బొడ్డపాటి కృష్ణారావు
Jump to navigation
Jump to search
బొడ్డపాటి కృష్ణారావు | |
---|---|
వృత్తి | తెలుగు ఉపాధ్యాయుడు |
ప్రసిద్ధి | రంగస్థల, చలనచిత్ర నటుడు |
బొడ్డపాటి కృష్ణారావు తెలుగు సినిమా నటుడు. ఇతడు రాజనాల, ముక్కామల, రేలంగి మాదిరిగా ఇంటి పేరుతో బొడ్డపాటిగా సినిమా రంగానికి సుపరిచితుడు. ఇతని స్వస్థలం మచిలీపట్నం. వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయుడు. సినీరంగంలో ప్రవేశానికి ముందు ఇతడు నాటకాలలో సుబ్బిశెట్టి మొదలైన పాత్రలను ధరించి చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి వంటి పండితుల మెప్పును పొందాడు. ఇతడు తెలుగు తమిళ సినిమాలలో సుమారు 90 చిత్రాలలో చిన్న చిన్న పాత్రలను ధరించాడు. ఇతని మొదటి సినిమా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో 1954లో విడుదలైన అమర సందేశం.
చిత్రాల జాబితా
[మార్చు]బొడ్డపాటి నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:[1]
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Boddapati". indiancine.ma. Retrieved 10 June 2022.