నిత్య మేనన్
నిత్య మేనన్ | |
---|---|
![]() | |
జననం | నిత్య మేనన్ 1988 ఏప్రిల్ 8 |
వృత్తి | నటి, గాయని |
క్రియాశీల సంవత్సరాలు | 2008–ఇప్పటివరకు |
నిత్యా మేనన్ ఒక భారతీయ సినీ నటి, గాయని. పలు విజయవంతమైన తెలుగు చిత్రాలతో బాటు కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు యాభై చిత్రాలకు పైగా నటించింది. ఈమె మూడు దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, రెండు నంది బహుమతులు అందుకుంది.
8 సంవత్సరాల వయసులో ద మంకీ హు న్యూ టూమచ్ (1998) అనే ఆంగ్ల చిత్రంలో బాలనటిగా నటించడం మొదలుపెట్టింది. 17 సంవత్సరాల వయసులో 2006 లో ఒక కన్నడ సినిమాలో సహాయ పాత్ర పోషించింది. తర్వాత ఆకాశ గోపురం అనే మలయాళ చిత్రంతో ప్రధాన పాత్రల్లో నటించే అవకాశాలు వచ్చాయి. తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించింది.
నేపథ్యం[మార్చు]
ఈమె 1988, ఏప్రిల్ 8 న బెంగుళూరులో స్థిరపడిన మలయాళ కుటుంబంలో జన్మించింది. మణిపాల్ విద్యాసంస్థలలో పాత్రికేయ విద్యను అభ్యసించింది. నటిని అవుతానని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. మంచి పాత్రికేయురాలు కావాలనుకునేది.[2][3] తర్వాతి కాలంలో ఆమెకు మళ్ళీ సినీరంగం మీద ఆసక్తి కలిగి పుణెలోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీ కోర్సులో చేరింది. అక్కడ ఆమెకు బి. వి. నందినీ రెడ్డి పరిచయం అయ్యి, ఆమెను నటనవైపు ప్రోత్సహించింది. తర్వాత ఆమె నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది సినిమాతో తెలుగులో కథానాయికగా పరిచయం అయింది. ఆమెకు వన్యప్రాణి ఫొటోగ్రఫీ అంటే కూడా ఆసక్తి.
నట జీవితము[మార్చు]
అలా మొదలైంది సినిమా ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. అంతకు మునుపే బాలనటిగా ఓ ఇంగ్లిష్ సినిమాలో టబుకు చెల్లిగా నటించింది. మోహన్‌లాల్‌తో కూడా ఒక సినిమాలో నటించింది. మాతృభాష మలయాళం. కానీ, వేరే భాషలు నేర్చుకోవాలన్న ఆసక్తి, ఇష్టం ఈమెకి కాస్త ఎక్కువే. అందుకే తొలిసినిమా అలా మొదలైందిలోనే నటనతో పాటు తన గాత్రాన్ని కూడా వినిపించింది. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే.., అబ్బబ్బో.. అబ్బో.. అంటూ పాడిన రెండు పాటలు విజయవంతం అయ్యాయి.
తెలుగు సినిమాలతో పాటు, అటు మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది నిత్య. అక్కడ కూడా పాటలు పాడుతూ ఒక పాటకు నృత్యదర్శకత్వం కూడా చేసింది. అలా మొదలైంది తర్వాత సెగ, 180 వంటి చిత్రాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద వూహించినంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ తర్వాత వచ్చిన ఇష్క్ మాత్రం మంచి హిట్‌గా నిలిచింది. మళ్లీ నితిన్‌తో జతకట్టిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ జంట విజయవంతమైన హిట్ పెయిర్ గా నిలిచింది. జబర్దస్త్, ఒక్కడినే చిత్రాల్లో నటనకుగాను మంచి మార్కులే సొంతం చేసుకుంది నిత్య. ఏమిటో ఈ మాయ, మాలిని 22 అనే తెలుగు చిత్రాలతో పాటు, రెండు తమిళ సినిమాల్లో కూడా నటించింది.
నటించిన చిత్రాలు[మార్చు]
తెలుగు[మార్చు]
- 2022 : తిరు
- 2021 : స్కైలాబ్
- 2021: సైకో
- 2021: నిన్నిలా నిన్నిలా
- 2019: ఎన్.టి.ఆర్. కథానాయకుడు
- 2018: గీత గోవిందం
- 2018: అ!
- 2016: జనతా గ్యారేజ్
- 2016: 100 డేస్ ఆఫ్ లవ్
- 2016: ఒక్క అమ్మాయి తప్ప
- 2016: ఇంకొక్కడు
- 2015: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
- 2015: కాంచన 2
- 2013: ఒక్కడినే
- 2013: జబర్దస్త్
- 2013: గుండెజారి గల్లంతయ్యిందే
- 2012: ఇష్క్ - ప్రియ
- 2011: అలా మొదలైంది ( తెలుగులో మొదటి సినిమా)
ఇతర భాషలు[మార్చు]
- 2015 - ఓ కాదల్ కణ్మణి (తమిళం) - తెలుగులో ఓకే బంగారంగా అనువాదమైనది.
- 2012 పాపిన్స్
- 2012 ఉస్తాద్ హోటల్ - షహానా \ జనతా హోటల్ తెలుగు (2018)
- 2012 డాక్టర్ ఇన్నొసెంటను - అన్నా
- 2012 కర్మయోగి
- 2012 తత్సమయం ఒరు పెంకుట్టి - మంజుల
- 2011 వెప్పం
- 2011 180
- 2011 ఉరుమి - చిరక్కల్ బాల
- 2011 వయోలిన్
- 2010 అపూర్వరాగం - నాన్సీ
- 2009 ఏంజిల్ జాన్
- 2009 కేరళ కేఫ్
- 2009 వెల్లతూవల్
- 2008 ఆకాశ గోపురం
వెబ్ సిరీస్[మార్చు]
పురస్కారాలు[మార్చు]
బయటి లంకెలు[మార్చు]

- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నిత్య మేనన్ పేజీ
మూలాలు[మార్చు]
- ↑ "Nithya Menon profile,photo gallery – South Indian Actresses". cinebasket. Archived from the original on 2011-09-27. Retrieved 2011-09-25.
- ↑ "'I love to do intelligent films like Kerala Cafe' – Rediff.com Movies". Movies.rediff.com. 2010-03-03. Retrieved 2011-04-07.
- ↑ "Nithya plays a journalist in next – Times Of India". Articles.timesofindia.indiatimes.com. 2011-04-03. Archived from the original on 2012-05-03. Retrieved 2011-04-07.