Jump to content

నిత్య మేనన్

వికీపీడియా నుండి
(నిత్య మేనన్‌ నుండి దారిమార్పు చెందింది)
నిత్య మేనన్‌
జననం
నిత్య మేనన్‌

(1988-04-08) 1988 ఏప్రిల్ 8 (వయసు 36)
వృత్తినటి, గాయని
క్రియాశీల సంవత్సరాలు2008–ఇప్పటివరకు

నిత్యా మేనన్‌ ఒక భారతీయ సినీ నటి, గాయని. పలు విజయవంతమైన తెలుగు చిత్రాలతో బాటు కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు యాభై చిత్రాలకు పైగా నటించింది. ఈమె మూడు దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, రెండు నంది బహుమతులు అందుకుంది.

8 సంవత్సరాల వయసులో ద మంకీ హు న్యూ టూమచ్ (1998) అనే ఆంగ్ల చిత్రంలో బాలనటిగా నటించడం మొదలుపెట్టింది. 17 సంవత్సరాల వయసులో 2006 లో ఒక కన్నడ సినిమాలో సహాయ పాత్ర పోషించింది. తర్వాత ఆకాశ గోపురం అనే మలయాళ చిత్రంతో ప్రధాన పాత్రల్లో నటించే అవకాశాలు వచ్చాయి. తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించింది.

నేపథ్యం

[మార్చు]

ఈమె 1988, ఏప్రిల్ 8బెంగుళూరులో స్థిరపడిన మలయాళ కుటుంబంలో జన్మించింది. మణిపాల్ విద్యాసంస్థలలో పాత్రికేయ విద్యను అభ్యసించింది. నటిని అవుతానని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. మంచి పాత్రికేయురాలు కావాలనుకునేది.[2][3] తర్వాతి కాలంలో ఆమెకు మళ్ళీ సినీరంగం మీద ఆసక్తి కలిగి పుణెలోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీ కోర్సులో చేరింది. అక్కడ ఆమెకు బి. వి. నందినీ రెడ్డి పరిచయం అయ్యి, ఆమెను నటనవైపు ప్రోత్సహించింది. తర్వాత ఆమె నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది సినిమాతో తెలుగులో కథానాయికగా పరిచయం అయింది. ఆమెకు వన్యప్రాణి ఫొటోగ్రఫీ అంటే కూడా ఆసక్తి.

నట జీవితము

[మార్చు]

అలా మొదలైంది సినిమా ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. అంతకు మునుపే బాలనటిగా ఓ ఇంగ్లిష్ సినిమాలో టబుకు చెల్లిగా నటించింది. మోహన్‌లాల్‌తో కూడా ఒక సినిమాలో నటించింది. మాతృభాష మలయాళం. కానీ, వేరే భాషలు నేర్చుకోవాలన్న ఆసక్తి, ఇష్టం ఈమెకి కాస్త ఎక్కువే. అందుకే తొలిసినిమా అలా మొదలైందిలోనే నటనతో పాటు తన గాత్రాన్ని కూడా వినిపించింది. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే.., అబ్బబ్బో.. అబ్బో.. అంటూ పాడిన రెండు పాటలు విజయవంతం అయ్యాయి.

తెలుగు సినిమాలతో పాటు, అటు మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది నిత్య. అక్కడ కూడా పాటలు పాడుతూ ఒక పాటకు నృత్యదర్శకత్వం కూడా చేసింది. అలా మొదలైంది తర్వాత సెగ, 180 వంటి చిత్రాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద వూహించినంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ తర్వాత వచ్చిన ఇష్క్ మాత్రం మంచి హిట్‌గా నిలిచింది. మళ్లీ నితిన్‌తో జతకట్టిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ జంట విజయవంతమైన హిట్ పెయిర్ గా నిలిచింది. జబర్దస్త్, ఒక్కడినే చిత్రాల్లో నటనకుగాను మంచి మార్కులే సొంతం చేసుకుంది నిత్య. ఏమిటో ఈ మాయ, మాలిని 22 అనే తెలుగు చిత్రాలతో పాటు, రెండు తమిళ సినిమాల్లో కూడా నటించింది.

