Jump to content

మావా బాగున్నావా?

వికీపీడియా నుండి
(మమా బాగున్నావా నుండి దారిమార్పు చెందింది)
మావా బాగున్నావా?
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం జయకృష్ణ
కథ పంజు అరుణాచలం
చిత్రానువాదం కోడి రామకృష్ణ
తారాగణం రాజేంద్ర ప్రసాద్
నరేష్
రంభ
మోహిని
కోట శ్రీనివాసరావు
తనికెళ్ళ భరణి
సంగీతం రాజ్ - కోటి
సంభాషణలు తోటపల్లి మధు
ఛాయాగ్రహణం బి.ఎన్.రావు
కూర్పు తాతా సురేష్
భాష తెలుగు

మామా బాగున్నావా 1997 లో విడుదలైన కామెడీ చిత్రం, దీనిని జయకృష్ణ మూవీస్ నిర్మాణ సంస్థ [1] పై కోడి రామకృష్ణ దర్శకత్వంలో జయకృష్ణ నిర్మించాడు.[2] ఇందులో రాజేంద్ర ప్రసాద్, నరేష్, రంభ, మోహిని, భానుప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. విద్యాసాగర్ సంగీతం అందించాడు.[3] ఇది 1994 లో వచ్చిన తమిళ చిత్రం వనజా గిరిజాకు రీమేక్, ఇది 1974 తమిళ చిత్రం ఎంగమ్మ సపతంకు రీమేక్, ఇది అప్పటికే 1975 లో తెలుగులో అమ్మాయిల శపథం పేరుతో పునర్నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైంది.[4]

ధనంజయం (కోట శ్రీనివాస రావు) కోటీశ్వరుడు. అతని భార్య సుందరాంబాళ్ అయ్యర్ (కోవై సరళ), ఇద్దరు కుమారులు గోపాల కృష్ణ (రాజేంద్ర ప్రసాద్) పశువైద్యుడు & జానకిరామ్ (నరేష్), డాక్టర్ లతో సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతున్నాడు. గతంలో ధనుంజయం, తన మేనేజరు ప్రకాశరావు (ఈశ్వర్ రావు) కార్మికుల బోనస్ మొత్తం తీసుకుని పారిపోయాడని ప్రచారం చేస్తాడు. ఆ కారణంగా, ప్రకాశ రావు భార్య పార్వతమ్మ (శుభ) & ఇద్దరు కుమార్తెలను ప్రజలు అవమానిస్తారు. ప్రస్తుతం, ప్రకాశ రావు కుమార్తెలు జయ (రంభ) & విజయ (మోహిని) లు అతడి ఇద్దరు అమాయక కుమారులతో కలిసి అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటారు. జయ విజయలు ధనుంజయంకు ఎలా పాఠం నేర్పుతారు, తమ తండ్రి నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపిస్తారు అనేది మిగతా కథ.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."రాముడు మెచ్చిన ఉడత"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్. జానకి4:16
2."చిన్నారి చీకటేళ"శివ గణేష్మనో, చిత్ర4:13
3."ఉద్యోగమిస్తాను"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర4:17
4."గాజుల చేతికి మీసం"వడ్డేపల్లి కృష్ణచిత్ర, గాయత్రి4:27
5."ఇది తీరని తీయని దాహం"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, గాయత్రి5:00
మొత్తం నిడివి:22:13

మూలాలు

[మార్చు]
  1. "Mama Bagunnava (Banner)". Tollywood Times.com. Archived from the original on 2018-10-05. Retrieved 2020-08-20.
  2. "Mama Bagunnava (Direction)". Know Your Films.[dead link]
  3. "Mama Bagunnava (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-05. Retrieved 2020-08-20.
  4. "Mama Bagunnava (Review)". The Cine Bay. Archived from the original on 2018-10-05. Retrieved 2020-08-20.