రుద్రమదేవి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రుద్రమదేవి
దస్త్రం:Rudrama Devi Poster.jpg
రుద్రమదేవి సినిమా ముఖపత్రం
దర్శకత్వంగుణశేఖర్
నిర్మాతగుణశేఖర్
నటులుఅనుష్క శెట్టి
రానా దగ్గుబాటి
శివ కుమార్ శ్రీపాద
విక్రమ్‌జీత్ విర్క్
ప్రకాష్ రాజ్
కృష్ణంరాజు
నిత్య మెనన్
ఆదిత్య మెనన్
సంగీతంఇళయరాజా
ఛాయాగ్రహణంఅజయ్‌నన్ విన్సెంట్
కూర్పుఎ.శ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ
గుణ టీమ్ వర్క్స్
విడుదల
SEP 09, 2015
దేశంఇండియా
భాషతెలుగు
తమిళం
మలయాళం
ఖర్చుINR60 కోట్లు (U.6)[1][2]collection 80crore

రుద్రమదేవి, 2015 లో గుణశేఖర్ రూపకల్పనలో వచ్చిన 3డి చారిత్రక చిత్రం, ఒకేసారి తెలుగు, తమిళం మరియు మలయాళ భాషల్లో రూపొందినది.[3] అనుష్కశెట్టి, శివ కుమార్ శ్రీపాద, కృష్ణంరాజు, దగ్గుబాటి రానా, విక్రమ్ జీత్ విర్క్, ప్రకాశ్ రాజ్, ఆదిత్య మెనన్, నిత్య మెనన్, బాబా సెహగల్ మరియు కాథరీన్ త్రెసలతో కూడిన భారీ తారాగణం చిత్రంలో ఉంది.[4] అనుష్క 13వ శతాబ్ది కాకతీయ వంశపు రాణి రుద్రమదేవి గా నటిస్తున్నారు.[5] ఈ సినిమాకి నేపథ్యం సంగీతం, సంగీతం ఇళయరాజా అందిస్తున్నారు [6] తోట తరణి ఆర్ట్ డైరెక్షన్ నిర్వహిస్తున్నారు.[7] నీతా లుల్లా కాస్ట్యూం డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.[8] అక్టోబరు 09, 2015న విడుదల చేసారు.[9]

నిర్మాణం[మార్చు]

దర్శకుడు గుణశేఖర్ రాణి రుద్రమదేవి చరిత్రను ఆధారం చేసుకుని స్క్రిప్ట్ తయారుచేసుకున్నారు. అనుష్క, నయనతార మరియు ప్రియాంక చోప్రాలను ప్రధానపాత్రకు ఆలోచించి, చివరకు గతంలో అరుంధతి సినిమాకు గాను అనుష్క చేసిన నటనను బట్టి ఆమెను టైటిల్ రోల్ కి తీసుకున్నారు. గుణశేఖర్ ఇళయరాజాను సంగీతానికి, తోటతరణిని ఆర్ట్ డైరెక్షన్ కు తీసుకున్నారు. సినిమాను 70 కోట్ల రూపాయల బడ్జెట్లో నిర్మించారు.[1][2] మహేష్ బాబు మరియు జూనియర్ ఎన్టీఆర్ లను గోనగన్నారెడ్డి పాత్రకు సంప్రదించగా వారిద్దరిలో ఎవరూ అందుకు ముందుకురాలేదు. తర్వాత స్వయంగా శివ కుమార్ శ్రీపాద ఆ పాత్రను పోషించేందుకు ముందుకువచ్చారు.

చిత్ర బృందం[మార్చు]

నటులు: అనుష్క, అల్లు అర్జున్, రాణా, నిత్యమీనన్, కేథరీన్, కృష్ణంరాజు, ప్రకాష్‌రాజు, సుమన్ సంగీతం: ఇళయరాజా కళ: తోట తరణి ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ కథ, కథనం, దర్శకత్వం: గుణశేఖర్


దర్శకుడు గుణశేఖర్ ‘రుద్రమదేవి’ గురించి చరిత్రలో సామాన్యుడికి అందని అనేక విషయాలను శోధించాడు. కష్టపడి కథగా అల్లుకున్నాడు. కథను తెరకెక్కించేందుకు నిర్మాణంలో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. భారీ బడ్జెట్ సినిమా కనుక -మరో నిర్మాతను రిస్క్‌లో పెట్టకూడదన్న ఆలోచనతో తనే రిస్క్ చేశాడు. చారిత్రక ఘట్టాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించే ప్రయత్నం కనుక -తాను ఆశించింది వచ్చే వరకూ ఆలస్యాన్నీ భరించాడు. చివరకు ‘రుద్రమదేవి’ని విడుదల చేసే విషయంలోనూ -గుణశేఖర్‌ను కష్టాలే చుట్టుముట్టాయి. వాటినీ భరించి, వౌనంగా సహించి.. చివరకు తను స్వప్నాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు.

