నా బంగారు తల్లి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నా బంగారు తల్లి
(2014 తెలుగు సినిమా)
Poster na bangaru talli.jpg
దర్శకత్వం రాజేశ్ టచ్‌రివర్
నిర్మాణం సునీతా కృష్ణన్
ఎం.ఎస్.రాజెష్
కథ సునీతా కృష్ణన్
చిత్రానువాదం రాజేశ్ టచ్‌రివర్
అనంతరామ్ (సంభాషణలు)
గార్లపాటి వెంకట్ రఘు(పాటలు)
తారాగణం అంజలీ పాటిల్‌,
సిద్దిక్
సంగీతం శరత్
నేపథ్య సంగీతం :
శంతను మొయిత్ర
ఛాయాగ్రహణం రామ తులసి
కూర్పు డాన్ మాక్స్
భాష తెలుగు

నా బంగారు తల్లి వేశ్యావృత్తి కథాంశంగా రూపొందిన తెలుగు చిత్రం. 'ఇన్ ద నేమ్ ఆఫ్ బుద్ధా' సినిమాతో అంతర్జాతీయంగా మంచి గుర్తింపు లభించిన దర్శకుడు రాజేశ్ టచ్‌రివర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రజ్వల సంస్థ నిర్వాహకురాలిగా పరిచయమున్న సునీతా కృష్ణన్ ఈ సినిమా నిర్మాత. ఈ సినిమాను తెలుగుతో పాటుగా మలయాళంలో ఎంతె అనే పేరుతో ఒకే సారి నిర్మించారు. ఈ సినిమా విడుదలకంటే ముందే జాతీయ స్థాయిలో మూడు అవార్డులను గెలుచుకుంది. అలాగే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలోనూ ప్రశంసలు పొందింది.

నటీనటులు[మార్చు]

 • అంజలీ పాటిల్ - దుర్గ
 • సిద్ధిక్ - శ్రీనివాస్
 • నీనా కురుప్ - దుర్గ తల్లి
 • రత్నశేఖర్ రెడ్డి - దుర్గకు కాబోయే వరుడు
 • అనూప్ అరవిందన్
 • వారెన్ జోసెఫ్
 • సునీల్ కుడ్వత్తూర్

సాంకేతిక వర్గం[మార్చు]

 • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజేష్ టచ్‌రివర్
 • కథ: సునీతా కృష్ణన్
 • మాటలు: అనంత్‌రాం
 • పాటలు: గార్లపాటి వెంకట్ రఘు
 • సంగీతం: శరత్ & శంతను మొయిత్ర
 • ఛాయాగ్రహణం: రామ తులసి
 • కూర్పు: డాన్ మాక్స్

కథాంశం[మార్చు]

అభంశుభం తెలియని ఎంతో మంది యువతులు లైంగిక వేధింపులకు గురవుతూ నరకప్రాయంగా జీవితాన్ని సాగిస్తున్నారు. ఇలాంటి ఓ స్త్రీ జీవితగాథే "నా బంగారు తల్లి".

కథ అమలాపురంలో మొదలవుతుంది. శ్రీనివాస్‌ సమాజ సేవకుడు. అతని ఒక్కగానొక్కొ కూతురు దుర్గ (అంజలీ పాటిల్) తెలివైన విద్యార్థిని. ఇంటర్‌లో పాఠశాల ఫస్ట్ రావడమే కాదు, ఆ జిల్లాలోనే ఎనిమిదవ ర్యాంక్ సంపాదించుకుంటుంది. అయితే ఆ ఘనత మొత్తం తన తండ్రి శ్రీనివాస్ (సిద్ధిక్)కే దక్కుతుందని, తనతో పాటు ఆయన్నీ సత్కరించమని పాఠశాల యాజమాన్యాన్ని కోరుతుంది. తమ ఊరిలో కాకుండా హైదరాబాద్ వెళ్ళి డిగ్రీ చదవాలన్నది దుర్గ కోరిక. కానీ తండ్రి మాత్రం తమని వదిలి దూరంగా ఉండొద్దని చెబుతుంటాడు. తన కళ్ళముందు ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా సహించలేని మనస్తత్వం దుర్గది. తండ్రి తరహాలోనే ఈ అమ్మాయి కూడా సమాజాన్ని ఉద్ధరిస్తోందంటూ ఊరి వాళ్ళు ఎగతాళి చేస్తుంటారు. అయినా ఆ మాటలను పట్టించుకోకుండా తన దారిన తాను ముందుకు పోతూ ఉంటుంది దుర్గ. తన స్నేహితురాలి పెళ్ళిలోనే దుర్గ మనసుకు నచ్చని వ్యక్తి తారసపడతాడు. పెద్దల అంగీకారంతో విజయ్ (రత్నశేఖర్)తో నిశ్చితార్థం కూడా జరుగుతుంది. అదే సమయంలో హైదరాబాదులో డిగ్రీ చదవడానికి దుర్గకు అవకాశం లభిస్తుంది. తండ్రి అప్పటికే హైదరాబాదులో ఉండటంతో తల్లిని ఒప్పించి నగరానికి ఒంటరిగా బయలుదేరుతుంది. అయితే నగరం చేరిన దుర్గ జీవితంలో ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి, ఈ చదువుల తల్లి ఎలాంటి ఇబ్బందుల్ని, అనూహ్య సంఘటనలను ఎదుర్కొందన్నది మిగతా కథ[1].