నటించిన చిత్రాలు

[మార్చు]
నిత్యా మీనన్ సినిమా క్రెడిట్స్ జాబితా
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు మూ
1998 హనుమాన్ మున్నా ఆంగ్ల చైల్డ్ ఆర్టిస్ట్
2006 7 ఓ క్లాక్ అను కన్నడ సహాయక పాత్ర; కన్నడ రంగప్రవేశం
2008 ఆకాశ గోపురం హిల్డా వర్గీస్ మలయాళం ప్రధాన నటిగా అరంగేట్రం; మలయాళ రంగ ప్రవేశం
2009 జోష్ మీరా కన్నడ
వెల్లతూవల్ జియా జార్జ్ మలయాళం
కేరళ కేఫ్ నిత్య
ఏంజెల్ జాన్ సోఫియా
2010 అపూర్వరాగం నాన్సీ
అన్వర్ అస్నా
2011 అలా మొదలైంది నిత్య తెలుగు తెలుగు అరంగేట్రం
ఉరుమి చిరక్కల్ బాలా/ డైసీ డా కున్హా మలయాళం
నూట్రన్బడు / 180 డి.విద్యా లక్ష్మి తమిళం తమిళ అరంగేట్రం ; ద్విభాషా చిత్రం
తెలుగు
వయోలిన్ ఏంజెల్ మలయాళం
వెప్పం రేవతి తమిళం
ఐదోండ్ల అయిదు గౌరీ కన్నడ ఆంథాలజీ సినిమా
మకరమంజు మోడల్ మలయాళం
2012 ఇష్క్ ప్రియా తెలుగు
తలసమయం ఓరు పెంకుట్టి మంజుల అయ్యప్పన్ మలయాళం
కర్మయోగి మూనుమణి
డాక్టర్ ఇన్నోసెంటాను అన్నా ప్రత్యేక ప్రదర్శన
బ్యాచిలర్ పార్టీ నీతూ
ఉస్తాద్ హోటల్ షహానా తెలుగులో జనతా హోటల్‌
పాపిన్స్ అమ్ము ఆంథాలజీ సినిమా
2013 ఒక్కడినే శైలజ తెలుగు
జబర్దస్త్ సరస్వతి
మైనా మైనా కన్నడ
గుండెజారి గల్లంతయ్యిందే శ్రావణి / బంగారం తెలుగు
2014 మాలిని 22 పాలయంకోట్టై మాలిని తమిళం
బెంగళూరు డేస్ నటాషా ఫ్రాన్సిస్ మలయాళం అతిధి పాత్ర
2015 మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు నజీరా ఖానుమ్ తెలుగు
JK ఎనుమ్ నన్బనిన్ వాఙ్కై నిత్య తమిళం తెలుగు వెర్షన్ రాజాధి రాజా 2016లో విడుదలైంది
100 డేస్ ఆఫ్ లవ్ శీల మలయాళం
S/O సత్యమూర్తి వల్లి తెలుగు
కాంచన 2 గంగ తమిళం
ఓ కాదల్ కన్మణి తారా కళింగరాయర్ తెలుగులో ఓకే బంగారం
రుద్రమదేవి ముక్తాంబ తెలుగు
2016 24 ప్రియా సేతురామన్ తమిళం
ఒక్క అమ్మాయి తప్ప మామిడి / సత్యభామ తెలుగు
కోటిగొబ్బ 2 / ముడింజ ఇవన పూడి సుభాషిణి / శుభ కన్నడ ద్విభాషా చిత్రం
తమిళం
జనతా గ్యారేజ్ అను తెలుగు
ఇరు ముగన్ ఆయుషి తమిళం తెలుగులో ఇంకొక్కడు
2017 మెర్సల్ ఐశ్వర్య వెట్రిమారన్
2018 అ! కృష్ణవేణి తెలుగు
గీత గోవిందం నిత్య ప్రత్యేక ప్రదర్శన
2019 ఎన్.టి.ఆర్. కథానాయకుడు సావిత్రి ప్రత్యేక ప్రదర్శన
ప్రాణం తారా అనురాధ మలయాళం బహుభాషా చిత్రం
మిషన్ మంగళ్ వర్షా పిళ్లై హిందీ హిందీ అరంగేట్రం
2020 సైకో కమలా దాస్ IPS తమిళం
2021 నిన్నిలా నిన్నిలా మాయ తెలుగు
గమనం శైలపుత్రీ దేవి సంకలన చిత్రం; అతిధి పాత్ర
స్కైలాబ్ గౌరి వెంకటరాజు నిర్మాత కూడా
2022 భీమ్లా నాయక్ సుగుణ నాయక్
19(1)(ఎ) పెంకుట్టి మలయాళం
తిరుచిత్రంబలం శోభన తమిళం తెలుగులో తిరు
వండర్ విమెన్ నోరా జోసెఫ్ ఆంగ్ల
2023 కోలాంబి అరుంధతి మలయాళం
2024 కాదలిక్క నేరమిల్లై TBA తమిళం చిత్రీకరణ
రాయన్
డియర్ ఎక్సెస్ TBA చిత్రీకరణ

