గుణశేఖర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుణశేఖర్
జననం (1964-06-02) 1964 జూన్ 2 (వయసు 60)
వృత్తిదర్శకుడు
రచయిత
నిర్మాత
జీవిత భాగస్వామిరాగిణి గుణ
పిల్లలునీలిమ గుణ, యుక్తాముఖి

గుణశేఖర్ ఒక ప్రముఖ సినీ దర్శకుడు. 1997 లో గుణశేఖర్ దర్శకత్వం వహించిన బాల రామాయణం జాతీయ ఉత్తమ బాలల చిత్రంగా పురస్కారాన్ని అందుకోవడమే కాక రాష్ట్ర స్థాయిలో కూడా పలు నంది పురస్కారాలను అందుకుంది. అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.[1][2]

2003 లో అతను దర్శకత్వం వహించిన ఒక్కడు సినిమా 8 నంది అవార్డులనూ, ఉత్తమ దర్శకుడి పురస్కారంతో పాటు నాలుగు ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకుంది. 2003 సంవత్సరానికి గాను అత్యధిక వసూళ్ళు రాబట్టింది. వివిధ భాషల్లోకి డబ్బింగ్ చేయబడింది.[3][4] 2015 లో విడుదలైన చారిత్రాత్మక సినిమా రుద్రమదేవి సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు పొంది చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించింది. [5][6]

జీవిత విశేషాలు

[మార్చు]

గుణశేఖర్ 1963 జూన్ 2 న ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అనకాపల్లె జిల్లాలోని నర్శీపట్నంలో జన్మించాడు. ఆయన భార్య పేరు రాగిణి. ఈమె తిరుపతి వాస్తవ్యురాలు. వీరికి నీలిమ, యుక్త అనే ఇద్దరు కుమార్తెలున్నారు.[7] నీలిమ మాస్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ చేసింది.

కెరీర్

[మార్చు]

గుణశేఖర్ తొలినాళ్ళలో డి. వి. నరసరాజు, క్రాంతి కుమార్, రాం గోపాల్ వర్మ మొదలైన వారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశాడు.[8] ఆయన మొదటి సినిమా 1992 లో వచ్చిన లాఠీ అనే సాంఘిక రాజకీయ చిత్రం. ఈ చిత్రానికి గాను ఉత్తమ నూతన దర్శకుడిగా నంది పురస్కారం అందుకున్నాడు. 1995 లో అతను దర్శకత్వం వహించిన సొగసు చూడతరమా ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం అందుకుంది. 1998 లో చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన చూడాలని ఉంది సినిమా వ్యాపారాత్మకంగా మంచి విజయం సాధించింది. ఈ చిత్రంతోనే తొలిసారి తెలుగు తెరపైన డిటిఎస్ సాంకేతికత పరిచయం అయింది. 2000 సంవత్సరంలో వచ్చిన మనోహరం సినిమాకు గాను ఉత్తమ కథారచయితగా నంది పురస్కారం అందుకున్నాడు. 2004 లో మహేష్ బాబు కథానాయకుడిగా వచ్చిన అర్జున్ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో మెయిన్ స్ట్రీం విభాగంలో ప్రదర్శించబడింది.[9] 2001 లో చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన మృగరాజు ప్రేక్షకులను అంతగా ఆకట్టులేక బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. 2015 లో వచ్చిన రుద్రమదేవి చిత్రానికి తానే దర్శక నిర్మాతగా వ్యవహరించాడు. ఇది 3డి లో తీశారు. ఈ చిత్రం తెలంగాణా ప్రాంతానికి చెందిన కాకతీయ రాజుల చరిత్రను చూపించడం వల్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దీనికి పన్ను మినహాయింపు ఇచ్చారు.

సినిమాల జాబితా

[మార్చు]
  1. లాఠీ (1992)
  2. సొగసు చూడ తరమా (1995)
  3. రామాయణం (1996)
  4. చూడాలని వుంది (1998)
  5. మనోహరం (2000)
  6. మృగరాజు (2001)
  7. ఒక్కడు (2003)
  8. అర్జున్ (2004)
  9. సైనికుడు (2006)
  10. వరుడు (2010)
  11. నిప్పు (2012)
  12. రుద్రమదేవి (2015)
  13. శాకుంతలం (2023)

మూలాలు

[మార్చు]
  1. IANS. "Glad we finished Rudhramadevi on time: Gunasekhar". The Hindu.
  2. Sangeetha Devi Dundoo. "Rudhramadevi review". The Hindu.
  3. "YVS, Gunasekar & Ravi were rommates". The Times Of India. Archived from the original on 2013-05-24. Retrieved 2016-08-21.
  4. "Deccan Chronicle - Latest India news - Breaking news - Hyderabad News - World news - Business - Politics". Archived from the original on 2018-10-06. Retrieved 2016-08-21.
  5. "Rudhramadevi box office collection: Anushka Shetty-starrer mints Rs 32 crore in the opening weekend". msn.com. Archived from the original on 2019-02-07. Retrieved 2016-08-21.
  6. "Rudhramadevi Box Office Collection". Box Office. 11 October 2015. Archived from the original on 13 October 2015. Retrieved 21 August 2016.
  7. kavirayani, suresh (2015-10-16). "Gunasekhar's dynamic duo". Deccan Chronicle.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. "Gunasekhar, RGV, Krishna Vamsi, Teja, Uttej Old Photo - Gunasekhar". Gulte.com.
  9. "Directorate of Film Festival" (PDF). iffi.nic.in. Archived from the original (PDF) on 24 November 2011. Retrieved 12 July 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=గుణశేఖర్&oldid=3885171" నుండి వెలికితీశారు