Coordinates: 42°19′53.76″N 83°2′51″W / 42.3316000°N 83.04750°W / 42.3316000; -83.04750

డెట్రాయిట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డెట్రాయిట్ నగరం
Flag of డెట్రాయిట్ నగరం
Flag
Official seal of డెట్రాయిట్ నగరం
Seal
ముద్దు పేరు: The Motor City, Motown, Hockeytown, Rock City, The D
నినాదం: "Speramus Meliora; Resurget Cineribus"
(Latin for, "We Hope For Better Things; It Shall Rise From the Ashes")
Location in Wayne County, Michigan
Location in Wayne County, Michigan
Location in Wayne County, Michigan
అక్షాంశరేఖాంశాలు: 42°19′53.76″N 83°2′51″W / 42.3316000°N 83.04750°W / 42.3316000; -83.04750
Country United States
State Michigan
County Wayne
Founded 1701
Incorporation 1806
ప్రభుత్వం
 - Type Mayor-Council
 - Mayor Kenneth Cockrel Jr.
 - City Council
వైశాల్యము
 - City 143.0 sq mi (370.2 km²)
 - భూమి 138.8 sq mi (359.4 km²)
 - నీరు 4.2 sq mi (10.8 km²)
 - పట్టణ 1,295 sq mi (3,354 km²)
 - మెట్రో 3,913 sq mi (10,135 km²)
ఎత్తు [1] 600 ft (183 m)
జనాభా (2007)[2]
 - City 9,16,952
 - సాంద్రత 6,856/sq mi (2,647/km2)
 - పట్టణ 39,03,377
 - మెట్రో 44,67,592
 - CSA 5,405,918
కాలాంశం EST (UTC-5)
 - Summer (DST) EDT (UTC-4)
Area code(s) 313
FIPS code 26-22000[3]
GNIS feature ID 1617959[4]
వెబ్‌సైటు: detroitmi.gov

డెట్రాయిట్ అమెరికాలోని మిషిగాన్ రాష్ట్రంలోని పెద్ద నగరం. అమెరికాలోని మిడ్‌వెస్ట్ ప్రాంతంలో డెట్రాయిట్ నగరం డెట్రాయిట్ నదిపైన ఉన్న ముఖ్యరేవు పట్టణం. కెనడా దక్షిణప్రాంతంలో ఉన్న అమెరికా నగరాలలో డెట్రాయిట్ ఒక్కటీ గుర్తించ తగినంత పెద్ద నగరం. 1701లో ఫ్రెంచ్‌ దేశస్తుడైన ఫ్రెంచ్‌ మాన్ ఆంటోనీ డీ లా మోత్ కాడిలాక్చే స్థాపించబడింది.

డెట్రాయిట్ నగరం అమెరికాలోని సంప్రదాయక ఆటోమోటివ్ కేంద్రం. మోటర్ సిటీ, మోటోటౌన్ డెట్రాయిట్ నగరానికున్న అతి ముఖ్యమైన మారు పేర్లు. 2007లో డెట్రాయిట్ నగరం జనసాంద్రతలో 916,952 మంది నివాసితులతో పదకొండవ స్థానంలో ఉంది. 1.8 మిలియన్ల జనాభాతో డెట్రాయిట్ నగరం అమెరికాలో నాల్గవ స్థానంలో ఉండేది ఆతరువాత నగర ప్రధాన జనవాహిని నగర పురాలను దాటి విస్తరించింది.

డెట్రాయిట్ అనే పేరు కొన్నిసార్లు డెట్రాయిట్ మహానగరానికి వర్తిస్తుంది. 2007 సెన్సస్ బ్యూరో అంచనాల ప్రకారం తొమ్మిది కౌంటీలతో కలసి 5,405,918 జనసంఖ్య కలిగిన మహానగరం అమెరికాలో పదకొండవ స్థానంలో ఉంది. 57,00,000 జనాభా కలిగిన డెట్రాయిట్-విండ్సర్ ప్రదేశం అమెరికా కెనడా దేశాలమధ్య ఉన్న కీలక వాణిజ్య కేంద్రం.