షార్ట్ ఫిల్మ్

[మార్చు]
నిత్యా మీనన్ షార్ట్ ఫిల్మ్ క్రెడిట్‌ల జాబితా
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు Ref.
2020 కలర్ ఆఫ్ నేషన్ గర్భిణీ స్త్రీ తెలుగు

టెలివిజన్

[మార్చు]
నిత్యా మీనన్ టెలివిజన్ క్రెడిట్‌ల జాబితా
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు మూ
2001–2002 ఛోటీ మా...ఏక్ అనోఖా బంధన్ యువ కోయినా హిందీ చైల్డ్ ఆర్టిస్ట్
2022 తెలుగు ఇండియన్ ఐడల్ న్యాయమూర్తి తెలుగు

వెబ్ సిరీస్

[మార్చు]
నిత్యా మీనన్ వెబ్ సిరీస్ క్రెడిట్‌ల జాబితా
సంవత్సరం పేరు పాత్ర భాష నెట్‌వర్క్ గమనికలు మూ
2020–2022 బ్రీత్: షాడోస్ లోకి అభా సబర్వాల్ హిందీ అమెజాన్ ప్రైమ్ వీడియో సీజన్లు 1-2 [4] [5]
2022 మోడరన్ లవ్ హైదరాబాద్ నూరి హుస్సేన్ తెలుగు సెగ్మెంట్ కింద "నా అన్‌లైక్లీ పాండమిక్ డ్రీం పార్టనర్"
2023 కుమారి శ్రీమతి ఇటికెలపూడి శ్రీమతి [6]
మాస్టర్ పీస్ రియా కురియన్ మలయాళం డిస్నీ+హాట్‌స్టార్ [7]

సంగీత వీడియోలు

[మార్చు]
నిత్యా మీనన్ మ్యూజిక్ వీడియో క్రెడిట్‌ల జాబితా
సంవత్సరం పాట భాష గాయకుడు(లు) గమనికలు
2022 థానియే/తన్హా మలయాళం/హిందీ సిద్ధార్థ్ మీనన్ , నిత్యా మీనన్ YouTubeలో

వాయిస్ ఆర్టిస్ట్

[మార్చు]
నిత్యా మీనన్ ఫిల్మ్ వాయిస్ ఆర్టిస్ట్ క్రెడిట్‌ల జాబితా
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు
2013 గుండె జారి గల్లంతయ్యిందే శృతి తెలుగు
2019 ఘనీభవించిన 2 ఎల్సా తెలుగు

పురస్కారాలు

[మార్చు]

National film award for best actress - Thiruchitrambalam ( tamil )

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Nithya Menon profile,photo gallery – South Indian Actresses". cinebasket. Archived from the original on 2011-09-27. Retrieved 2011-09-25.
  2. "'I love to do intelligent films like Kerala Cafe' – Rediff.com Movies". Movies.rediff.com. 2010-03-03. Retrieved 2011-04-07.
  3. "Nithya plays a journalist in next – Times Of India". Articles.timesofindia.indiatimes.com. 2011-04-03. Archived from the original on 2012-05-03. Retrieved 2011-04-07.
  4. "Breathe Into the Shadows review: Inept and illogical, Amazon's strangest show lets Abhishek Bachchan, Amit Sadh down". Hindustan Times (in ఇంగ్లీష్). 10 July 2020. Retrieved 15 September 2021.
  5. "Abhishek Bachchan and Nithya Menen start 'Breathe 3': Shoot for 24-hours at a stretch –Exclusive!". TOI (in ఇంగ్లీష్). 22 Oct 2022. Retrieved 14 September 2022.
  6. NTV Telugu (18 September 2023). "'కుమారి శ్రీమతి'గా నిత్యా మీనన్". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  7. Malayalam director Sreejith N talks about his web series ‘Master Peace,’ starring Nithya Menen and Sharafudheen The Hindu Retrieved 18 August 2023