Jump to content

అమరావతి శేషయ్య శాస్త్ర్రి

వికీపీడియా నుండి
సర్ అమరావతి శేషయ్య శాస్త్రి
అమరావతి శేషయ్య శాస్త్ర్రి

Portrait of Sir A. Seshayya Sastri


పుదుక్కోట్టై యొక్క దివాన్
పదవీ కాలం
1878 – 1894
చక్రవర్తి రామచంద్ర తొండైమాన్ (1878-1886),
మార్తాండ భైరవ తొండైమాన్ (1886-1894)
తరువాత ఆర్. వేదాంతాచార్యులు

ట్రావెన్‌కోర్ యొక్క దివాన్
పదవీ కాలం
మే 1872 – 1877
చక్రవర్తి Ayilyam Thirunal of Travancore
ముందు రావు బహదూర్ సర్ టి. మాధవరావు K.C.S.I
తరువాత నానూ పిళ్ళై

వ్యక్తిగత వివరాలు

జననం (1828-03-22)1828 మార్చి 22
తంజావూరు, మద్రాసు ప్రెసిడెన్సీ,ఇండియా
మరణం 1903 అక్టోబరు 29(1903-10-29) (వయసు 75)
మద్రాసు ప్రెసెడెన్సీ, ఇండియా
జాతీయత British Indian
జీవిత భాగస్వామి సుందరి
పూర్వ విద్యార్థి మద్రాసు యూనివర్సిటీ స్కూలు.
వృత్తి నిర్వాహకుడు
మతం హిందూ

అమరావతి శేషయ్య శాస్త్రి (1828-1903) మచిలీపట్టణం జిల్లా తాసిల్దారుగాను, ఈనాముల డెప్యూటీ కలెక్టరుగానూ, తిరువాంకూరు, పుదుక్కోటై సంస్ధానముల దివానుగాను చేశారు.

పరిచయం

[మార్చు]

కంపెనీ ప్రభుత్వకాలంలో వీరు మచిలీపట్టణం జిల్లా తాసిల్దారుగాను, ఈనాముల డెప్యూటీ కలెక్టరుగానూ, తిరువాంకూరు, పుదుక్కోటై సంస్ధానముల దివానుగాను చేశారు. వీరు చేసిన గొప్ప సంస్కరణలు చెప్పుకోదగ్గవి. తమిళులైనప్పటికీ కంపెనీ ప్రభుత్వహయాములో రెవెన్యూ విభాగంలో తెలుగుదేశంలో చాలకాలం పనిచేయబట్టి వారు తెలుగు అనర్గళంగా మాట్లాడటమే గాక వ్రాతకోతలు గూడా నేర్చుకున్నారు. వీరిని గురించి దిగవల్లి వేంకట శివరావు గారి అప్రచురిత వ్యాసములలో జీవితచరిత్రలు అను చేతివ్రాత ప్రతిలో నున్నది.[1]

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

యశఃకాయులైన శ్రీ అమరావతి శేషయ్య శాస్త్రి గారు 1828 మార్చి 22లో తమిళనాడులోని కుంభకోణం దగ్గర వెట్టారు నదీతీరమున యున్న అమరావతి అను చిన్న పల్లెటూరిలో బీద కుటుంబములో జన్మించారు[2][3] వారి స్వగ్రామములోనే వీధిబడిలో ప్రారంభమైనది వారి విద్యాభ్యాసం. తరువాత చన్నపట్టణంలో అప్పట్లో 'నల్లవారి బస్తీ' అనబడి తదుపరి జార్జిటౌను అని ప్రసిధ్ధి పొందిన ప్రాంతంలో 1837 లో స్తాపించిన ఆండర్సన్ మిషనరీ స్కూలులో 2 ఏండ్లు చదివారు. కానీ ఆ బడిలో ఇంగ్లీషు, లెఖ్కలతో పాటు క్రైస్తవ మత ప్రచారమునకు చాల ప్రాముఖ్యతనివ్వడం వల్ల శాస్త్రిగారిని వారి పెద్దలు ఆ బడి మాన్పించేశారు. ఆ తరువాత కొంతకాలం శాస్త్రిగారు కుంభకోణంలో యూరేషియన్ మిషనరీలు (ఆంగ్లేయ+ ఆసియాదేశీయ) (EURASIAN) దగ్గర ఇంగ్లీషు నేర్చుకున్నారు. చన్నపట్ణం లోని కంపెనీ ప్రభుత్వమువారు మతప్రబంధములేని మద్రాసు యూనివర్సిటీ స్కూల్అను ఇంగ్లీషు బోధనా పాఠశాలను 1840 లో స్ధాపించారు. శాస్త్రిగారు ఆ యూనివర్సిటీ స్కూలులో చదువు సాగించారు. ఆ పాఠశాలలోఇ.బి పొవెల్ (E.B. Powell) దొరగారు ఉపాధ్యాయులుగానుండిరి. పరవస్తు చిన్నయసూరి మరియూ పురాణం హయగ్రీవశాస్త్రి గారు తెలుగు పండితులుగా పనిచేసి యుండిరి. మద్రాసులో అటుతరువా కొంతకాలానికి ప్రముఖ ధర్మకర్త పచ్చయప్ప మొదలియారు గారు వారి పేరుమీద మరి ఒక బడి స్థాపించారు. ఇంగ్లీషు విద్యా సర్వె ఫలితముగా ఏర్పడిన అటువంటి మతసంబంధములేని ఇంగ్లీషు బోధనా స్కూలులో విద్యనేర్చిన వారిని ప్రొఫిసెంట్సు (Proficients) అనే వారు.[4] శాస్త్రి గారు గూడా 'ప్రొఫిష్యంట్' అయ్యారు. శాస్త్రి గారు తమ చిన్న తరగతులలో Messers White Brother, Messers Adam Gordon and E.B. Powell అను దొరల దగ్గర చదివారు [5]

