మౌన పోరాటం

వికీపీడియా నుండి
(మౌనపోరాటం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మౌన పోరాటం
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ. మోహన గాంధీ
తారాగణం వినోద్ కుమార్,
యమున
సంగీతం ఎస్. జానకి
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
భాష తెలుగు

మౌన పోరాటం 1989లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై సబిత అనే ఒక ఆదివాసి మహిళ జీవిత కథ ఆధారంగా తీసిన చిత్రం. దీనిని రామోజీరావు సమాజాన్ని కదిలించే సినిమాగా నిర్మించారు. దీనిలో కథానాయిక దుర్గగా యమున నటించింది.[1] ఈ సినిమాకు నేపధ్యగాయని ఎస్.జానకి సంగీత దర్శకత్వం వహించారు. ఈమె సంగీత దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ఇది. మోహన గాంధి ఈ చిత్రానికి దర్శకుడు.[2]

ఒక కోయ గూడానికి ఫారెస్టు ఆఫీసరుగా రాజశేఖరం అనే యువకుడు వస్తాడు. దుర్గ ఈ గూడేం లో చలాకీగా తిరిగే ఒక అమ్మాయి. ఆమెను విపరీతంగా ప్రేమించే మేనమామ ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు. రాజశేఖరం గూడెం బాగోగులు చూస్తూ మిగతా ఆఫీసర్ల కన్నా భిన్నంగా ప్రజా సంక్షేమం కోసం పాటు పడే నిస్వార్ధ మనిషిగా అందరి మన్ననలు పొందుతాడు. దుర్గ అతన్ని నమ్ముతుంది. గూడం సాంప్రదాయం ప్రకారం అతను ఆమెను వివాహం చేసుకుంటాడు. అయితే ఆ తరువాతే అతని అసలు రంగు బైటపడుతుంది. అతని మంచితనం, ప్రజా సంక్షేమ కార్యక్రామాలు అన్ని ప్రజలను నమ్మించడానికి అతని ఎత్తుగడలని తెలుస్తుంది. దుర్గ అన్న చనిపోయిన తరువాత ఆమె బంధువు ఆమె భాద్యత తీసుకుంటాడు. అతను ప్రజాపోరాటంలో జైలుకి వెళ్తాడు. దుర్గను ఆమె మేనమామకిచ్చి వివాహం చేయాలని అతను అనుకుంటాడు. కాని దుర్గ తాను ఆఫీసరును వివాహం చేసుకున్నానని ఇప్పుడు గర్బవతిని అని చెబుతుంది. తన భర్త తనకు అన్యాయం చేయడని నమ్ముతుంది. కాని ఆ అఫీసరు ఆ కడుపులో బిడ్డకు తనకు ఏం సంబంధం లేదని పట్నానికి వెళ్ళిపోతాడు. దుర్గ జైలు పాలవుతుంది. అక్కడే బిడ్డను కంటుంది.

జైలు నుండి ఆమె సరాసరి రాజశేఖరం ఇంటికి వెళుతుంది. అక్కడే మౌనపోరాటం చెస్తుంది. ఆమెకు మహిళా సంఘాలు మద్దతు ఇస్తాయి. చివరకు లోక్ అదాలత్ నియమించబడుతుంది. అక్కడ ఆ బిడ్డ తన కొడుకే అని తాను చేసింది తప్పని రాజశేఖరం వప్పుకుంటాడు. అతన్ని వివాహం చేసుకోవడానికి దుర్గ నిరాకరిస్తుంది. తన బిడ్డ కు తండ్రి పేరు కోసమే తానీ పోరాటం చేసానని అతని భార్యగా అతనింట్లో స్థానం కోసం కాదని ఆమె తన గూడానికి వెళ్ళిపోతుంది.

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]

ఇతర వివరాలు

[మార్చు]
  1. యమున, వినోద్ కుమార్ లకు ఇది మొదటి సినిమా.
  2. ఈ సినిమాకు సంగీత దర్శకత్వం ఎస్. జానకి చేసారు.
  3. ఉత్తమ చిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది.

మూలాలు

[మార్చు]
  1. "స్ఫూర్తి మంత్రం.. ఈ మౌనపోరాటం". EENADU. Retrieved 2022-04-04.
  2. ఏకైక సంగీత దర్శకురాలు, ప్రజాశక్తిలో వివరాలు.