కలర్స్ స్వాతి
స్వాతి | |
---|---|
జననం | స్వెత్లానా 1987 ఏప్రిల్ 19[1] రష్యా |
వృత్తి | నటి, వ్యాఖ్యాత, గాయకురాలు, డబ్బింగ్ కళాకారిణి |
జీవిత భాగస్వామి | వికాస్ వాసు |
తల్లిదండ్రులు |
|
బంధువులు | సిద్ధార్థ్ (సోదరుడు) |
స్వాతి ఒక ప్రముఖ నటి, వ్యాఖ్యాత, గాయకురాలు, డబ్బింగ్ కళాకారిణి.[2] ఈమె మాటీవీలో ప్రసారమైన కలర్స్ అనే కార్యక్రమం ద్వారా వ్యాఖ్యాత గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత మరికొన్ని తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో నటించి ప్రజల మన్నలను అందుకుంది. నటిగా స్వాతి మొదటి చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్. 2008లో ఆమె నటించిన అష్టా చెమ్మా చిత్రం విజయవంతం అవడం వలన ఆమెకు మంచి నటిగా పేరు రావడం, తరువాత అనేక అవకాశాలు రావడం జరిగింది. 2008 లో ఈ సినిమాకు ఆమెకు నంది పురస్కారం లభించింది. స్వాతి వివాహం ఆగస్టు 30, 2018లో వికాస్ తో జరిగింది.[3][4]
జీవిత విశేషాలు
[మార్చు]స్వాతి తండ్రి నేవీలో ఉద్యోగి. తల్లి కూడా ఉన్నత విద్యావంతురాలే. తండ్రి ఉద్యోగ రీత్యా రష్యాలో ఉండగా స్వాతి అక్కడే జన్మించింది. పుట్టినపుడు ఈమెకు స్వెత్లానా అని నామకరణం చేసారు. తర్వాత స్వాతిగా మార్చారు.[5] వీరి మకాం రష్యా నుంచి మొదటగా ముంబై కి తర్వాత విశాఖపట్నంకి మారింది. స్వాతి చిన్నతనంలో ఎక్కువభాగం విశాఖపట్నంలోనే గడిచింది. విద్యార్థి దశలో వక్తృత్వపు పోటీలు డిబేట్లు, ఆటల పోటీల్లో చురుగ్గా పాల్గొనేది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉండగా ఈమె హైదరాబాదుకు వెళ్ళింది. ఎంసెట్ లో మంచి ర్యాంకు సాధించి ఎం. బి. బి. ఎస్ సీటు తెచ్చుకుంది. కానీ తర్వాత బి. ఎస్. సి బయోటెక్నాలజీ చదివింది. తర్వాత ఫోరెన్సిక్ లో పి. జి. చేసింది. ఆమెకు ఒక అన్నయ్య. పేరు సిద్ధార్థ్. అలాగే ఓక పెద్ద అభిమాని సాయికృష్ణ అరుకాల.
కెరీర్
[మార్చు]16 ఏళ్ళ వయసులో కలర్స్ అనే టీవీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున, ఉదయ్ కిరణ్ లాంటి నటులను ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది.[6] అప్పటి నుంచే సినిమా అవకాశాలు రావడం మొదలైంది. ఆమె మొదటి సినిమా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్. తర్వాత వెంకటేష్ కథానాయకుడిగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో సహాయ పాత్రలో నటించింది. మూడో సినిమా తెలుగు తమిళ ద్విభాషా చిత్రం అనంతపురం (తమిళంలో సుబ్రహ్మణ్య పురం). తర్వాత వచ్చిన అష్టాచమ్మాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రంలో నటనకు గాను 2008లో ఆమెకు ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది.
2008 లో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వచ్చిన జల్సా సినిమాలో కథానాయిక ఇలియానాకు డబ్బింగ్ చెప్పింది. స్వాతి వివాహం జరిగిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంది, 2021లో పంచతంత్రం సినిమా ద్వారా సినిమాల్లో తిరిగి నటిస్తుంది.[7]
సినిమాలు
[మార్చు]- డేంజర్
- ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే
- అనంతపురం (1980)
- అష్టా చెమ్మా
- త్రిపుర (2005)
- కలవరమాయే మదిలో (2009)
- కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు
- సంఘర్షణ (2011)
- మిరపకాయ్ (2011)
- స్వామిరారా (2013)
- కార్తికేయ (సినిమా) (2014)
- లండన్ బాబులు (2017)
- మంత్ ఆఫ్ మధు (2023)[8]
మూలాలు
[మార్చు]- ↑ "స్వాతి బయోగ్రఫీ". chitramala.in. Archived from the original on 31 జనవరి 2018. Retrieved 28 November 2017.
- ↑ "వర్మ గురించి నాకెన్ని ప్రశ్నలో!". ఈనాడు. 28 November 2017. Archived from the original on 28 November 2017.
- ↑ Sakshi (1 September 2018). "నిరాడంబరంగా కలర్స్ స్వాతి వివాహం". Sakshi. Archived from the original on 10 మే 2021. Retrieved 10 May 2021.
- ↑ Deccan Chronicle (5 September 2018). "I can't believe that I'm married!: Swathi Reddy". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 10 మే 2021. Retrieved 10 May 2021.
- ↑ జి. వి, రమణ. "కలర్స్ స్వాతి ఇంటర్వ్యూ". idlebrain.com. Archived from the original on 21 నవంబరు 2017. Retrieved 28 November 2017.
- ↑ మాట్లాడకుండా ఉండలేను. హైదరాబాదు: ఈనాడు. 2009. pp. 18–19.
- ↑ Namasthe Telangana (22 April 2021). "కలర్స్ స్వాతి రీ ఎంట్రీ.. కొత్త కాన్సెప్ట్‌తో అలరించేందుకు రెడీ..!". Archived from the original on 10 మే 2021. Retrieved 10 May 2021.
- ↑ 10TV Telugu (25 September 2023). "కలర్స్ స్వాతితో పెళ్లి.. నిజం చెప్పిన హీరో నవీన్ చంద్ర." (in Telugu). Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)