వెన్నెరాడై నిర్మల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెన్నెరాడై నిర్మల
Venniradai Nirmala.jpg
2007లో మాతృదినోత్సవ సందర్భంగా ఒక ఇంటర్యూలో వెన్నెరాడై నిర్మల
జననంఏ.బి.శాంతి
కుంబకోణం, తమిళనాడు, భారతదేశం
వృత్తిసినిమా నటి
క్రియాశీలక సంవత్సరాలు1965–ప్రస్తుతం

వెన్నెరాడై నిర్మల తమిళ సినిమా నటి. నిర్మల దక్షిణ భారత భాషలన్నింటా 100కు పైగా సినిమాలలో నటించింది.[1] శ్రీధర్ దర్శకత్వంలో వచ్చిన వెన్నెరాడై సినిమాతో రంగప్రవేశం చేయడంతో ఈమె పేరు వెన్నిరాడై నిర్మలగా స్థిరపడిపోయింది. 2007లో చాలాకాలం తర్వాత సినీరంగంలో మరల ప్రవేశించి గుణశేఖరన్ దర్శకత్వంలో వస్తున్న పెరియార్ సినిమాలోనూ, జీవా, భావన నటించిన రామేశ్వరం సినిమాలోనూ ముఖ్యప్రాత్రలు పోషిస్తున్నది. తన మొదటి సినిమాలో తనతో పాటు తెరపై పరిచయమైన జయలలితపై 1989 తమిళనాడు శాసనసభ ఎన్నికలలో, నిర్మల అండిపట్టి నియోజకవర్గం నుండి ఏ.ఐ.ఏ.డి.ఎం.కె (జానకి) వర్గపు అభ్యర్థిగా పోటిచేయటం విశేషం.[2]

నిర్మల నటీమణే కాకుండా, శిక్షణ పొందిన భరతనాట్య కళాకారిణి కూడా.[3][4]

నటించిన తెలుగు చిత్రాలు[మార్చు]

సంవత్సరము చిత్రము పాత్ర దర్షకత్వం తారాగణం
1971 బొమ్మా బొరుసా కె. బాలచందర్ చంద్రమోహన్, రామకృష్ణ
1971 బంగారు తల్లి తాపీ చాణక్య శోభన్ బాబు
1972 కత్తుల రత్తయ్య కె.ఎస్.ఆర్.దాస్ కృష్ణ
1972 దత్తపుత్రుడు అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ
1972 భలే మోసగాడు టి.లెనిన్ బాబు కృష్ణ
1972 మాయింటి వెలుగు విజయ్ కృష్ణ
1972 సోమరిపోతు వి.రామచంద్రరావు చలం
1973 ధనమా దైవమా సి.ఎస్.రావు నందమూరి తారక రామారావు, జమున, చంద్రమోహన్
1973 వారసురాలు బి.హరి నారాయణ రామకృష్ణ
1974 నిజరూపాలు కె.వి.నందనరావు రామకృష్ణ
1974 మాంగల్య భాగ్యం పద్మనాభం భానుమతి, జగ్గయ్య, జయంతి, చంద్రమోహన్
1974 స్త్రీ గౌరవం ఎస్.ఎస్.దేవదాస్ క్రష్ణంరాజు, దేవిక
1976 దేవుడే గెలిచాడు విజయనిర్మల క్రష్ణ, విజయనిర్మల
1978 కరుణామయుడు ఎ.భీంసింగ్ టి.యస్.విజయచందర్
1980 కాళి ఐ.వి. శశి రజనీకాంత్‌, చిరంజీవి
1980 చుక్కల్లో చంద్రుడు సి.ఎస్. రావు చంద్రమోహన్, కాంతారావు
సీమసింహం
గాలిపటాలు
1997 అరుణాచలం
2004 శంకర్‌దాదా ఎంబీబీఎస్‌

మూలాలు[మార్చు]

  1. Back with a brim - Venniradai Nirmala - ఇండియా గ్లిట్జ్ ఏప్రిల్ 20, 2007
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-10-22. Retrieved 2008-11-29.
  3. Randor Guy (2008-10-31). "Trend-setter". The Hindu. Retrieved 2013-02-20.
  4. M. Balaganessin (2007-04-03). "She wants novel role". The Hindu. Retrieved 2013-02-20.

బయటి లింకులు[మార్చు]