎస్. జానకి
  4. రఘువంశ సుధ, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం . శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం , శైలజ
  5. పెళ్లాడా పెళ్ళాడూ, రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ
  6. సరిగమపదని, రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు

[మార్చు]
  1. పులగం, చిన్నారాయణ. జంధ్యామారుతం 1. హైదరాబాదు: హాసం ప్రచురణలు. p. 67.
  2. ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". ర‌మేష్ గోపిశెట్టి. Archived from the original on 19 జూలై 2020. Retrieved 19 July 2020.