అత్తా ఒకింటి కోడలే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అత్తా ఒకింటి కోడలే
(1958 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బి.తిలక్
తారాగణం కొంగర జగ్గయ్య,
దేవిక,
పి.హేమలత,
పి.లక్ష్మీకాంతమ్మ,
రమణారెడ్డి,
జె.వి.రమణమూర్తి,
గిరిజ,
సీత
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల,
మాధవపెద్ది సత్యం,
పిఠాపురం నాగేశ్వరరావు,
స్వర్ణలత,
జిక్కి,
పి.బి. శ్రీనివాస్
నిర్మాణ సంస్థ అనుపమ ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

అత్తా ఒకింటి కోడలే 1958, అక్టోబర్ 10న విడుదలైన కుటుంబ కథా చిత్రం.

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకుడు: కె.బి.తిలక్
 • కథ: పినిశెట్టి
 • పాటలు: ఆరుద్ర

నటీనటులు[మార్చు]

 • సూర్యకాంతం
 • హేమలత
 • పి.లక్ష్మీకాంతమ్మ
 • జగ్గయ్య
 • గిరిజ
 • రమణమూర్తి
 • చదలవాడ కుటుంబరావు
 • సీత
 • ప్రమీల (దేవిక)
 • పెరుమాళ్లు
 • రమణారెడ్డి
 • బొడ్డపాటి

కథ[మార్చు]

తాయారమ్మ భర్త సుబ్బారాయుడు. తాయారమ్మ ప్రతాపానికి జడిసి అత్త పార్వతమ్మ తన దూరపు చుట్టం ఇంట్లో కాలక్షేపం చేస్తూ ఉంటుంది. తాయారమ్మ కొడుకు రఘు బస్తీలో చదువుతూ శోభ అనే చిన్నదాన్ని ప్రేమిస్తాడు. శోభ తల్లి సుందరమ్మ గయ్యాళి. సుందరమ్మ కొడుకు చంద్రం మెత్తనివాడు. వియ్యంకుడు కట్నం ఇవ్వలేదని సుందరమ్మ కోడలు లక్ష్మిని కాపరానికి తీసుకురాలేదు. ఈ స్థితిలో రఘు శోభను పెళ్లి చేసుకోవాలంటే ముందుగా సుందరమ్మ తన కోడలిని ఇంటికి తెచ్చుకోవాలని షరతు పెడతాడు. లక్ష్మిని సుందరమ్మ హింస పెడుతూవుంటుంది. తాయారమ్మ శోభను మితిమీరిన ప్రేమతో అవస్థలు పెడుతూవుంటుంది. శోభ కొన్నాళ్లు క్షోభను సహించినా ఒక సారి అత్తను ఎదిరిస్తుంది. ఇంట్లో కలతలు రేగుతాయి. తాయారమ్మ కొడుకు విసుగెత్తి ఉద్యోగం చూసుకోవడానికి పట్నం పోతాడు. అక్కడ సుందరం కూడా అదే పని చేస్తాడు. చెదిరిపోయిన కుటుంబాలను కలపడానికి తండ్రి సుబ్బారాయుడు, కొడుకు రఘు ఒక పథకం వేస్తారు. రఘు తాగుబోతుగా నటించి తన అత్తగారు సుందరమ్మను హడలెత్తిస్తాడు. ఇటు సుబ్బారాయుడు తన తల్లికి దయ్యంపట్టినట్లు నటింపజేసి తాయారమ్మను హడలగొడతాడు. అత్తలిద్దరూ వీధిన పడి చివరకు రెండు కుటుంబాలూ చక్కబడడంతో కథ సుఖాంతమౌతుంది.[1]

పాటలు[మార్చు]

 1. అశోకవనమున సీతా శోకించె వియోగము - పి.సుశీల
 2. నాలో కలిగినది అది ఏమో ఏమో మధుర - ఘంటసాల, పి.సుశీల రచన: ఆరుద్ర.
 3. బుద్దొచ్చెనా నీకు మనసా మంచి బుద్దొచ్చెనా - మాధవపెద్ది సత్యం
 4. నీ దయ రాదా ఈ దాసి పైన -1 - పి.సుశీల
 5. జోడుగుళ్ళ పిస్తొలు ఠ నేను ఆడి - ఘంటసాల రచన: ఆరుద్ర.
 6. నీ దయ రాదా ఈ దాసి పైన -2 - పి.సుశీల
 7. మాయదారి కీచులాట మా మధ్య - పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత
 8. పైల పైల పచ్చీసు పరువములోని - పి.బి. శ్రీనివాస్, జిక్కి బృందం
 9. సైరా సైరా తిమ్మన్న నీవే ఎక్కువ - జిక్కి, పిఠాపురం బృందం
 10. రమ్మంటె వచ్చారు అమ్మాయిగారు - పి.బి. శ్రీనివాస్, జిక్కి
 11. లోకము దృష్టిలో కొందరు (పద్యం) - మాధవపెద్ది సత్యం
 12. లక్ష్మి కోరిన కోరిక (పద్యం) - మాధవపెద్ది సత్యం

మూలాలు[మార్చు]

 1. సంపాదకుడు (5 October 1958). "'అత్తా ఒకింటి కోడలే'". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 30 January 2020.[permanent dead link]
 • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)