కథానాయిక మొల్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ చిత్ర కథకు మూలమైన కవయిత్రి గురించి ఆతుకూరి మొల్ల వ్యాసం చూడండి.

కథానాయిక మొల్ల
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం పద్మనాభం
నిర్మాణం బి.పురుషోత్తం
తారాగణం హరనాధ్,
వాణిశ్రీ,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
పద్మనాభం,
జ్యోతిలక్ష్మి,
నాగభూషణం,
అల్లు రామలింగయ్య,
మిక్కిలినేని,
త్యాగరాజు,
రాధాకుమారి
సంగీతం ఎస్.పి. కోదండపాణి
నిర్మాణ సంస్థ రేఖా & మురళీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

కథానాయిక మొల్ల హాస్యనటుడు పద్మనాభం దర్శకత్వం వహించిన తెలుగు సినిమా. ఇది 1970 మార్చి 5న విడుదలయ్యింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధమ ఉత్తమ చిత్రంగా1970 వ సంవత్సరానికి గాను , బంగారు నంది అవార్డు ప్రకటించింది

సాంకేతికవర్గం

[మార్చు]

నటీనటులు

[మార్చు]

ఆత్మకూరు గ్రామంలో వెనుకబడిన జాతికి చెందిన కుమ్మరి వేతన (గుమ్మడి). వృత్తిపని, కూలి పని చేసుకునేవారికి పెద్దదిక్కు. అతని కుమార్తె మల్లమ్మ (వాణిశ్రీ). ఆ ఊళ్లో కుటిల పండితుడు రామాచారి (నాగభూషణం). అతని అనుయాయులు అవధాని (అల్లు రామలింగయ్య), దౌర్జన్యాలకు పాల్పడే కనకయ్య (మిక్కిలినేని). కొడుకు తిక్కన్న (రాజ్‌బాబు). రామాచారి భార్య సీతమ్మ (హేమలత) భర్త తప్పుడు పనులను వారిస్తుంటుంది. పేదల కష్టం దోచుకొని.. వారిని హింసిస్తున్న రామాచారిని మల్లమ్మ ఎదిరిస్తుంటుంది. మల్లన్న శ్రీశైల శివునిపై రాసిన శతక పద్యాలను రామాచారి తగలబెట్టిస్తాడు. అమ్మవారి జాతర పేరున జరిగే జంతు బలులు జరగకుండా మల్లమ్మ అడ్డుపడుతుంది. అందుకు రామాచారి పేదల గుడిసెలు తగలబెట్టిస్తాడు. మల్లమ్మను, తోటివారిని రాజోద్యోగులచే దండింప చేస్తాడు. మల్లమ్మ వారంలోగా పెళ్లి చేసుకోవాలని ఆంక్ష విధింపచేస్తాడు. దాన్ని ఎదిరించి దూరంగా వెళ్లిన మల్లమ్మ -మహావిష్ణువును భర్తగా పొంది గ్రామానికి తిరిగి వస్తుంది. తెనాలి రామలింగని సూచనతో సంస్కృత భాషలోని రామాయణాన్ని తెలుగులో కేవలం ఐదు రోజుల్లో అనువాదం పూర్తిచేస్తుంది. దుష్టులు తలపెట్టిన ఆటంకాలు ఎదుర్కొని కావ్యం పూర్తిచేసిన మల్లమ్మను శ్రీకృష్ణదేవరాయలు సత్కరించటం, ఆమె కావ్య గానంచేస్తూ శ్రీరామునిలో ఐక్యం చెందటంతో చిత్రం ముగుస్తుంది[1].

పాటలు

[మార్చు]
సినిమానుండి సన్నివేశాలు
  1. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయా - ఆడించుచున్నాడు బొమ్మలాగా ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, రచన: దాశరథి
  2. జగమే రామమయం మనసే అగణిత తారక నామమయం - పి.సుశీల, రచన: సి నారాయణ రెడ్డి
  3. ఈ మహిమాభిరాముడు వషిష్టమహాముని పూజితుండు (పద్యం) - సుశీల, రచన: మొల్ల
  4. కలకల లాడుచు పాడుచు చెలికత్తెలు వెంటరాగా చెలువార (పద్యం) - పి.లీల, రచన: శ్రీ శ్రీ
  5. కట్టుకథలిక కట్టిపెట్టమో కమలాక్షి ( పద్యం ) - మాధవపెద్ది
  6. కూర్మరూపము దాల్చి కొండఅడుగున నిల్చి (పద్యం) - పి.లీల
  7. చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన (పద్యం) - సుశీల, రచన: మొల్ల
  8. తనువు నీదే మనసు నీదే వేరే దాచింది ఏముంది స్వామి - సుశీల, రచన: దాశరథి కృష్ణమాచార్య
  9. దొరవో ఎవరివో నా కొరకే దిగిన దేవరవో - సుశీల, ఘంటసాల, రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
  10. నానే చెలువే అందరికి ( ఐదు భాషలలో పాడిన పాట) - ఎల్.ఆర్. ఈశ్వరి,రచన: దాశరథి
  11. మానవ కల్యాణమునకు మల్లెల పందిళ్ళువేసి (పద్యం) - ఘంటసాల . రచన: సి నారాయణ రెడ్డి.
  12. మీన రూపమున అంభోనిలయమున జొచ్చి (పద్యం) - పి. లీల, రచన: సి నారాయణ రెడ్డి
  13. లంకా దహనము ( ప్రత్యక్ష రామాయణము ) - ఘంటసాల బృందం . రచన: అప్పలాచారి.
  14. వామనుండై పరశురాముడై కోదండరాముడై (పద్యం) - పి. లీల
  15. వరవరాహ కృతిగా నరసింహామూర్తిగా అసురులను (పద్యం) - పి.లీల
  16. సుడిగొని రాముపాదములు సోకినధూళి భజించి రాయి (పద్యం) - సుశీల, రచన: మొల్ల
  17. తిక్కన్న పెళ్లికొడుకయేనే మా మొల్లమ్మపెళ్లికుతురాయే - మాధవపెద్ది - రచన: అప్పలాచార్య
  18. అమ్మనురా పెద్దమ్మనురా ఊరిలో ముత్యాలమ్మనురా_ఎల్.ఆర్.ఈశ్వరి బృందం, రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి
  19. నిప్పులాంటి నింద పై బడగానే(పద్యం)_రాజబాబు
  20. అన్యాయాలకు బలైపోయిన అనాథల్లార_పి.సుశీల బృందం, రచన: శ్రీ శ్రీ .

మూలాలు

[మార్చు]
  1. సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (29 February 2020). "ఫ్లాష్ బ్యాక్ @ 50 కథానాయిక మొల్ల". ఆంధ్రభూమి దినపత్రిక. Archived from the original on 10 జూన్ 2020. Retrieved 10 June 2020.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

బయటిలింకులు

[మార్చు]