వాణిశ్రీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వాణిశ్రీ
200ox
వాణిశ్రీ
జననం రత్నకుమారి
(1948-08-03) ఆగస్టు 3, 1948 (వయస్సు: 69  సంవత్సరాలు)
నెల్లూరు, భారతదేశం
వృత్తి నటి
ఎత్తు 5అ. 6అం.
చరణకింకిణులు ఘల్లుఘల్లు మన...కరకంణములు గలగలలాడ గ... ఆడవే మయూరి నటనమాడవే మయూరి అంటూ నటభూషణుడు భావయుక్తంగా పాడుతుంటే ఆ పాటకు వాణిశ్రీ అభినయానికి పరవశించని తెలుగువాడుండడంటే అతిశయోక్తికాదు. చెల్లెలికాపురం చిత్రంలోని ఆ పాటను పదికాలాలపాటు గుర్తుంచుకుంటారు. తన నటనతో ఒక్కోసారి హీరోలను కూడా డామినేట్‌ చేయగలిగిన అభినయశ్రీ వాణిశ్రీ

వాణిశ్రీ (జ.1948, ఆగష్టు 3, నెల్లూరు) 1960 మరియు 1970 దశకములలో పేరొందిన తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు రత్నకుమారి. వాణిశ్రీ తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ, కన్నడ మరియు మలయాళ సినిమాలలో కూడా నటించింది. మరపురాని కథ సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేసిన వాణిశ్రీ సుఖదుఃఖాలు సినిమాలో చెల్లెలి పాత్రతో మంచి పేరుతెచ్చుకున్నది. ఈ సినిమాలో ఇది మల్లెల వేలయని ప్రసిద్ధ పాటను ఈమెపై చిత్రీకరించారు. ఆ తరువాత కథానాయకిగా అనేక సినిమాలో నటించి 1970వ దశకమంతా తెలుగు చిత్రరంగములో అగ్రతారగా నిలచింది. ఈ దశాబ్దపు చివరలో శ్రీదేవి మరియు జయప్రదలు తెరపై వచ్చేవరకు వాణిశ్రీనే అగ్రతార.

ఆ తరువాత సినీ రంగమునుండి విరమించి, వాణిశ్రీ పెళ్ళి చేసుకొని సంసారజీవితంలో స్థిరపడింది. ఈమెకు ఒక కొడుకు మరియు ఒక కూతురు. 80వ దశకములో ఈమె తిరిగి తల్లి పాత్రలతో సినీ రంగములో పునః ప్రవేశించింది.

వాణిశ్రీ నటించిన తెలుగు చిత్రాలు[మార్చు]

సూచికలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వాణిశ్రీ&oldid=2168482" నుండి వెలికితీశారు