మోహన్ లాల్
| మోహన్ లాల్ | |
Dr. మోహన్ లాల్ | |
| జన్మ నామం | మోహన్‌లాల్ విశ్వనాథన్ నాయర్ |
| జననం | 1960 మే 21 పట్టణమిట్ట, కేరళ, భారతదేశం |
| ఇతర పేర్లు | లాలేట్టన్, లాల్ |
| క్రియాశీలక సంవత్సరాలు | 1978 - నేటి వరకు |
| భార్య/భర్త | Suchitra (1988 - ప్రస్తుతం) |
| పిల్లలు | ప్రణవ్ విస్మయ మోహన్‌లాల్ |
మోహన్ లాల్ గా సుపరిచితుడైన మోహన్ లాల్ విశ్వనాథన్ నాయర్ (జననం 1960 మే 21)[1] మలయాళ సినిమాలో ఒక అగ్రనటుడు. నాలుగు సార్లు జాతీయ అవార్డు గ్రహీత. 2001లో పద్మశ్రీ పురస్కార గ్రహీత.[2][3]
మోహన్‌లాల్ 2025 నాటికీ మొత్తం 6 జాతీయ అవార్డులను అందుకున్నాడు. స్పెషల్ జ్యూరీ అవార్డుల విభాగాల్లో నాలుగు విభాగాల్లో అవార్డు, ఉత్తమ నటుడిగా రెండు అవార్డులతో పాటు, వానప్రస్థానం సినిమాకు నిర్మాతగా మరో అవార్డును దక్కించుకున్నాడు. కేరళ రాష్ట్ర అవార్డులు, ఫిలిం ఫేర్ అవార్డులు, సినీ రంగంలో చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్ దాదాసాహెబ్ ఫాల్కేఅవార్డులతో సత్కరించింది.


మోహన్ లాల్‌ను 2023 సంవత్సరానికి గానూ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి 2025 సెప్టెంబర్ 20న కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయగా,[4][5] సెప్టెంబర్ 23న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు.[6]
మోహన్‌లాల్ తన సేవా కార్యక్రమాలకు కూడా సుపరిచితులు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఆరోగ్యం, విద్యారంగాలలో అత్యంత ప్రభావవంతమైన, నిర్దిష్టమైన కార్యక్రమాలను అందించే లక్ష్యంతో ఆయన 'విశ్వశాంతి ఫౌండేషన్' అనే లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు.[7][8][9]
తెలుగు సినిమాలలో
[మార్చు]తెలుగులోకి అనువాదం అయిన సినిమాలు
[మార్చు]
- యోధ
- అభిమన్యు (1992)
- కాలాపానీ (1996)
- ఇద్దరు (1997)
- మన్యంపులి (2016)
- మనమంతా (2016)
- పులిజూదం (2019)
- మరక్కార్: అరేబియా సముద్ర సింహం (2021)
- మాన్స్టర్ (2022)
- జైలర్ (2023)
మలయాళం సినిమాలు
[మార్చు]- ట్వెల్త్ మ్యాన్
- ఒడియన్ (2018)
- నేరు (2024)
- మలైకోటై వాలిబన్ (2024)
ఇవి కూడ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-03-09. Retrieved 2009-06-14.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-05-28. Retrieved 2009-06-14.
- ↑ Eenadu (21 May 2021). "Mohanlal: సమ్మోహన నట శిఖరం - mohanlal birth day special story". www.eenadu.net. Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.
- ↑ "సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు." TV9 Telugu. 20 September 2025. Archived from the original on 20 September 2025. Retrieved 20 September 2025.
- ↑ "మోహన్‌లాల్ సమ్మోహన నట శిఖరం.. ఆ ఒక్క ఏడాది 36 సినిమాలు." Eenadu. 20 September 2025. Archived from the original on 20 September 2025. Retrieved 20 September 2025.
- ↑ "దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న మోహన్‌లాల్". Eenadu. 24 September 2025. Archived from the original on 24 September 2025. Retrieved 24 September 2025.
- ↑ Express News Service (26 April 2020). "Mohanlal donates robot for fighting Covid-19". The New Indian Express. Archived from the original on 21 July 2020. Retrieved 21 July 2020.
- ↑ "ViswaSanthi Foundation". www.viswasanthifoundation.com. Archived from the original on 16 July 2021. Retrieved 16 July 2021.
- ↑ "Mohanlal launches project to raise aid for children's heart surgeries". Mathrubhumi. 6 August 2019. Archived from the original on 21 July 2020. Retrieved 21 July 2020.
- ↑ Andhrajyothy (21 May 2021). "బర్త్‌డే స్పెషల్: మోహన్‌లాల్". www.andhrajyothy.com. Archived from the original on 26 మే 2021. Retrieved 26 May 2021.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Mohanlal పేజీ
- మోహన్ లాల్ అధికారిక వెబ్ సైటు Archived 2019-08-29 at the Wayback Machine