ఉద్యగం

[మార్చు]

1846 లో మద్రాసుపచ్చయప్పా పాఠశాల భవన శంకుస్థాపన సందర్భములో శాస్త్రిగారి ఉపన్యాసమును క్రెసెంటు అను పత్రికాధిపతి గొప్పగా మెచ్చుకున్నారు. శాస్త్రి గారు 1848 చెన్నపట్ణంలోని రివెన్యూ బోర్డులో గుమాస్తాగా నెలకు రూ 25ల జీతము గల ఉద్యోగములో ప్రవేశించారు. అప్పడు రివెన్యూ శాఖాధికారి హెన్రీ పైక్రాఫ్టు దొరగారు ( Mr.Henry Pycroft). ఆ దొరగారి రివెన్యూనిధానముపై చేసిన రచనలు చాల ప్రసిధి పొందియుండెను. వారి విభాగంలో పనిచేయుచున్న మన శాస్త్రిగారు కార్యాలయ వ్యవహారములలో రాసియున్న కొన్ని కొన్ని చిత్తు (drafts) ప్రతులు దొరగారినాకర్షించినవి. రివెన్యూ బోర్డులో సీనియర్ సభ్యులలో ఒకరై అటు తరువాత సర్ బిరుదుపొందిన వాల్టర్ ఇలియట్ గారు ( Sir Walter Eliot) ఉత్తర సర్కారుల కమీషనరైనారు. ఆ కమీషనర్ గారు 1850 లో ఆంధ్ర ప్రాంతములకు పర్యటనకు వెళ్లినప్పుడు మన శాస్త్రిగారిని కూడా వెంటబెట్టుకుని వెళ్లారు. రివెన్యూ విభాగములోని వినిధశాఖల వ్యవహారములకు సంబంధించిన విషయాలలో శాస్త్రిగారాయనకు కుడిభుజముగా నుండుటయే గాక అటుతరువాత గుంటూరు జిల్లా రెవెన్యూ వ్యవహారనిచారణలోనూ దొరగారి చరిత్ర పరిశోధన లోనూ వారికి తోడ్పడెవారు. శేషయ్య శాస్త్రి ఇలియట్ దొరగారికి పర్సనల్ అసిస్టేంటు గానుండేవారు. 1851 లో శాస్త్రిి గారు మచిలీపట్టణం జిల్లా తాసిల్దారుగా నియమింపబడినారు. 1854 సంవత్సరం ఫిబ్రవరినెలలో నయాబ్ సిరస్తదారు అనగా హుజూరు సిరస్గ దారు క్రింది అధికారిగా నియమించారు. 1855 సంవత్సరములో శాస్త్రిగారిని మచిలీపట్ణం జిల్లా హుజూరు సిరస్థదారుగా నియమించారు. శేషయ్య శాస్త్రిగారు చాలకాలము తెలుగుప్రాంతములో ఉద్యోగిగావున్నందువల్ల ఆయన తమిళుడైనా తెలుగు భాషను అనర్గళంగా మాట్లాడమేగాక వ్రాతకోతలు కూడా నేర్చుకున్నారు. ఆయన మచిలీపట్టణం జిల్లాలోని అన్ని మారుమూలల గ్రామాలకూ స్వయముగావెళ్లి గ్రామస్తుల కష్టసుఖములు తెలుసుకునేవారు. ఆకాలములోని వివిధకచేరీల జమాబందీలో కలెక్టరులు శిరస్తదారులపైననే ఆధార పడెేవారు. శాస్త్రిగారు నీతి నిజాయితీ, అఖండప్రజ్ఞాపాలను చూసి ప్రజలు రైతుల ఆశ్యర్యపడేవారు. శేషయ్య శాస్త్రిగారు ఈ జిల్లాలో మొత్తం 8 సంవత్సరాలు పనిచేశారు. 1857 లో సంభవించిన గ్రేటు ఇండియన్ మ్యూటినీ (Great Indian Mutiny) అనే విప్లవకాలంలో బందరులోని మహమ్మదీయ జనాభా అత్యధికముగానుండుటవలన శాస్త్రిగారు చాలా దూరదృష్టితో అనేక జాగ్రత్తలు తీసుకొని తమ ఉద్యాగం నిర్వహించారు. ఆ విషయము వారి పై అధికారులైన దొరలు గ్రహించారు. శేషయ్య శాస్త్రిగారిని చెన్నపట్టణం రాజధానిలోని ప్రభుత్వమువారులు మొచ్చుకుని ఆయనను 1859 సంవత్సరములో వారిని డిప్యూటీ కలెక్టురు గాపదోన్నతినిచ్చి అప్పట్లో ఇనాముల కమీషనర్ గానుండిన జార్జి నోబెల్ టైలరు (George Nobel Tayler) దొర గారికి స్పెషల్ అసిస్టెంటుగా నియమించారు. తరువాత ఎండోమెంట్సు డిప్యూటీ కలెక్టరుగా నియమించారు (Endowments Deputy Collector). అటు తరువాత 1866 లో ట్రెజరీ డిప్యూటీ కలెక్టరు (Treasury Deputy Collector) నియమించబడ్డారు. 1868 లో శేషయ్య శాస్త్రిగారు మద్రాసులోసైంట్ జార్జి ఫోర్టులోనున్న కంపెనీ ప్రభుత్వ రివెన్యూ బోర్డులో హెడ్ సిరస్తదారుగా నియమింప బడ్డారు.