చరిత్ర[మార్చు]

డెట్రాయిట్ నగరానికి ఈ పేరు డెట్రాయిట్ నది కారణంగా వచ్చింది. ఈ నగరం డెట్రాయిట్ నదీతీరంలో స్థాపించబడి విస్తరించింది. డెట్రాయిట్ నదిపై లీ గ్రిఫిన్ నౌకలో ఫాదర్ హెన్నెపిన్ నదికి ఉత్తర తీరాన ఉన్న ఈ ప్రాంతం ఒప్పందం మూలంగా అభివృద్ధిపరచడానికి అనుకూలమైనదిగా భావించాడు. 1701లో ఆంటోనీ డీ లా మోత్ కాడిలాక్ 51 మంది కెనడా దేశానికి చెందిన ఫ్రెంచ్ దేశస్థులను వెంట పెట్టుకుని పోర్ట్ పంచార్‌ట్రెయిన్ డ్యూ డెట్రాయిట్ పేరుతో ఒప్పందం కుదుర్చుకొని డెట్రాయిట్ నగరానికి పునాది వేశాడు. ఈ ఒప్పందం తరువాతి కాలంలో కోమ్ట్ డీ పంచార్‌ట్రియన్ గా నామాంతరం చెందింది. నౌకాదళ మంత్రి 14వ లూయిస్ నాయకత్వంలో ఫ్రెంచ్ దేశస్థులు డెట్రాయిట్‌లో ఉచితంగా స్థలంకేటాయించి ప్రజలను డెట్రాయిట్ వైపు ఆకర్షించారు. ఈ కారణంగా ఇక్కడి జనసంఖ్య 800 నుండి 1765 కు అభివృద్ధి చెందింది. ఫ్రాంకోయిస్ మారీ పికోట్,సియూర్ డీ బెలెస్ట్రే ఫోర్ట్ డెట్రాయిట్ యొక్క ఆఖరి సైకాధికారి (మిలటరీ కమాండర్) (1758-1760)1760 నవంబరు 29న ఈ ప్రాంతాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వానికి అప్పగించాడు.

Ste. Anne de Détroit, founded in 1701, is the second oldest continuously operating Roman Catholic parish in the United States. The present church was completed in 1887.[5]

ఫ్రెంచ్, ఇండియన్ యుద్ధసమయంలో (1760) బ్రిటిష్ సైన్యం ఈ నగరాన్ని స్వాధీన పరచుకుని దీనికి డెట్రాయిట్ నామాన్ని ధ్రువీకరించారు. పలు ఓత్వా నాయకుడు చీఫ్ పోంటియాక్ నాయకత్వంలో పోంటియాక్ రిబెల్లియన్ రూపుదిద్దుకుని సైజ్ ఆఫ్ ఫోర్ట్ డేట్రాయిట్ పేరుతో జరిగిన దాడి అనంతరం అనధికారిక ఇండియన్ భూమి మీద అంక్షలతో చేర్చి రాయల్ ప్రొక్లెమేషన్ 1963గా ప్రకటన వెలువడింది. జయ్ ట్రీటీ (1796)పేరుతో జరిగిన ఒప్పందం మూలంగా డెట్రాయిట్ అమెరికా ప్రభుత్వ వశమైంది. ఈ ఒప్పందం ద్వారా పొందిన డెట్రాయిట్ నగరం దాదాపు నగరమంతా మంటలపాలైంది. నదీతీరంలో ఉన్న గోడౌన్ ఒకటి చెక్క ఇళ్ళ ఇటుకల చిమ్నీలు మాత్రమే అవశేషాలలా మిగిలిన నిర్మాణాలు.

