కలిసుందాం రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కలిసుందాం రా
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం ఉదయశంకర్
నిర్మాణం దగ్గుబాటి సురేష్ బాబు
తారాగణం వెంకటేష్,
సిమ్రాన్
సంగీతం ఎస్. ఎ. రాజ్ కుమార్
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

కలిసుందాం...రా ఉదయశంకర్ దర్శకత్వంలో 2000 లో విడుదలైన కుటుంబ కథాచిత్రం. వెంకటేష్, సిమ్రాన్ జంటగా నటించిన ఈ సినిమా ఘనవిజయం సాధించటమే కాక ఉత్తమ తెలుగు చిత్రం గా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాన్నిఅందుకొంది, వెంకటేష్ కు ఉత్తమ నటుడుగా నంది బహుమతిని అందించింది.

సంక్రాంతి పండుగ (జనవరి 14) రోజున విడుదలైన ఈ చిత్రం పూర్తి స్థాయి కుటుంబ నేపథ్యం ఉన్న సినిమాగా వచ్చి మ్యూజికల్‌ హిట్‌ కొట్టింది.[1]

చిత్ర కథ

[మార్చు]

హీరో వెంకటేష్ కుటుంబం ముంబాయిలో ఉంటుంది. తన తాతయ్య వీరవెంకట రాఘవయ్య ( కె.విశ్వనాథ్) షష్టిపూర్తి వివాహానికై ఆహ్వానం పంపగా కుటుంబంతో వస్తాడు. అందరినీ ఆటపట్టిస్తూ, సంతోషపరుస్తూ ఉంటాడు. హీరోయిన్ సిమ్రాన్. ఎన్నో చిలిపి తగాదాల తరువాత ఇద్దరూ ప్రేమలో పదతారు. ఊరి ఆనకట్ట విషయంలో చాకచక్యంగా మాట్లాడి అందరి మెప్పు పొందుతాడు. మనవడి వాగ్దాటికి తాత మురిసి తనకు బహుకరించేదుకు గొలుసు తేవడనికి వెళతాడు. ఇంతలో శ్రీ హరి కయ్యానికి కాలు దువ్వుతాడు. ఆగ్రహించిన వెంకటేష్ కూడా గొడవ పడతాడు. అక్కడికి వచ్చిన విశ్వానాథ్ అది చూసి వెంకటేష్ ను కొడతాడు. అవమానంతో సారాయి తాగుతుంటాడు. ఇంతలో రాళ్లపల్లి కలుగ చేసుకొని జరిగిన గతమంతా చెబుతాడు. ఆ గతం తెలుసుకున్న వెంకటేష్ శ్రీ హరి కుటుంబాన్ని, విశ్వానాథ్ కుటుంబాన్ని కలపాలనుకుంటాడు. అంతా కలిశాక సిమ్రాన్ ను శ్రీ హరి అక్క కొడుకుకు ఇచ్చి పెళ్ళి చేయాలని పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. దాంతో ఒకప్పుడు తన తండ్రి ప్రేమ వలన విడిపోయిన కుటుంబం, మళ్ళీ తన ప్రేమ వలన విడిపోకుడదనుకుంటాడు. అందువలన తన ప్రేమను త్యాగం చేయాలనుకుంటాడు. ఆఖరికి కథ సుఖాంతమోతుంది.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
  • నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం, హరి హరన్, సుజాత, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి.
  • మనసు మనసు కలిసిపోయే, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, రచన: వేటూరి సుందర రామమూర్తి.
  • పసిఫిక్ లో, ఉదిత్ నారాయణ్, అనురాధ శ్రీరామ్, రచన: చంద్రబోస్.
  • ప్రేమా ప్రేమా, ఉన్ని కృష్ణన్, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి.
  • నచ్చావే పాల పిట్ట, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత, రచన: చంద్రబోస్.
  • కలిసుంటే కలదు సుఖం, రాజేష్, రచన: వేటూరి సుందర రామమూర్తి.
  • బూమ్ బూమ్, శంకర మహదేవన్, రచన: చంద్రబోస్.

మూలాలు

[మార్చు]
  1. "రెండు దశాబ్దాల 'కలిసుందాం...రా' |". web.archive.org. 2023-10-01. Archived from the original on 2023-10-01. Retrieved 2023-10-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)