మచిలీపట్ణం జిల్లాలో చేసిన విశేష కృషి

[మార్చు]

అప్పటి మచలీపట్ణం ఇప్పటి కృష్ణా + గుంటూరు జిల్లాలు కలసి యున్న పెద్ద భౌగోళిక విభాగం. ఆ మచిలీపట్ణం జిల్లాలో 1842 సంవత్సరమునుండీ శేషయ్య శాస్త్రిగారు తాహసిల్దారు గానుా, నయాబ్ సిరస్థదారుగానూ, హుజూర్ సిరస్థదారు గానూ మొత్తం 8 సంవత్సరములపాటు చేసిన కృషి చెప్పకోదగ్గది. శాస్త్రిగారికి కాలమునకు పూర్వము పోర్టరు అనేదొరగారు (Mr. Porter) కలెక్టరుగారు బధ్ధకస్తుడై జిల్లా పరిపాలనను అశ్రధచేయుటవలన జిల్లాలో అనినీతి లంచగొండి తనము ప్రబలమై యున్నది.

ఎండోమెంట్స్ డిప్యూటీ కలెక్టరుగా చేసిన విఖ్యాత కృషి

[మార్చు]

శేషయ్య శాస్త్రిగారు ఆకాలములో (1859-1865) ఎండోమెంటు డిప్యూటీ కలెక్టరుగా (Endowments Deputy Collector) చాల విశేషమైన, అసాధారణమైనట్టి ఘనకార్యములు సాధించారు. దాదాపుగా రెండున్నర లక్షల ఒరిజనల్ క్లైమ్సు పత్రాలను పరిశీలించి అనేక వేలఎండోమెంటు క్లైమ్సులు పరిష్కరించారు. ఎండోమెంటు క్లైమ్సు పరిష్కరణ సాధారణ విషయముకాదు అందులో ఎన్నో సమస్యలు తికమకలు కూడుకొనివుంటాయి. శేషయ్య శాస్త్రిగారి ఎండోమెంటు పరిష్కరణా ఫలితములు ప్రఖ్యాతి గాంచి తరాల తరాలుగా కృష్ణా జిల్లా ప్రజలు చెప్పుకునేవారు. వారి పరిష్కారణా ఫలితములు స్వయముగా అనుభవించి తెలిసినవారిైనవేలూరి యజ్ఞన్నారాయణ శాస్త్రిగారు (1880-1952 (వేలూరి శివరామశాస్త్రి గారి) అన్నగారు కృష్ణాజిల్లా కాపురస్తుల, చిరివాడ అగ్రహారవాస్తవ్యులు మిత్రులైన దిగవల్లి వేంకట శివరావుగారికి చెప్పినట్లుగా నున్నది.[6] శేషయ్య శాస్త్రిగారు ఇనాముల పరిష్కరణలో చాల ఔదార్యము ప్రదర్సించారు.

మూలాధారములు

[మార్చు]
  1. "జీవిత చరిత్రలు" దిగవల్లి వేంకట శివరావు అప్రచురిత వ్యాసములు
  2. Pillai, Poovattoor Ramakrishna (1990). Visakhavijaya, a Study. Anitha Publications. p. 85.
  3. Tanjore District Handbook. Madras (India : State) Record Office, Tamil Nadu, India, B. S. Ranga Record Office. 1957. p. 419.
  4. ఇంగ్లీషు చదువుల చరిత్ర, దిగవల్లి వేంకట శివరావు కృష్ణా పత్రిక మార్చి- ఏప్రిల్ 1941(వ్యాస సంపుటలు)
  5. "FIGHT AND FRUSTRATION:THE BIRTH OF A HISTORY". Archived from the original on 2015-07-29. Retrieved 2015-08-10.
  6. "దిగవల్లి వేంకట శివరావు అప్రచురిత వ్యాసములు"

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]