భానుప్రియ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
భానుప్రియ | |
---|---|
జననం | మంగభాను 1967 జనవరి 15 రంగంపేట, రాజమండ్రి జిల్లా |
వృత్తి | సినీ నటి, నర్తకి |
భానుప్రియ సినీనటి, నర్తకి. 1980-1993 మధ్యకాలంలో ఆమె అనేక తెలుగు, తమిళ చిత్రాలలో కథానాయికగా నటించింది. 1990లలో కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించింది. ఈమె 1967, జనవరి 15న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. భానుప్రియ సోదరి నిషాంతి కూడా శాంతిప్రియ అన్న పేరుతో తెలుగు తెరకు పరిచయమైంది. భానుప్రియ ప్రస్తుతం అమెరికాలో ఉంటూ, దక్షిణ భారతదేశ శాస్త్రీయ నృత్యరీతులైన కూచిపూడి,, భరతనాట్యంలో శిక్షణ ఇస్తుంది. భానుప్రియ దాదాపు 110 సినిమాలలో కథానాయికగా నటించింది. అభిమానులు ఆమెను మరో శ్రీదేవిగా పిలుచుకుంటుంటారు.
సినీ జీవితం
[మార్చు]భానుప్రియ వంశీ దర్శకత్వంలో వచ్చిన సితార సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలంతో కళాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకొంది. ఆమె సహజంగానే మంచి నాట్య కళాకారిణి. దీని తరువాత చాలా కమర్షియల్ సినిమాలలో నటించింది. సన్ నెటవర్క్ ఛానళ్ళలో ప్రసారమైన శక్తి అనే టెలీ ధారావాహికలో కూడా నటించింది.
1980-1993 మధ్య కాలంలో కథానాయికగా పలు చిత్రాలలో నటించి ఓ వెలుగు వెలిగింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో దాదాపు 110 చిత్రాలలో ఆమె నటించింది. 'సితార' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన భానుప్రియ, దర్శకుడు వంశీ కలయికలో పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు. వంశీ, భానుప్రియ ల సినిమాలను అత్యధికమంది ఇష్టపడేవారు. వారి కాంబినేషన్ లో సంగీత, నృత్య ప్రధానంగా వరుసగా అనేక చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులకు నచ్చాయి.
నటిగా, నర్తకిగా తనదైన ప్రత్యేక బాణీ పలికించిన భానుప్రియ నాటి అగ్రహీరోలందరి సరసన నటించారు. తెలుగు ప్రేక్షకులు మరచిపోలేని తారగా నిలిచారు. చిరంజీవి అగ్ర నాయకుడిగా రాజ్యం చేస్తున్న రోజుల్లోనే భానుప్రియ అరంగేట్రం చేశారు. చిరంజీవి అంటే అప్పట్లో వేగవంతమైన నృత్యాలకు పెట్టింది పేరు. భానుప్రియ ఆయనతో సమవుజ్జీగా స్టెప్పులు వేసి అభిమానులను అలరించారు. వారిద్దకి జోడీ అత్యంత విజయవంతమైన జోడీగా నిలిచింది. చిరంజీవి కూడా ఒక సందర్భంలో భానుప్రియతో కలసి నృత్యం చేయడంలో ఎంతో ఆనందం ఉందని కితాబిచ్చారు.
నందమూరి బాలకృష్ణ విజయవిహారం చేస్తున్న సమయంలోనే భానుప్రియ కూడా తెలుగునాట అడుగు పెట్టారు. బాలకృష్ణ, భానుప్రియ జంట ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసింది. బాలకృష్ణ సొంత చిత్రాల్లో భానుప్రియ నాయికగా జయకేతనం ఎగురవేయడం విశేషం. మరో కథానాయకుడు దగ్గుబాటి వెంకటేష్ తోనూ భానుప్రియ జోడీ కట్టిన చిత్రాలు విజయవంతమయ్యాయి. వారిద్దరూ జంటగా నటించిన సినిమాలు జనాన్ని ఎంతగానో అలరించాయి. తెలుగు, తమిళ చిత్రరంగంలో ఓ వెలుగు వెలిగిన భానుప్రియ బాలీవుడ్‌పై కూడా కన్నేశారు. అయితే అక్కడ ఆమె అంతగా రాణించలేక పోయారు. ఖుద్‌గర్జ్, ఇన్సాఫ్‌కీ పుకార్, మార్ మిటేంగే వంటి హిందీ చిత్రాల్లో భానుప్రియ నటించారు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]భరత నాట్య కళాకారిణి సుమతీ కౌశల్ కుమారుడు, అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌశల్ను ఆమె వివాహం చేసుకున్నారు. వారికి అభినయ అనే అమ్మాయి ఉంది. కారణాలు ఏవైనా భార్యాభర్తలు విడిపోయారు. ప్రస్తుతం భానుప్రియ తనకెంతో ఇష్టమైన దక్షిణ భారతదేశ ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యరీతులైన కూచిపూడి, భరతనాట్యం శిక్షణ, ప్రదర్శనలతో కాలక్షేపం చేస్తున్నారు. తగిన పాత్ర లభించినప్పుడు టివి సీరియల్స్, సినిమాలలో నటిస్తూనే ఉన్నారు
భానుప్రియ నటించిన తెలుగు చిత్రాలు
[మార్చు]- నాట్యం (2021)
- మగువలు మాత్రమే (2020)
- అవతారం (2014)[1]
- మహాయజ్ఞం (2008)
- లాహిరి లాహిరి లాహిరిలో (2002)
- సితార
- రౌడీ (1984)
- రామాయణంలో భాగవతం
- ప్రేమించు పెళ్ళాడు
- మొగుడు పెళ్ళాలు
- ఇల్లాలికో పరీక్ష
- అన్వేషణ
- చిరంజీవి
- జ్వాల
- పల్నాటి పులి
- గోకుల కృష్ణుడు (1993)
- అమర్ (1992)
- ప్రేమరాయబారం (1992)
- పీపుల్స్ ఎన్కౌంటర్ (1991)
- చిలిపి పెళ్ళాం (1990)
- విజేత
- అనసూయమ్మ గారి అల్లుడు (1986)
- అపూర్వ సహోదరులు
- ఆలాపన
- దొంగమొగుడు
- చక్రవర్తి
- జేబుదొంగ
- స్వర్ణకమలం
- ఖైదీ నెం. 786
- త్రినేత్రుడు
- బ్లాక్ టైగర్
- స్టేట్ రౌడి
- శ్రీ ఏడుకొండలస్వామి
- పెదరాయుడు
- మమా బాగున్నావా
- అన్నమయ్య
- ఛత్రపతి
- గౌతమ్ ఎస్.ఎస్.సి.
- జయసింహ
- శ్రీనివాస కళ్యాణం
- గూఢచారి 117
- కాష్మోరా
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి, సినిమా (27 January 2014). "అవతారం". Sakshi. Archived from the original on 29 July 2020. Retrieved 30 July 2020.
- విస్తరించవలసిన వ్యాసాలు
- Pages using infobox person with unknown parameters
- Infobox person using residence
- నంది పురస్కారాలు
- సినిమా పురస్కారాలు
- 1967 జననాలు
- తెలుగు సినిమా నటీమణులు
- నంది ఉత్తమ నటీమణులు
- నంది ఉత్తమ సహాయనటీమణులు
- జీవిస్తున్న ప్రజలు
- తమిళ సినిమా నటీమణులు
- హిందీ సినిమా నటీమణులు
- తూర్పు గోదావరి జిల్లా సినిమా నటీమణులు