డెట్రాయిట్ 1805నుండి 1847 డెట్రాయిట్ మిషిగాన్ రాష్ట్ర రాజధానిగా ఉంది. అగస్టస్ బి వుడ్‌వార్డ్ రూపకల్పనలో నగరాభివృద్ధి జరిగింది. వా ఆఫ్ 1812 సమయంలో డెట్రాయిట్ తిరిగి బ్రిటిష్ సైన్యం వశమైంది. ఈ ఆక్రమణకు సయిజ్ జ్ ఆఫ్ డెట్రాయిట్ అని నామకరణం చేశారు. 1813 నాటికంతా డెట్రాయిట్ నగరాన్ని తిరిగి అమెరికా ప్రభుత్వం స్వాధీనపరచుకుని 1815 నాటికి అమెరికా ప్రభుత్వం కార్పొరేషన్‌గా చేసి నగర హోదాను ఇచ్చింది. వ్యూహాత్మకంగా గ్రేట్ లేక్స్ జలమార్గం వెంట ఉండటం మరొక ప్రత్యేకత. డెట్రాయిట్ నగరం ప్రముఖ రవాణా కేంద్రంగా రూపుదాల్చింది.

సివిల్ వార్‌కు ముందు కెనడా సరిహద్దులను చేరటానికి డెట్రాయిట్ నగర భూగర్భ రైలు మార్గం ప్రధాన కేంద్రం. ఆ సమయంలో లెఫ్టినెంట్ ఉలిసెస్ ఎస్ గ్రాంట్ ఈ నగరంలో నివసించాడు. ఆ తరువాతి కాలంలో ఆయన అమెరికాదేశ ప్రెసిడేంట్ హోదాకు చేరుకున్నాడు. ఆయన నివసించిన ఇల్లు ఇంకా ఈ నగరంలో మిచిగాన్ రాష్ట్రం ఫైర్ గ్రౌండ్స్‌లో ఉంది. ఈ అనుబంధం కారణంగా సివిల్ వార్ సమయంలో అనేక డెట్రాయిట్ నగరవాసులు స్వచ్ఛందంగా సైన్యంలో చేరి యుద్ధంలో పాల్గొన్నారు. సివిల్ వార్ ప్రారంభంలో ఐరన్ బ్రిగేడ్ పేరుతో వాషింగ్టన్ డి.సిని రక్షించారు. అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ప్రత్యేకంగా మిషిగాన్ రాష్ట్రానికి కృతజ్ఞతలు చెప్పటం ఈ రాష్ట్రవాసులకు గర్వకారణం. అబ్రహాం లింకన్ మరణానంతరం మార్టియస్ పార్క్ ఆవరణలో అక్కడకు చేరిన వేలకొలది శ్రోతల సమీపంలో జార్జ్ ఆర్మ్ స్ట్రాంగ్ కస్టర్ అంజలి ఘటించాడు. వాల్వరిన్స్‌ పేరుతో పిలువబడిన మిషిగాన్ బ్రిగేడ్‌కు కస్టర్ నాయకత్వం వహించాడు.ఆతరువాత వీరిని వాల్వరిన్స్ అని పిలిచేవారు.

1800 ఆఖరి కాలం 1900 ఆరంభకాలంలో గిల్డెడ్ ఏజ్ మాన్‌షన్స్ (పురుషుల వసతి గృహాలు), భవనాలు రూపుదిద్దుకున్నాయి. పడమటి తీర పారిస్‌గా డెట్రాయిట్ నగరం నిర్మాణ సౌందర్యం, సరికొత్తగా థామస్ ఆల్వా ఎడిసన్ ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలంకరణ చేయబడిన వాషింగ్టన్ వ్యూహాత్మకంగా గ్రేట్ లేక్స్ తీరంలో నిర్మించిన వాషింగ్టన్ డి.సి బౌల్‌వర్డ్ ప్రత్యేకత సాధించింది.1830 నుండి నౌకలు, నౌకానిర్మాణం అభివృద్ధి చెందడంతో డెట్రాయిట్ నగరం స్థిరంగా అభివృద్ధి చెందుతూ ఉంది. నగరంలో నూతనంగా కర్మాగారాలు స్థాపించడం అభివృద్ధికి మరొక కారణం. 1896లో అత్యధికంగా అభివృద్ధి చెందిన హెన్రీ ఫోర్డ్ వాహన వాణిజ్యం ఇచ్చిన ప్రేరణతో ఒక మ్యాక్‌ అవెన్యూలోఅద్దెకు తీసుకున్న ప్రదేశంలో ఆటోమొబైల్ (వాహన) కర్మాగారం ప్రారంభించాడు. 1904లో హెన్రీ ఫోర్డ్ ఈ నగరంలో ఫోర్డ్ మోటర్ కంపెనీని స్థాపించాడు. అలాగే విలియమ్ సి డ్యురాంట్ స్థాపించిన జెనరల్ మోటర్ కంపెనీ, చెవర్లెట్ కంపెనీ,ది డాడ్జి బ్రదర్స్, పాకర్డ్, వాల్టర్ క్రిస్లర్‌లు డెట్రాయిట్ నగరాన్ని ఆటోమొబైల్ రాజధానిగా మార్చారు.అలాగే గార్బోస్కై, రాపిడ్‌ల ట్రక్ తయారీ కంపెనీల స్థాపనకు ప్రేరణ కలిగించింది.

