Jump to content

నేరు

వికీపీడియా నుండి
నేరు
దర్శకత్వంజీతూ జోసఫ్
రచన
నిర్మాతఆంటోనీ పెరుంబవూరు
తారాగణంమోహన్‌లాల్‌
ప్రియమణి
ఛాయాగ్రహణంసతీష్ కురుప్
కూర్పువిఎస్ వినాయక్
సంగీతంవిష్ణు శ్యామ్
నిర్మాణ
సంస్థ
ఆశీర్వాద్ సినిమాస్
పంపిణీదార్లు
  • ఆశీర్వాద్ సినిమాస్ (భారతదేశం)
  • ఫార్స్ ఫిల్మ్ కంపెనీ (ఓవర్సీస్)
విడుదల తేదీ
21 డిసెంబరు 2023 (2023-12-21)
సినిమా నిడివి
152 నిమిషాలు
దేశంభారతదేశం
భాషమలయాళం
బాక్సాఫీసు₹86 కోట్లు[1]

నేరు 2023లో విడుదలైన మలయాళం సినిమా. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూరు నిర్మించిన ఈ సినిమాకు జీతూ జోసఫ్ దర్శకత్వం వహించాడు. మోహన్‌లాల్‌, ప్రియమణి, శాంతి, జగదీశ్, గణేష్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మలయాళంలో 2023 డిసెంబర్ 21న విడుదల కాగా 2024 జనవరి 23 నుండి మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2][3]

సారా (అనాశ్వ‌ర రంజ‌న్‌) ప‌న్నెండేళ్ల వ‌య‌సులోనే కంటిచూపు కోల్పోయిన అంధురాలు. ఆమె తన తండ్రి ద్వారా బొమ్మ‌లు త‌యారు చేయ‌డం నేర్చుకుంటుంది. చేతుల ద్వారా మ‌నిషి ముఖ రూపురేఖ‌ల‌ను అంచ‌నా వేసి స‌రిగ్గా వారి బొమ్మ‌ను త‌యారు చేయ‌గ‌లిగే ప్ర‌తిభ సారాకు ఉంటుంది. ఓ రోజు సారా ఇంట్లో ఎవరు లేని సమయంలో మైఖేల్ (శంక‌ర్‌) ఆమెపై అత్యాచారం చేస్తాడు, కానీ సారా త‌యారు చేసిన బొమ్మ ద్వారా మైఖేల్ పోలీసుల‌కు దొరికిపోతాడు. మైఖేల్ తండ్రి పెద్ద బిజినెస్‌మెన్ కావ‌డంతో కొడుకును ఈ కేసు నుండి బ‌య‌ట‌ప‌డేసేందుకు సుప్రీంకోర్టు లాయ‌ర్ రాజ‌శేఖ‌ర్‌ను (సిద్ధిఖీ) రంగంలోకి దింపుతాడు.

రాజ‌శేఖ‌ర్‌కు భ‌య‌ప‌డి సారా త‌ర‌ఫున వాదించ‌డానికి లాయ‌ర్లు ఎవ‌రూ ముందుకు రారు. రాజ‌శేఖ‌ర్ కార‌ణంగా ఐదేళ్లు బార్ కౌన్సిల్ నుంచి స‌స్పెండ్ అయిన విజ‌య్ మోహ‌న్ (మోహ‌న్ లాల్‌) సారా త‌ర‌ఫున కోర్టులో వాదించ‌డానికి సిద్ధ‌మ‌వుతాడు. మైఖేల్ నిర్దోషి అని నిరూపించడానికి రాజ‌శేఖ‌ర్ ప‌లు అబ‌ద్ద‌పు సాక్ష్యాలు సృష్టించగా అత‌డు చెప్పిన‌వ‌న్నీ అబ‌ద్దాలు అని కోర్టులో విజ‌య్ మోహ‌న్ ప్రూవ్ చేశాడు? ఈ కేసు వాద‌న‌లో విజ‌య్ మోహ‌న్‌ ఎలాంటి స‌వాళ్ల‌ను ఎదుర్కొన్నాడు. విజ‌య్ మోహ‌న్‌ను బార్ కౌన్సిల్ నుంచి రాజ‌శేఖ‌ర్ ఎందుకు స‌స్పెండ్ చేయించాడు? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు

