పీపుల్స్ ఎన్‌కౌంటర్
స్వరూపం
| పీపుల్స్ ఎన్‌కౌంటర్ | |
|---|---|
| దర్శకత్వం | మోహనగాంధీ |
| రచన | పరుచూరి బ్రదర్ |
| నిర్మాత | రామోజీరావు |
| తారాగణం | వినోద్ కుమార్, భానుప్రియ, శ్రీకాంత్ |
| ఛాయాగ్రహణం | ప్రసాద్ బాబు |
| కూర్పు | గౌతంరాజు |
| సంగీతం | ఎం.ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1991 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
పీపుల్స్ ఎన్‌కౌంటర్ 1991లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణ సారథ్యంలో మోహనగాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, భానుప్రియ, శ్రీకాంత్, యమున తదితరులు నటించగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అదించాడు.[1]
కథా నేపథ్యం
[మార్చు]వెనుకబడిన ప్రజలకు న్యాయం చేయడంకోసం పీపుల్స్ వార్ గ్రూప్ (పిడబ్ల్యుజి), ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ గెరిల్లా సైన్యం పోరాటం చేస్తుంది. పీపుల్స్ వార్ గ్రూప్, ప్రభుత్వం మధ్య జరిగిన పోరాటం, సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: మోహనగాంధీ
- నిర్మాత: రామోజీరావు
- సంగీతం: ఎం.ఎం. కీరవాణి
- ఛాయాగ్రహణం: డా. ప్రసాద్ బాబు
- నిర్మాణ సంస్థ: ఉషా కిరణ్ మూవీస్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించాడు.
| క్రమ సంఖ్య | పాటపేరు | గాయకులు | నిడివి |
|---|---|---|---|
| 1 | "ఈ నేల మనదిరా" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి. శైలజ | 04:41 |
| 2 | "లాల్ సలాం" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 05:14 |
| 3 | "ముక్కలైన రెక్కలతో" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 04:37 |
| 4 | "పిండు కుంటే తీపంటా" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి. శైలజ | 04:39 |
| 5 | "పొట్ట కూటి కోసం పోలీసన్న" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 02:13 |
| 6 | "రీ రీ నక్సల్బరి" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎం.ఎం. కీరవాణి | 01:53 |
| 7 | "శివ శివ మూర్తివి గణనాధ" | జిక్కి | 04:30 |
| 8 | నరదహనం పురదహనం | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 04:12 |
మూలాలు
[మార్చు]- ↑ "Interview with Srikanth". idlebrain.com. 28 September 2009. Archived from the original on 15 December 2019. Retrieved 28 July 2020.