గాండీవము

వికీపీడియా నుండి
(గాండీవం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

గాండీవం ఒక దివ్యమైన ధనుస్సు. ఇది పాండవులలో అర్జునుని ముఖ్య ఆయుధము.

దీనిని బ్రహ్మ శతసహస్ర వర్షములును, ప్రజాపతి చతుష్షష్టి సహస్ర వర్షములును, ఇంద్రుడు పంచశత హాయనంబులును, వరుణుడు కొన్ని వందల సంవత్సరములు ధరించిరి. దీనిని వరుణుని వద్దనుండి అగ్ని దేవుడు పుచ్చుకొనెను. దీనిని ఖాండవ వనాన్ని దహించే సమయంలో అగ్ని అర్జునునకు యిచ్చెను.

"https://te.wikipedia.org/w/index.php?title=గాండీవము&oldid=311042" నుండి వెలికితీశారు