Jump to content

జనతా గ్యారేజ్

వికీపీడియా నుండి
జనతా గ్యారేజ్
దర్శకత్వంకొరటాల శివ[1]
రచనకొరటాల శివ
నిర్మాతయెర్నెని నవీన్
వై. రవి శంకర్
సి.వి. మొహన్
తారాగణంమోహన్ లాల్
జునియర్ ఎన్.టి.ఆర్
సమంత
ఉన్ని ముకుందన్‌
నిత్య మేనన్‌
ఛాయాగ్రహణంతిర్రు
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతందేవిశ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుఎరోస్ ఇంటర్‌నేషనల్
విడుదల తేదీ
1 సెప్టెంబరు 2016 (2016-09-01)
సినిమా నిడివి
162 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు
బడ్జెట్55 కొట్లు[2][3]
బాక్సాఫీసుest. 135 కోట్లు[4]

జనతా గ్యారేజ్ 2016 సెప్టెంబరు 1 న విడుదలైన తెలుగు చిత్రము.

సత్యం (మోహన్‌లాల్‌) ఓ మెకానిక్‌. తమ్ముడు (రెహమాన్‌)తో పాటు హైదరాబాద్‌లో ఓ గ్యారేజ్‌ నడుపుతుంటాడు. దాని పేరే '‘జనతా గ్యారేజ్‌ '. అక్కడికి సమస్య అంటూ ఎవరొచ్చినా దానికి పరిష్కారం చూపిస్తుంటారు. దాంతో సత్యంకి శత్రువులు పెరుగుతారు. వాళ్లు చేసిన దాడిలో తమ్ముడ్ని కోల్పోతాడు. తమ్ముడు కొడుకు ఆనంద్‌ (ఎన్టీఆర్‌)ని మాత్రం చిన్నప్పుడే ఈ జనతా గ్యారేజ్‌కి దూరంగా పెంచడానికి మేనమామ (సురేష్‌)కి ఇచ్చి ముంబై పంపించేస్తాడు. ఆనంద్‌కి అసలు తనకంటూ ఓ కుటుంబం ఉందని కూడా తెలియకుండా పెంచుతాడు మేనమామ. ఆనంద్‌కి ప్రకృతి అంటే ఇష్టం. చిన్న మొక్కకి హాని జరిగినా తట్టుకోలేడు. అందుకోసం ఎంతమందినైనా ఎదిరిస్తాడు. తనకీ ముంబైలో శత్రువులు పెరుగుతారు. కొన్ని కారణాల వల్ల ఆనంద్‌ తొలిసారి హైదరాబాద్‌ రావాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చాక సత్యంని కలుస్తాడు. దానికి కారణం ఏమిటి? సత్యం తన పెదనాన్న అని ఆనంద్‌కు తెలిసిందా? లేదా? జనతా గ్యారేజ్‌కి ఆనంద్‌ అవసరం ఏమొచ్చింది? ఇలాంటి విషయాలన్నీ కథలో కొనసాగుతాయి.

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగీత రచనArtist(s) నిడివి
1. "ప్రణామం"  రామజోగయ్య శాస్త్రిశంకర్ మహదేవన్ 04:00
2. "రాక్ ఆన్ బ్రో"  రామజోగయ్య శాస్త్రిరఘు దీక్షిత్ 04:08
3. "ఆపిల్ బ్యూటీ"  రామజోగయ్య శాస్త్రియజిన్ నిజర్ , నేహా భాసిన్ 03:52
4. "జయహో జనత"  రామజోగయ్య శాస్త్రిసుఖ్వీందర్ సింగ్ , విజయ్ ప్రకాష్ 04:18
5. "నీ సెల్వదిగి"  రామజోగయ్య శాస్త్రిశ్వేతా మోహన్ 01:38
6. "పక్కా లోకల్"  రామజోగయ్య శాస్త్రిగీతా మాధురి , సాగర్ 04:19
22:17

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

ఉత్తమ సహాయ నటుడు, మోహన్ లాల్, నంది పురస్కారం

సైమా అవార్డులు

[మార్చు]

2016 సైమా అవార్డులు

  1. ఉత్తమ నటుడు
  2. ఉత్తమ సంగీత దర్శకుడు
  3. ఉత్తమ గీత రచయిత (రామజోగయ్య శాస్త్రి - ప్రణామం)

మూలాలు

[మార్చు]
  1. "Koratala Siva's Remuneration for Jr NTR's film?". Chitramala. Archived from the original on 6 నవంబరు 2015. Retrieved 2 నవంబరు 2015.
  2. Hooli, Shekhar H (31 ఆగస్టు 2016). "'Janatha Garage' total pre-release business: Jr NTR-Mohanlal-Samantha beats 'Srimanthudu,' 'Nannaku Prematho' record". International Business Times. Retrieved 4 సెప్టెంబరు 2016.
  3. FE Online (2 సెప్టెంబరు 2016). "'Janatha Garage' box office collections: Jr. NTR, Mohanlal starrer rakes in Rs 210 crore on opening day". The Financial Express (India). Retrieved 4 సెప్టెంబరు 2016.
  4. "Janatha Garage 1st weekend box office collection: Jr NTR's film surpasses Rs 135 crore mark in 32 days". IBTimes. 3 అక్టోబరు 2016. Retrieved 7 అక్టోబరు 2016.

బయటి లెంకెలు

[మార్చు]