[మార్చు]
  • మోహన్‌లాల్‌ - అడ్వకేట్ విజయమోహన్ (స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్/ రాజశేఖరన్ మాజీ స్నేహితుడు)
  • అనశ్వర రాజన్ - సారా మొహమ్మద్ (ఒక అంధ శిల్పి)
  • ప్రియమణి - అడ్వకేట్ పూర్ణిమ (రాజశేఖర్ కూతురు/ విజయమోహన్ మాజీ ప్రియురాలు)
  • శాంతి మాయాదేవి - అహానా, న్యాయవాది (విజయమోహన్, జూనియర్)
  • సిద్దిక్ - అడ్వకేట్ రాజశేఖర్ (డిఫెన్స్ లాయర్/పూర్ణిమ తండ్రి)
  • మహమ్మద్ - జగదీష్ (సారా తండ్రి)
  • కె.బి. గణేష్ కుమార్ - సిఐ పాల్ వర్గీస్‌
  • శంకర్ ఇందుచూడన్ - మైఖేల్ జోసెఫ్
  • మాథ్యూ వర్గీస్ - న్యాయమూర్తి
  • హరిత జి. నాయర్ - అశ్వతి, న్యాయవాది (విజయమోహన్ జూనియర్)
  • శ్రీధన్య - పర్వీన్ (సారా తల్లి)
  • హరికృష్ణన్ - జయచంద్రన్ (మైఖేల్ స్నేహితుడు)
  • అదితి రవి -నిఖిల (జయచంద్రన్ భార్య)
  • నందు - పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ (అతిథి పాత్ర)
  • సబిట్టా జార్జ్ - ఆన్సి (మైఖేల్ తల్లి)
  • దినేష్ ప్రభాకర్ - రాబిన్‌
  • కృష్ణ ప్రభ - డాక్టర్‌
  • కాలేష్ రామానంద్ - వినోద్ (మైఖేల్ స్నేహితుడు)
  • పూజపురా రాధాకృష్ణన్ - ఆఫీసు గుమస్తా
  • ప్రశాంత్ నాయర్ - సీఐ మార్టిన్ జోసెఫ్
  • రమాదేవి
  • రెస్మి అనిల్ - సీమ (ఇంటి పనిమనిషి)
  • ఆంటోనీ పెరుంబవూరు
  • శాంతి ఆంటోని
  • కళాభవన్ జింటో
  • చెఫ్ పిళ్లై
  • రాజేష్ హెబ్బార్
  • అనూప్ అచ్యుతత్ ఉన్నికృష్ణన్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఆశీర్వాద్ సినిమాస్
  • నిర్మాత:ఆంటోనీ పెరుంబవూరు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:జీతూ జోసఫ్
  • సంగీతం: విష్ణు శ్యామ్
  • సినిమాటోగ్రఫీ: సతీష్ కురుప్

మూలాలు

[మార్చు]
  1. "'Neru' Box Office Collections: Mohanlal's Film Dominates Overseas". Times of India. 2024-01-18. Retrieved 2024-01-20.
  2. TV9 Telugu (23 January 2024). "ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. తెలుగులోనూ మోహన్‌ లాల్‌ మూవీ స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే?". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Eenadu (19 January 2024). "మలయాళ బ్లాక్‌బస్టర్‌ 'నేరు'.. ఓటీటీలో వచ్చేస్తోంది". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.
  4. The Hindu (21 December 2023). "'Neru' movie review: Jeethu Joseph and Mohanlal's courtroom drama almost delivers a cathartic high" (in Indian English). Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నేరు&oldid=4344592" నుండి వెలికితీశారు