అవార్డులు[మార్చు]

ఈ సినిమాకు విడుదలకు ముందే దేశ విదేశాలలో అనేక బహుమతులు లభించాయి. 2013లో డెట్రాయిట్‌లో జరిగిన ట్రినిటీ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ చలనచిత్రంగా ఎంపికయింది[2]. 23 సంవత్సరాల తర్వాత ఈ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి తెలుగు సినిమా ఇది. అదే యేడాది జరిగిన ఇండొనేషియన్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ సినిమాకు అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్, బెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్, బెస్ట్ ఫిల్మ్‌మేకర్ ఆఫ్ ది ఇయర్, బెస్ట్ ఫిల్మ్‌ ఆఫ్ ది ఫెస్టివల్ విభాగాలలో నాలుగు అవార్డులు లభించాయి. అంతే కాక 2014లో బీజింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్, మైర్టల్ బీచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్, ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్, ఇండియన్ ఫిల్మ్‌ ఫెస్టిఫల్ ఆఫ్ ఐర్లాండ్, 20వ కోల్‌కాతా ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లలో ప్రదర్శనకు అధికారికంగా ఎంపికయ్యింది.

ఇక 61వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమాగా అవార్డును గెలుచుకుంది[3]. అంతే కాకుండా ఈ పురస్కారాలలో ఈ చిత్ర సంగీత దర్శకుడు శంతను మొయిత్రకు ఉత్తమ సంగీత దర్శకుడు, నటి అంజలి పాటిల్‌కు ప్రత్యేక ప్రశంస పురస్కారాలు లభించాయి.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2013లో ప్రకటించిన నంది పురస్కారాలలో ఈ చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా రజత నందిని గెలుచుకుంది. ఇదే పురస్కారాలలో ఉత్తమ నటిగా అంజలీ పాటిల్‌కు అవార్డు లభించగా సిద్ధిక్‌కు ప్రత్యేక జ్యూరీ పురస్కారం లభించింది[4].

ఇతర విశేషాలు[మార్చు]

 • ఈ చిత్ర దర్శకుడు రాజేశ్ టచ్ రివర్ ఇన్ ద నేమ్ ఆఫ్ బుద్ధా దర్శకుడుగా ప్రఖ్యాతి గడించాడు.
 • నిజ జీవితంలో వ్యభిచార కూపంలోకి బలవంతంగా వెళ్లి, బయటకు వచ్చిన అమ్మాయిల అనుభవాలనే తీసుకొని ఓ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దిన చిత్రం నా బంగారు తల్లి
 • ప్రజ్వల’ సంస్థ ఫౌండర్ సునీతా‌ కృష్ణన్ చెప్పిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా తీయబడిన చిత్రం
 • ఈ చిత్ర నిర్మాత అయిన సునీతా కృష్ణన్ ఇప్పటికే 1200మంది యువతులను వ్యభిచార గృహం నుంచి విముక్తి కల్పించింది
 • ప్రఖ్యాత గాయని శ్రేయా ఘోషల్‌ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇందులో పాటలు పాడారు
 • చిత్రం పూర్తి అయినా విడుదలకు నిదుల కొరత వలన అమల అక్కినేని సలహాతో జనం నుంచి విరాళాలు సేకరించారు
 • త్రీ ఇడియట్స్ సంగీత దర్శకుడు శంతనుమొయిత్రే ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. త్రీఇడియట్స్, నా బంగారు తల్లి ఆడియో వేడుకలు ఒకే రోజు జరిగినా, శంతను మొయిత్రే నా బంగారుతల్లి ఆడియో వేడుకకే ప్రాధాన్యత ఇచ్చారు.

మూలాలు[మార్చు]

 1. సమీక్షకుడు (21 November 2014). "నా బంగారు తల్లి రివ్యూ!". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Retrieved 8 May 2018.
 2. International Recognition for a Telugu film!
 3. [61వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు
 4. 2012, 2013 నంది పురస్కారాలు

బయటి లింకులు[మార్చు]

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా | ఉత్తమ నటుడు | ఉత్తమ నటి | ఉత్తమ సహాయ నటుడు | ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు | ఉత్తమ బాల నటుడు | ఉత్తమ ఛాయా గ్రహకుడు | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | ఉత్తమ దర్శకుడు | ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు | ఉత్తమ గీత రచయిత | ఉత్తమ సంగీత దర్శకుడు | ఉత్తమ నేపథ్య గాయకుడు | ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం | ఉత్తమ కూర్పు | ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్ | ఉత్తమ బాలల సినిమా | ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం | ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా | ఉత్తమ బెంగాలీ సినిమా | ఉత్తమ ఆంగ్ల సినిమా | ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా | ఉత్తమ మళయాల సినిమా | ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా | ఉత్తమ పంజాబీ సినిమా | ఉత్తమ కొంకణి సినిమా | ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా | ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం