హరిత జి. నాయర్
హరిత జి. నాయర్ | |
---|---|
జననం | |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2017–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | వి. ఎస్. వినాయక్ (m. 2023) |
హరిత జి. నాయర్ మలయాళం టెలివిజన్ రంగానికి చెందిన భారతీయ టెలివిజన్ నటి.
ఆసియానెట్ ఛానల్ లో 2017 నుండి 2020 వరకు ప్రసారమైన ధారావాహిక కస్తూరిమాన్ లో నటించిన ఆమె మంచి గుర్తింపును తెచ్చుకుంది.[1] అంతే కాకుండా, ఆమెకు బెస్ న్యూ ఫేస్ (ఫీమెల్) పురస్కారం కూడా ఆసియానెట్ టెలివిజన్ అవార్డ్స్లో ఆమె 2018లో అందుకుంది.[2]
ప్రారంభ జీవితం
[మార్చు]హరిత కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన ఆమె, నర్సుగా కెరీర్ ప్రారంభించింది. ఆమెకు హరీష్ అనే అన్నయ్య ఉన్నాడు.[3][4]
కెరీర్
[మార్చు]హరిత జి. నాయర్ 2018లో టాలెంట్ హంట్ షో థారోదయంలో ఫైనలిస్ట్‌గా నిలిచింది.[5] కస్తూరిమాన్ అనే సోప్ ఒపెరాలో శ్రీకుట్టి అనే సహాయ పాత్రతో ఆమె తన నటనా కెరీర్ అరంగేట్రం చేసింది.[6][7]
2019లో హర్రర్ డ్రామా ఉన్నిమాయలో ఆమె శివగంగ అనే అమ్మాయిగా నటించింది. 2020 నుండి 2022 వరకు, ఆమె తింకల్‌కళమాన్‌లో కీర్తి అనే ప్రధాన పాత్రను పోషించింది.[8]
ఆమె నటించిన నేరు చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ జరిగింది.[9][10]
2023 నుండి, ఆమె శ్యామంబరంలో శ్యామ అనే డస్కీ సింగర్‌గా ప్రధాన పాత్ర పోషిస్తోంది.[11]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె 2023 నవంబరు 10న ఫిల్మ్ ఎడిటర్ వి.ఎస్. వినాయక్‌ని వివాహం చేసుకుంది.[12]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | మూలాలు |
---|---|---|---|
2018 | కార్బన్ | లీనా మరియం జార్జ్ కొడప్పనకున్నెల్ | [13] |
2022 | ఒరు పక్కా నాదన్ ప్రేమమ్ | తులసి | [14] |
2023 | నేరు | న్యాయవాది అశ్వతి | [15] |
మూలాలు
[మార్చు]- ↑ "Kasthooriman completes one year; Haritha G Nair shares a heart-touching note". The Times of India. 13 December 2018. Retrieved 7 February 2022.
- ↑ "Asianet unveils winners of Asianet Television Awards 2018; to be aired on 24 & 25th Feb". Media News 4 U.
- ↑ "Haritha G Nair: Playing a possessed person lets me portray multiple shades at the same time". The Times of India. 30 October 2019. Retrieved 7 February 2022.
- ↑ "Nurse-turned-actress Haritha on nurses working during lockdown: Will we even consider these 'superheroes' after the pandemic?". The Times of India. 27 April 2020. Retrieved 21 June 2022.
- ↑ "Lesser known facts about 'Kasthooriman' actors that every fan must know". The Times of India. Retrieved 21 June 2022.
- ↑ "#10yearchallenge: Kasthooriman actress Haritha Nair opens up about her transformation". The Times of India. 21 January 2019. Retrieved 21 June 2022.
- ↑ Nair, Radhika (8 November 2018). "Just like Sreekutty, I am not that much 'Paavam' : Kasthooriman actress Haritha G Nair". The Times of India. Retrieved 21 June 2022.
- ↑ Nair, Radhika (14 December 2020). "Thinkalkalaman actress Haritha: I am living my dream life through Keerthi". The Times of India. Retrieved 21 June 2022.
- ↑ TV9 Telugu (23 January 2024). "ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ మోహన్ లాల్ మూవీ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (19 January 2024). "మలయాళ బ్లాక్‌బస్టర్ 'నేరు'.. ఓటీటీలో వచ్చేస్తోంది". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.
- ↑ "Shyamambaram to portray the life of a dusky-skinned singer". The Times of India. ISSN 0971-8257. Retrieved 27 March 2023.
- ↑ "Malayalam actress Haritha G Nair ties the knot with editor Vinayak VS; PICS". Pinkvilla (in ఇంగ్లీష్). 9 November 2023. Archived from the original on 16 జనవరి 2024. Retrieved 16 January 2024.
- ↑ "Kastooriman fame Haritha G Nair is elated to team up with Sharafudheen". The Times of India. 20 January 2020. Retrieved 7 February 2022.
- ↑ "'ഒരു പക്കാ നാടൻ പ്രേമത്തി'ലെ ഗാനങ്ങൾ പുറത്തിറക്കി". Mathrubhumi (in మలయాళం). 20 February 2020.
- ↑ "Vijayakumar's junior in 'Neru', Haritha G Nair expresses gratitude for sharing the screen with Mohanlal". The Times of India. 3 January 2024. Retrieved 16 January 2024.