సిద్ధిక్ (నటుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిద్ధిక్
జననం (1962-10-01) 1962 అక్టోబరు 1 (వయసు 62)
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
సినిమా నిర్మాత
సినిమా దర్శకుడు
వ్యాపారవేత్త
క్రియాశీల సంవత్సరాలు1985–ప్రస్తుతం

సిద్ధిక్ (జననం 1962 అక్టోబరు 1) భారతీయ సినిమా నటుడు, నిర్మాత. ఆయన ప్రధానంగా మలయాళ సినిమా రంగానికి చెందినవాడు. అయితే 350కి పైగా మలయాళ చిత్రాల్లో నటించిన ఆయన తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాలలో కూడా నటించాడు. ఆయన హాస్య పాత్రలు, రొమాంటిక్ లీడ్‌లు, యాంటీ-హీరోలు, విలన్‌లతో సహా అనేక రకాల పాత్రలు పోషించినందుకు ప్రసిద్ధి చెందాడు.[1][2][3]

ఆ నేరం అల్ప దూరం (1985) చిత్రంతో ఆయన నటనా రంగ ప్రవేశం చేశాడు. ఇన్ హరిహర్ నగర్ (1990) అనే కామెడీ చిత్రంతో అతనికి మంచి గుర్తింపు లభించింది. దాని విజయం కారణంగా, అతను 1990ల ప్రారంభంలో గాడ్ ఫాదర్, మాంత్రికచెప్పు, సింహవలన్ మీనన్, కాసర్‌గోడ్ ఖాదర్‌భాయ్, తిరుతల్వాడి, ముఘముద్ర, కునుక్కిట్ట కోజి, వెల్‌కమ్ టు కొడైకెనాల్ వంటి చిత్రాలలో విభిన్న హాస్య పాత్రలలో నటించాడు. అసురవంశం, లేలం, హే జూడ్ (2018) చిత్రాలతో మరింత సీరియస్ పాత్రల వైపు మొగ్గు చూపాడు ఆయన. అతను సత్యమేవ జయతే (2001)లో కూడా చెప్పుకోదగ్గ విలన్ పాత్రను చేసాడు, ఇది ప్రతినాయకుల పాత్రల పరంపరకు దారితీసింది.

2004లో, ఆయన సస్నేహం సుమిత్ర, చూండాలలో తన నటనకు ఉత్తమ సహాయ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నాడు.[4] ఆయన భావన సినిమా సంస్థను స్థాపించి నందనం (2002) చిత్రానికి సహ-నిర్మాతగా వ్యవహరించడం ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. 2013లో నా బంగారు తల్లి చిత్రానికి గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నాడు.[5]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయన 1959 అక్టోబరు 1న కేరళలోని ఎర్నాకులంలో ఎడవనక్కడ్ లో జన్మించాడు.[6] ఒక అన్నయ్య, ఒక అక్క ఉన్నారు. అతని అన్నయ్య అబ్దుల్ మజీద్ కూడా మలయాళ సినిమా నటుడు.[7]

సిద్ధిక్ తన ప్రాథమిక పాఠశాల విద్యను స్వగ్రామంలో చదివాడు. ఆ తరువాత కలమస్సేరిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశాడు.

ఆ తర్వాత కేరళలోని త్రిసూర్‌లోని కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ డివిజన్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేశాడు. కెఎస్‌ఇబిలో కొన్నేళ్లపాటు సేవలందించిన ఆయన విదేశాలకు వెళ్లి సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లి అక్కడ కొన్నాళ్లు పనిచేశాడు.

మూలాలు

[మార్చు]
  1. "Doting dad to fake intellectual artist: 11 times Siddik 's versatility impressed us". The News Minute (in ఇంగ్లీష్). 2019-05-12. Retrieved 2021-06-13.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. Madhu, Vignesh (2016-12-02). "Siddik -The versatile actor of Malayalam Cinema". onlookersmedia (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-13.
  3. Staff Reporter (2019-11-06). "Dream come true for Siddik !". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-06-13.
  4. "Manorama Online | Women | Work & Life |". www.manoramaonline.com. Archived from the original on 2014-07-26.
  5. "Nandi Awards 2012 and 2013: Rajamouli, Ilayaraja, Samantha and Prabhas emerge winners". 1 March 2017.
  6. Age of Siddique
  7. "Nandanam, the abode of ornamental plants". Mathrubhumi (in ఇంగ్లీష్). Archived from the original on 2021-05-25. Retrieved 2021-05-25.