Jump to content

స్వర్ణలత (పాత)

వికీపీడియా నుండి
స్వర్ణలత
జననంమార్చి 10, 1928
చాగలమర్రి, కర్నూలు జిల్లా
మరణంమార్చి 10, 1997
ఇతర పేర్లుమహాలక్ష్మి
ప్రసిద్ధిసినీ గాయని
భార్య / భర్తడా. అవరాథ్
పిల్లలు6 కొడుకులు & 3 కూతుర్లు
బంధువులుస్వర్ణలత

స్వర్ణలత (జ: మార్చి 10, 1928 - మ: మార్చి 10, 1997) పాతకాలపు తెలుగు సినిమా గాయనీమణి.[1] ఈమె 1950లు నుండి 1970లు మధ్య కాలంలో ఎక్కువగా హాస్యభరితమైన గీతాలు పాడారు. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మళయాళ, హిందీ, మొదలగు భాషల్లో కూడా పాటలు పాడారు. ఈమె అసలు పేరు మహాలక్ష్మి. ఈమె పరమానందయ్య శిష్యులు చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. అయినప్పటికీ మొదట విడుదలైన చిత్రం ఎన్టీఆర్‌ తొలిసారిగా పౌరాణిక పాత్ర పోషించిన మాయా రంభ.

జీవిత విశేషాలు

[మార్చు]

స్వర్ణలత అసలు పేరు మహాలక్ష్మి. ఈమె కర్నూలు జిల్లా, చాగలమర్రి గ్రామంలో 1928 సంవత్సరంలో మార్చి 10 తేదీన జన్మించింది. చిన్నతనంలో ఎనిమిదేళ్లపాటు క్షుణ్ణంగా సంగీతం నేర్చుకుంది. నాట్యం కూడా అభ్యసించింది. పౌరాణిక నాటకాల్లో పద్యాలు చదువుతూ నటించింది. గాత్రకచేరీలు చేసింది. తొలిసారిగా మాయా రంభ (1950) సినిమా కోసం కస్తూరి శివరావు కలిసి ‘రాత్రీ పగలనక...’ అనే పాటద్వారా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. కాశీకి పోయాను రామా హరీ, ఓ కొంటె బావగారూ అప్పుచేసి పప్పుకూడు (1959), అంచెలంచెలు లేని మోక్షము శ్రీకృష్ణార్జున యుద్ధం (1963), తడికో తడికో అత్తా ఒకింటి కోడలే (1958) వంటి పాటలు పాడారు.

ఈమె భర్త పేరు డా. అవరాథ్. వీరికి 1956 లో వివాహమైనది. వీరికి 9 మంది పిల్లలు: 6 కొడుకులు, 3 కూతుర్లు. ఒక కొడుకు సినీ నటుడు ఆనంద్‌రాజ్‌. నలుగురు కొడుకులు అమెరికాలో డాక్టర్లుగా స్థిరపడ్డారు. ఇంకొక కొడుకు డాన్సర్‌ నటరాజ్‌ (ఇప్పుడు అనిల్‌రాజ్‌). ఒక కూతురు అమెరికాలో డాక్టరు. ఇంకొక కూతురు స్వర్ణలత కూడా గాయని. భారతీయుడులో మాయామశ్ఛీంద్రా, ప్రేమికుడు లో ముక్కాల ముక్కాబులా, కలిసుందాం రా లో నచ్చావే పాలపిట్ట, చూడాలని వుంది లో రామ్మాచిలకమ్మా మొదలెన పాటలు పాడారు.[2]

మరణం

[మార్చు]

ఈమె 1997 సంవత్సరంలో మార్చి 10 తేదీన దోపిడీ దొంగలచే హత్య చేయబడ్డారు.

సినిమాలు

[మార్చు]
సం. సినిమా పాట తోటి గాయకులు
1950 మాయా రంభ రాత్రీ పగలనక కస్తూరి శివరావు
1952 పెళ్ళి చేసి చూడు అమ్మా నొప్పులే అమ్మమ్మా నొప్పులే రామకృష్ణ
1956 హరిశ్చంద్ర
1957 మాయాబజార్ విన్నావటమ్మా ఓ యశోదమ్మా పి. లీల
1958 అత్తా ఒకింటి కోడలే
1959 అప్పుచేసి పప్పుకూడు ఓ పంచవన్నెల చిలకా నీకెందుకింత అలక
కాశీకి పోయాను రామాహరి, గంగతీర్థమ్ము తెచ్చాను
ఘంటసాల
1960 రాణి రత్నప్రభ నీటైన పడుచున్నదోయ్ నారాజా నీకే నా లబ్జన్నదోయ్
పల్లెటూరి వాళ్ళము పాపపుణ్యాలెరుగము
విన్నావా నుకాలమ్మా వింతలెన్నో జరిగేనమ్మా
ఘంటసాల
1961 జగదేకవీరుని కథ ఆశా ఏకాశా నీనీడను మేడలు కట్టేశా
కొప్పునిండా పూవులేమే కోడలా నీకెవరు ముడిచినారే
ఘంటసాల
మాధవపెద్ది
1961 వెలుగునీడలు చిట్టీపొట్టీ చిన్నారి పుట్టినరోజు, చేరి మనం ఆడేపాడే పండుగరోజు పి.సుశీల
1962 కులగోత్రాలు రావయ్యా మా యింటికి రమ్మంటే రావేల మా యింటికి కృష్ణయ్యా సత్యారావు
1962 ఆరాధన ఏమంటావ్ ఏమంటావ్ ఓయి బావా పిఠాపురం నాగేశ్వరరావు
1963 శ్రీకృష్ణార్జున యుద్ధము అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమె భామిని బి.గోపాలం
1963 గురువుని మించిన శిష్యుడు
1963 చదువుకున్న అమ్మాయిలు ఏమిటి ఈ అవతారం ఎందుకు ఈ సింగారం మాధవపెద్ది
1963 లక్షాధికారి అచ్చమ్మకు నిత్యము శ్రీమంతమాయెనే జమునారాణి, వైదేహి
1964 దాగుడు మూతలు డివ్వి డవ్వి డివ్విట్టం నువ్వంటే నాకిష్టం పిఠాపురం
1964 బొబ్బిలి యుద్ధం ఏమయ్య రామయ్యా ఇలా రావయ్యా సత్యారావు, వసంత
1965 ఉయ్యాల జంపాల
1965 మంగమ్మ శపథం ఆ ఊరు నీదిగాదు ఈ ఊరు నాదిగాదు ఏఊరు పోదామయ్యా మాధవపెద్ది
1965 సుమంగళి కొత్త పెళ్ళికూతురా రా! నీ కుడికాలు ముందుమోపి రా! జమునారాణి, వసంత, ఈశ్వరి

మూలాలు

[మార్చు]
  1. టాలీవుడ్ ఫోటో ఫైల్స్ బ్లాగ్ స్పాట్ లో గాయని స్వర్ణలత గురించిన వివరాలు.
  2. Andhra Jyothy (18 March 2022). "స్వర్ణ స్వరం". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.

బయటి లింకులు

[మార్చు]