Jump to content

ఎ. మోహన గాంధీ

వికీపీడియా నుండి
అన్నె మోహనగాంధీ
జననం
అన్నె మోహనగాంధీ

(1947-07-07) 1947 జూలై 7 (వయసు 77)
ఇతర పేర్లుఎ. మోహన గాంధీ
విద్యబిఎస్సీ
వృత్తిదర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1967–ఇప్పటివరకు
జీవిత భాగస్వామిరాజేశ్వరీ
పిల్లలువంశీకృష్ణ(కుమారుడు),కవిత(కోడలు)

సాహితి(మనుమరాలు) మూలుపూరుశ్రీమణి(కుమార్తె),జయరామ్(అల్లుడు)

ఆదర్ష్,వికాస్(మనుమళ్ళు)
తల్లిదండ్రులుమురహరి రావు,రత్న మాణిక్యం

అన్నే మోహనగాంధీ తెలుగు దర్శకులు.పలు తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

నేపధ్యము

[మార్చు]

1947 లో విజయవాడలో జన్మించారు. అక్కడే యస్.ఆర్.ఆర్;సి.వి.ఆర్ కళాశాలలో బిఎస్సీ వరకు చదివారు. తదుపరి మణిపాల్ లో ఇంజనీరింగ్ విద్యలో చేరారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో నాలుగు నెలలు తిరక్కుండానే చదువుకు

స్వస్థి చెప్పి విజయవాడ వచ్చేశారు. అప్పట్లో మణిపాల్ వెళ్ళేటప్పుడల్లా వీరి కజిన్ వెంకటరత్నంగారు తోడుగా వచ్చేవారు. ప్రయాణం మధ్యలో మద్రాసులో ఉదయం నుండి సాయంకాలం దాకా ఉండవలసి వచ్చేది. అప్పుడే వెంకటరత్నంగారు తన స్నేహితులు శోభన్ బాబు గారిని కలవడానికి గాంధీతో కలిసి వెళ్ళేవారు. అప్పుడే శోభన్ బాబుగారు హీరోగా తెలుగు చిత్రసీమలో నిలదొక్కుకుంటున్నారు.మోహన్ గాంధి 1968లో చదువు మానేసి విజయవాడ వచ్చేశాక తిరిగి కోలుకోవడానికి నాలుగైదు నెలలు పట్టింది. స్టేజీ నాటకాలు వేసిన అనుభవం ఉండటంతో సినిమాల పట్ల తన ఆసక్తిని వెంకటరత్నంగారికి చెప్పారు. వారు వెంటనే మోహన గాంధీని హీరో శోభన్ బాబుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. శోభన్ బాబుగారు వీరికి సినిమాల పట్ల గల ఆసక్తిని గమనించారు. మొదట ఎడిటింగ్ పట్ల తనకు ఆసక్తి ఉన్నదని శోభన్ బాబు గారితో చెప్పడంతో, ఎడిటింగ్ అంటే ఒక్క అంశానికే పరిమితమై పోతావు... దర్శకత్వ శాఖలో ప్రయత్నించు అని ఆయన సలహా ఇచ్చారు. తనకి చిత్రసీమలో ఎవరూ తెలియదని, మీరే రికమెండ్ చేయాలని గాంధీ అభ్యర్థించారు. అలాహీరో శోభన్ బాబుగారి ద్వారా తెలుగు చలన చిత్ర సీమలో 1967లో ప్రవేశించారు.

సినీ జీవితము

[మార్చు]

నాటకాల రాయుడు, పసిడి మనసులు, విచిత్ర దాంపత్యం, మానవుడు దానవుడు, దేవుడు చేసిన పెళ్ళి, అల్లుడొచ్చాడు, అత్తవారిల్లు, కమలమ్మ కమతం, జీవన్ ధారా, మై ఇంతకామ్ లూంగా,యస్.పి భయంకర్...మొదలగు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసారు. శ్రీఅక్కినేని సంజీవి, శ్రీపి.సుబ్రహమణ్యం,శ్రీ పి.సి.రెడ్డి, శ్రీప్రత్యగాత్మ, శ్రీ తాతినేని.రామారావు, శ్రీ వి.బి.రాజేంద్రప్రసాద్ మొదలైన వారి వద్ద దర్శకత్వ శాఖలో మెళకువలు గ్రహించి 1977లో తొలిసారి నిర్మాత

శ్రీ ఎ.వి.సుబ్బారావు నిర్మించిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి అర్ధాంగి చిత్రానికి దర్శకత్వం వహించారు.[1]

ఎ. మోహన గాంధీ దర్శకత్వంలో విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన కర్తవ్యం సినిమా, యమున, శారద నటించిన ఆడది సినిమా ఒకేరోజు విడుదలయ్యాయి.[2]

ఉత్తమ చిత్రంగా మౌనపోరాటం నంది అవార్దు పొందింది.

దర్శకత్వం వహించిన చిత్రాలు

[మార్చు]

తెలుగు

[మార్చు]

కన్నడం

[మార్చు]
  1. సర్కిల్ ఇనస్పెక్టర్
  2. చాముండి

మూలాలు

[మార్చు]
  1. అన్నే, మోహన్ గాంధీ. "మొదటి సినిమా-అన్నే మోహన్ గాంధీ" (PDF). కౌముది.నెట్. Retrieved 1 September 2015.
  2. ఎపి7పీయం, తెలుగు వార్తలు (29 May 2019). "శివకృష్ణకి చెప్పినా వినిపించుకోలేదు: పరుచూరి గోపాలకృష్ణ." www.ap7am.com. Archived from the original on 11 August 2020. Retrieved 11 August 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Bharat Movies, Movie Pages. "Aadadhi. Aadadhi Movie Cast & Crew". www.bharatmovies.com. Retrieved 11 August 2020.[permanent dead link]

బయటి లంకెలు

[మార్చు]