గణపతిదేవుడి పాలనలో సుభిక్షంగా సాగుతున్న కాకతీయ సామ్రాజ్యంపై శత్రురాజులు కన్నేస్తారు. ఆ సమయంలో మహారాజుకు ఆడపిల్ల పుడుతుంది. ఆడపిల్ల రాజ్యాధికారానికి అనర్హురాలు. పైగా, శత్రురాజుల దండెత్తే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో -పుట్టిన బిడ్డను రుద్రమదేవుడిగా రాజ్యానికి పరిచయం చేస్తాడు. అలా మొదలైన కథ -అసలు విషయానికి దూరంగా జన్మ రహస్యం పాయింట్ చుట్టూనే తిరిగింది. రుద్రమదేవి జన్మ రహస్యం బహిర్గతం కావడమే -సినిమాకు టర్నింగ్ పాయింట్. తరువాత యుద్ధ వ్యూహాలతో సినిమా పతాక సన్నివేశాలకు వెళ్లిపోయింది. ఖడ్గ విద్యలో నైపుణ్యం, మత్తగజాన్ని లొంగదీయడం, చుట్టుముట్టిన సైనికులను చీల్చిచెండాడటం, శత్రుదుర్భేద్యమైన ఏడుకోటల నిర్మాణం, పన్నుల రద్దుకు సాహసోపేత నిర్ణయం, కులాంతర వివాహాలను ప్రోత్సహించడం, రుద్ర సైన్యం ఏర్పాటులాంటి కీలక సన్నివేశాలున్నాయి.

తారాగణం[మార్చు]

చిత్రీకరణ[మార్చు]

సినిమా చిత్రీకరణ ప్రారంభమైన వేయి స్తంభాలయం

సినిమా చిత్రీకరణ 14 ఫిబ్రవరి 2013న వరంగల్లు లో ప్రారంభమైంది. మొదటి షాట్ వరంగల్లు లోని చారిత్రక ప్రదేశమైన వేయిస్తంభాలయంలో చిత్రీకరించారు[10] డాన్స్ డైరెక్టర్ బాబా సెహగల్‌ని ఓ పాత్ర కోసం తీసుకున్నారు.[11]  అశుతోష్ గోవారికర్ ఖేలే హమ్ జీ జాన్ సే (2010)లో నెగెటివ్ పాత్రను పోషించిన విక్రమ్‌జీత్ విర్క్‌, మహదేవ నాయకుడు అన్న నెగెటివ్ పాత్రలో కనిపిస్తున్నాడు. చిత్రీకరణ ఆఖరి షెడ్యూలు జూలై 2014లో ముగిసింది.[12]

విడుదల[మార్చు]

చిత్ర ఆధికారిక ట్రైలర్ ఫిబ్రవరి 2015లో విడుదలైంది. సినిమా 09 సెప్టెంబరు 2015న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలచేయదలచారు.కాని విడుదల కాలేదు. సినిమా ఆడియోను ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణాలోనూ కూడా అక్కడి ముఖ్యమంత్రుల సమక్షంలో విడుదల చేయాలని ప్రణాళిక వేసుకున్నారు.  మూడు పాటలు విశాఖపట్టణంలోనూ, తర్వాతిరోజు మిగిలిన మూడుపాటలు వరంగల్లు లోనూ విడుదల చేశారు.[13] [14] చివరకు రుద్రమదేవి సినిమా 9 అక్టోబరు 2015 న విడుదల అయింది.(సాక్షి, తే. 9-10-2015).

సంగీతం[మార్చు]

పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇళయరాజా స్వరపరిచారు. సినిమా ఆడియోలో 6 పాటలు ఉండగా, 3 పాటలు ఉగాది నాడు విశాఖపట్టణంలోనూ, మిగిలిన మూడుపాటలు తర్వాతిరోజు వరంగల్లు లోనూ విడుదల చేశారు.[15] దక్కన్ మ్యూజిక్ రుద్రమదేవి పాటలను బెస్ట్ తెలుగు ఆల్బం ఆఫ్ మార్చి 2015గా గుర్తించింది.[16]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 "Anushka riding on Rs.50 crores business Entertainment". Timesofap.com. 2013-05-13. Retrieved 2014-05-31.
 2. 2.0 2.1 "'Rani Rudrama Devi' starring Anushka to be made with a huge budget". tamilstar.com. 2013-02-13. Retrieved 2015-02-06.
 3. "Gunasekhar's 'Rudrama Devi' to be best period drama so far". Sify. 7 November 2012. Retrieved 24 November 2012.
 4. "Rudhramadevi Movie Database". Film Dhamaka. 27 January 2015. Retrieved 27 January 2015.
 5. "Anushka to do a Tamil-Telugu period film?". Times of India. 6 October 2012. Retrieved 24 November 2012.
 6. "Rudramadevi Music". Raag. Retrieved 21 March 2015.
 7. "Anushka as a warrior princess". Deccan Chronicle. 4 October 2012. Retrieved 24 November 2012.
 8. "German technicians to work for Rudrama Devi". Times of India. Retrieved 29 November 2012.
 9. "Rudrama Devi’s release date confirmed as June 26"
 10. "Anushka - Guna Sekhar's Rudramadevi film launch". idlebrain.com. 14 February 2013. Retrieved 15 February 2013.
 11. Prasad Shiva (3 April 2013). "Baba Sehgal in Anushka's film". Retrieved 22 April 2013.
 12. Afrin Humayon (4 May 2013). "Vikramjeet Virk lands in T'wood". Retrieved 4 May 2013.
 13. http://www.telanganaroundup.net/rudhramadevi-mp3-songs-downloadlisten-online/
 14. http://www.iluvcinema.in/telugu/rudramadevi-official-trailer-crosses-million-hits-on-youtube/
 15. "Rudramadevi to release 3 of its songs on UGADI". Sakshi. Retrieved 21 March 2015.
 16. Best Telugu Songs and Albums of March 2015 Deccan Music - March 31, 2015