Jump to content

యమున (నటి)

వికీపీడియా నుండి
యమున
జననం
ప్రేమ
వృత్తినటి
పిల్లలువిశేష్టి, కౌశికి

యమున దక్షిణ భారత సినిమా నటి. ప్రధానంగా తెలుగు సినిమాలలో నటించడమే కాక కన్నడ, మలయాళ, తమిళ భాషా సినిమాలలో, టెలివిజన్ ధారావాహికలలో నటించింది.[1][2] ఈమె కర్ణాటకకు చెందిన తెలుగు కుటుంబం నుండి వచ్చింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఈమె అసలు పేరు ప్రేమ. దర్శకుడు కె.బాలచందర్ ఈమె పేరును యమునగా మార్చాడు.

వృత్తి

[మార్చు]

యమున కన్నడ సినిమా మోడద మరెయల్లిలో శివరాజకుమార్ సరసన తొలిసారి నటించింది. ఈమె సుమారు 50 తెలుగు, కన్నడ చిత్రాలలో కథానాయికగా నటించింది.[3] 1989లో విడుదలైన మౌన పోరాటం సినిమా ద్వారా ఈమె పేరుగడించింది.[4][5] ఈ సినిమా మీడియాలో ప్రాచుర్యం పొందిన సబితా బధేయి అనే ఆమె వాస్తవగాధ ఆధారంగా నిర్మించబడింది. ఈ సినిమాలో ఈమె ఒక ప్రభుత్వోద్యోగి చేత మోసగింపబడి, వైవాహిక హక్కులకోసం, తన అక్రమ సంతానానికి సరైన గుర్తింపు కోసం పోరాడే యువతి గౌరి పాత్రను ధరించింది.[6] ఈమె తరువాత వినోద్ కుమార్ సరసన మరో అవార్డు చిత్రం మామగారులో నటించింది.[7] తరువాత పుట్టింటి పట్టుచీర, ఎర్ర మందారం వంటి చిత్రాలలో చెప్పుకోదగ్గ పాత్రలను ధరించింది.[8] కన్నడ సినిమాలలో శివరాజ్ కుమార్, రవిచంద్రన్‌ల సరసన నటించింది.[9] ఈమె వివాహం తరువాత కొంతకాలం సినిమాలలో నటించడం మానివేసింది. కొంత విరామం తరువాత టి.వి.సీరియళ్లలో నటించడం ప్రారంభించింది. ఈటీవిలో ప్రసారమైన ధారావాహిక అన్వేషితలో ఈమె నటించింది.

బూటకపు ఆరోపణలు

[మార్చు]

2011లో బెంగళూరులోని ఫైవ్ స్టార్ హోటల్ ఐ.టి.సి.రాయల్ గార్డెనియాలో జరిగిన పోలీసు దాడిలో వ్యభిచార ఆరోపణలపై ఈమెను అరెస్టు చేశారు.[10] యూట్యూబులో ఒక ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ఆరోపణలను బూటకమైనవిగా కోర్టు కొట్టివేసినట్లు ఈమె తెలియజేసింది.[11]

నటించిన సినిమాలు

[మార్చు]

ఈమె నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

టి.వి.సీరియళ్లు

[మార్చు]

యమున ఈ క్రింది ధారావాహికలలో నటించింది.

  • విధి (ఈటీవి) - సరోజ/రోసీ
  • అన్వేషిత (ఈటీవి) - స్నిగ్ధాదేవి
  • రక్త సంబంధం (జెమిని టీవి)
  • అల్లరే అల్లరి (ఈటీవి ప్లస్)
  • సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (విధి -2వ భాగం, ఈటీవి) - రోసీ
  • దామిని (జెమిని టీవి)
  • అలా వైషూ నిలయంలో (ఈటీవీ ప్లస్)- వైషూ (వైష్ణవి)
  • మౌనపోరాటం (ఈటీవీ) - దుర్గ

మూలాలు

[మార్చు]
  1. "Yamuna profile on Fimibeat". filmibeat.com. Filmibeat. Archived from the original on 3 డిసెంబరు 2016. Retrieved 24 November 2016.
  2. Bollineni, Haribabu. "Why Senior Actress Tried to Commit Suicide?". chitramala.in. Chitramala. Archived from the original on 24 నవంబరు 2016. Retrieved 24 November 2016.
  3. Shyam, Prasad S (27 September 2016). "Yamuna back on the big screen". Bangalore Mirror. Archived from the original on 3 ఏప్రిల్ 2019. Retrieved 30 May 2020.
  4. "1989 Nandi Awards". awardsandwinners.com. Archived from the original on 2014-10-19. Retrieved 2020-05-30.
  5. "List of winners of the Nandi Award for Best Feature Film". telugufilmz.org.[permanent dead link]
  6. "Mouna Poratam Music by S Janaki". sjanaki.net. Archived from the original on 2019-10-24. Retrieved 2020-05-30.
  7. "1991 Nandi awards". awardsandwinners.com. Archived from the original on 16 April 2016. Retrieved 24 November 2016.
  8. "1990 Nandi Awards". awardsandwinners.com. Awards & Winners. Archived from the original on 15 July 2015. Retrieved 24 November 2016.
  9. "ఆ రూమర్ వచ్చాక... సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నా.. నటి యమున". telugu.webdunia.com. Webdunia. Archived from the original on 24 నవంబరు 2016. Retrieved 24 November 2016.
  10. Bojja, Kumar. "వ్యభిచారంలో ఇరికించారు, చనిపోవాలనుకున్నా: నటి యమున అంతరంగం, కన్నీళ్లు..." filmibeat.com. Filmibeat. Archived from the original on 24 November 2016. Retrieved 24 November 2016.
  11. "Yamuna back on the big screen". bangaloremirror.indiatimes.com. BangaloreMirror. Archived from the original on 20 డిసెంబరు 2016. Retrieved 27 September 2016.
  12. Bharat Movies, Movie Pages. "Aadadhi. Aadadhi Movie Cast & Crew". www.bharatmovies.com. Retrieved 11 August 2020.[permanent dead link]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=యమున_(నటి)&oldid=4084411" నుండి వెలికితీశారు