Jump to content

విదిశ శ్రీవాస్తవ

వికీపీడియా నుండి
విదిశ
జననం
విదిశ శ్రీవాస్తవ

(1991-04-28) 1991 ఏప్రిల్ 28 (వయసు: 35)[1]
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లువిదిశ
వృత్తినటి, ప్రచారకర్త
క్రియాశీలక సంవత్సరాలు2006–ప్రస్తుతం
బంధువులుశాన్వీ శ్రీవాస్తవ (చెల్లెలు)

విదిశగా పిలవబడే విదిశ శ్రీవాస్తవ ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె ఎక్కువగా తెలుగు చలన చిత్రాలలో నటించింది. ఈమె చెల్లెలు శాన్వీ శ్రీవాస్తవ కూడా నటే.

కెరియరు

[మార్చు]

విదిశ ఉత్తర ప్రదేశ్‌కు చెందినది. ఆమెకు ఒక అన్నయ్య, ఒక చెల్లి. ఈమె చెల్లెలు శాన్వీ శ్రీవాస్తవ కూడా నటే.[2] ఆమె బయోటెక్నాలజీలో పట్టభద్రురాలైనది, వ్యాపార నిర్వహణలో ఒక కోర్సు చేసింది.[3]

విదిషకు నటి కావాలని కొరిక, కానీ మొదట మోడలింగ్ చేయటం మొదలుపెట్టింది.[3] ఆమె 19 ఏళ్ళ వయస్సులో 2007లో విడుదలైన మా ఇద్దరి మధ్య అనే చిత్రంతో నటిగా పరిచయమైనది.[4][5] 2007 సంవత్సరంలో ఆమె మూడు చిత్రాలు అలా,ప్రేమ్‌, అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ విడుదలయ్యాయి. విటిలో అత్తిలి సత్తిబాబు ఎల్.కే.జి. విజయం సాదించింది.[6]

తరువాత ఆమె నలి నలియుతు అనే కన్నడ చిత్రంలో నటించింది. ఆమె నటించిన తొలి తమిళ చిత్రం కాత్తవరాయన్‌ 2008లో విడుదలైనది.[7][8] అలాగే ఆమె తొలి మళయాళ చిత్రం లక్కీ జొకర్స్ 2011లో విడుదలైనది.[9] ఆమె ఆ తరువాత శ్రీకాంత్ సరసన దేవరాయ చిత్రంలో నటించింది. ఆ తరువాత ఆమె కన్నడ చిత్రం విరాట్‌ లో నటించింది.[10]

ఆ తరువాత ఆమె జనతా గ్యారేజ్ లో చిన్న పాత్రలో నటించింది. ప్రస్తుతం ఆమె "యే హై మొహబత్తేన్" అనే హిందీ దారావాహికలో నటిస్తుంది.

అత్తిలి సత్తిబాబు

నటించిన చిత్రాలు

[మార్చు]
యే హై మొహబత్తేన్
సంవత్సరం చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
2007 మా ఇద్దరి మధ్య శివాని తెలుగు
2007 అలా తెలుగు
2007 ప్రేమ్ పవిత్రా తెలుగు
2007 అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ అమ్ములు తెలుగు
2007 నలి నలియతు జెన్నిఫర్ కన్నడ
2008 కాత్తవరాయన్‌ మలతి తమిళం
2011 లక్కీ జొకర్స్ లక్ష్మి తంపురత్తి మళయాళం
2012 దేవరాయ స్వప్నా తెలుగు
2016 విరాట్ స్పూర్తి కన్నడ
2016 జనతా గ్యారేజ్ రియా తెలుగు
2017-2018 యే హై మొహబత్తేన్ రొషిని హిందీ తొలి హిందీ దారావాహిక

మూలాలు

[మార్చు]
  1. "Stars : Star Interviews : Vidisha's personal side". Telugucinema.com. the original నుండి 22 ఫిబ్రవరి 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 ఫిబ్రవరి 2014.
  2. "Small town gal with big dreams | Deccan Chronicle". Archives.deccanchronicle.com. 16 అక్టోబరు 2013. the original నుండి 21 ఫిబ్రవరి 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 ఫిబ్రవరి 2014.
  3. 1 2 "Times of India Publications". Web.archive.org. 16 మే 2011. the original నుండి 16 ఫిబ్రవరి 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 మే 2018.
  4. "Telugu Movie Reviews - Maa Iddari Madhya". CineGoer.com. 8 సెప్టెంబరు 2006. the original నుండి 22 ఫిబ్రవరి 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 ఫిబ్రవరి 2014.
  5. "Maa Iddari Madhya Telugu Movie Review - cinema preview stills gallery trailer video clips showtimes". Indiaglitz.com. 8 సెప్టెంబరు 2006. the original నుండి 4 జనవరి 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 ఫిబ్రవరి 2014.
  6. "Box - Office Report 2007". TeluguCinema.Com. 25 డిసెంబరు 2007. the original నుండి 6 ఆగస్టు 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 ఫిబ్రవరి 2014.
  7. "Kathavaraayan, a mindless outing". Rediff.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 ఫిబ్రవరి 2014.
  8. "The K factor - Kaathavaraayan". The Hindu. 6 జూన్ 2008. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 ఫిబ్రవరి 2014.
  9. "Movie Review : Lucky Jokers". Sify.com. the original నుండి 7 ఏప్రిల్ 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 ఫిబ్రవరి 2014.
  10. "Viraat shooting from Feb 22". Sify.com. 22 ఫిబ్రవరి 2012. the original నుండి 8 ఏప్రిల్ 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 ఫిబ్రవరి 2014.

భాహ్యా లింకులు

[మార్చు]