కుంభకోణం

వికీపీడియా నుండి
(కుంబకోణం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కుంభకోణం
పట్టణం
montage image showing a building, clock tower, temple towers and temple tanks
కుంభకోణం టౌన్ హాల్, ఆది కుంభేశ్వర దేవాలయం, సారంగపాణి దేవాలయం గోపురాలు, క్లాక్ టవర్, పోత్రమరై ట్యాంక్
Country India
రాష్ట్రముతమిళనాడు
ప్రాంతముచోళనాడు
జిల్లాతంజావూరు జిల్లా
Government
 • Municipal ChairpersonRathna Sekar
విస్తీర్ణం
 • Total12.58 కి.మీ2 (4.86 చ. మై)
Elevation
24 మీ (79 అ.)
జనాభా
 (2011)
 • Total1,40,156
 • జనసాంద్రత11,000/కి.మీ2 (29,000/చ. మై.)
Languages
 • Officialతమిళము
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
612001
Telephone code(91) 435
Vehicle registrationTN 68

కుంభకోణం (ఆంగ్లం : Kumbakonam (తమిళం கும்பகோணம் ) ఒక పట్టణం, పురపాలక సంఘం. తమిళనాడుకు చెందిన తంజావూరు జిల్లాలో గలదు.

దక్షిణభారతదేశంలో అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాలలో కుంభకోణం ఒకటి. ఇది మరియొక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చిదంబరానికి నైఋతి దిశలో 70 కిలోమీటర్లు (43 మైళ్ళు) దూరంలో ఉంటుంది. పట్టణానికి కావేరి నది ఒకవైపు, అరసలార్ నది ఒకవైపు ప్రవహిస్తూ ఉంటాయి.

సృష్టి కారకుడైన బ్రహ్మచే సృష్టించబడిన అమృతభాండము ప్రళయంలో కొట్టుకుపోతూ పరమశివుడి ఆజ్ఞతో ఇక్కడ వెలిసిందనీ దానివల్లనే ఈ పట్టణానికి కుంభకోణం అని పేరు వచ్చిందనీ స్థానికుల విశ్వాసం. ఈ పట్టణంలో ప్రాచీన దేవాలయాలు చాలా ఉన్నాయి.[1] పన్నెండు శైవ ఆలయాలు, నాలుగు వైష్ణవాలయాలు, అత్యంత అరుదుగా కనిపించే బ్రహ్మ దేవాలయం కూడా ఉంది. వీటిలో సారంగపాణి (విష్ణువు) దేవాలయం చాలా ప్రాశస్త్యమైనది. దీని మధ్యలో ఉండే గోపురం దేవాలయ సముదాయంలో కెల్లా అతి ప్రాచీనమైనది, ఎందుకంటే పన్నెండు మంది వైష్ణవాళ్వార్లలో ఎనిమిది మంది దీని ప్రాశస్త్యాన్ని కీర్తించడం జరిగింది. సా.శ. 1300-1700 మధ్యలో నాయక్ రాజులు ఈ ఆలయాన్ని పలుదశల్లో విస్తరించడం జరిగింది.

దీని గోపురం 44 మీటర్ల (146 అడుగులు) ఎత్తు, 12 అంతస్తులు కలిగిఉంటుంది. ఈ గుడికి రెండు ప్రధాన ద్వారాలుంటాయి. దక్షిణ ద్వారాన్ని దక్షిణాయన కాలంలోనూ, ఉత్తర ద్వారాన్ని ఉత్తరాయణ కాలంలోనూ ఉపయోగిస్తారు. ఆలయానికి ఉత్తర భాగంలో కోమలవల్లి అమ్మవారి గోపురం ఉంటుంది. ఆలయ ఆవరణలో భక్తులు ప్రవేశించే ముందే స్నానం చేయడం కోసం ఒక పుష్కరిణి కూడా ఉంటుంది. ప్రతీ సంవత్సరం ఈ పుష్కరిణిలోనే తెప్పోత్సవం నిర్వహించబడుతుంది. ఇక్కడి పూజలు ఇతర కార్యక్రమాలు పంచరత్ర ఆగమాలను అనుసరించి జరుపబడతాయి. దేవాలయానికి అత్యంత రమణీయంగా చెక్కబడిన రెండు రథాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాడేందుకు ఒక వెండి రథం కూడా ఉంది.

పట్టణంలో ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "కుంభకోణం". www.suryaa.com. 2014-06-02.[permanent dead link]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కుంభకోణం&oldid=3903840" నుండి వెలికితీశారు