మద్యపాన నిషేధం అమలులో ఉన్న కాలంలో అక్రమ రవాణాదారులు ఈ నదిని ముఖ్యమార్గంగా ఉపయోగించుకున్నారు. అప్రతిష్ఠాకరమైన కెనెడియన్లు అధికంగా కలిగిన పర్పుల్ గ్యాంగ్ రూపుదిద్దుకుని వారు సాగించిన అక్రమ కార్యకలాపాలు చరిత్రలో బాధాకరమైన గుర్తులుగా మిగిలాయి. లో యునైటెడ్ ఆటో వర్కర్స్ డెట్రాయిట్ ఆటో తయారీదారుల మధ్య చెలరేగిన వివాదాలనంతరం లేబర్ సమస్యలు 1930 నాటికి ముగింపుకు వచ్చాయి. ఆ సమయంలో చెలరేగిన లేబర్ సమ్మె కార్యకలాపాలు యూనియన్ లీడర్లైన జిమ్మీ హోఫా, వాల్టర్ ర్యూథర్ లకు కొంత అపకీర్తిని తెచ్చాయి. 1940లో నగరంలో ప్రపంచంలోని మొదటి ఫ్రీవే (రహదారి)ది డేవిషన్నిర్మాణం జరిగింది.డెట్రాయిట్ నగరంలో రెండవ ప్రపంచయుద్ధ సమయంలో జరిగిన పారిశ్రామికాభివృద్ధితో నగరానికి ఆర్సనల్ ఆఫ్ డెమాక్రసీ అనే మరొక మారు పేరు రావడానికి కారణం అయింది.

Looking South down Woodward Avenue, with the Detroit skyline in the distance, July 1942

20వ శతాబ్ధపు మొదటి సగభాగంలో నగరంలో విస్తరించిన పరిశ్రమల కారణంగా డెట్రాయిట్ నగరానికి వచ్చి అనేక వేలమంది వచ్చి స్థిరపడసాగారు. వీరిలో ప్రత్యేకంగా దక్షిణామెరికా కార్మికులు ఉన్నారు. ఆ కారణంగా ఆసమయంలో డెట్రాయిట్ అమెరికాలో నాలగవ పెద్ద నగరంగా గుర్తించబడింది. అదేసమయంలో అనేక వేల యురోపియన్లు డెట్రాయిట్ నగరానికి ప్రవాహంలా వచ్చి చేరారు. ఈ అసాధారణ అభివృద్ధి కొంత సాంఘిక ఉద్రిక్తలకు దారి తీసాయి. 1950 నాటికి ఆటోమబైల్ రంగంలో ఉద్యోగాలకు పోటీ పెరిగింది. 1950, 1960 వరకూ నిర్మించబడిన ఫ్రీవే (రహదారి) ఉద్యోగుల రాకపోకలను సులభతరం చేసింది. 1967లో జరిగిన ట్వెల్త్ స్ట్రీట్ రాయిట్ తరువాత వెలువడిన న్యాయస్థాన ఆదేశాలు శ్వేతజాతీయులు నగరం వెలుపలకు వెళ్ళి నివాసాలు ఏర్పరుచుకోవడానికి దారితీసాయి. ఈ వలసలు నగరంలో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాయి. ప్రజలు ఉద్యోగాలు నగరం వెలుపలకు వెళ్ళడంతో నగర జనసంఖ్య సగానికి దిగివచ్చింది.

New cars built in Detroit loaded for rail transport, 1973

డెట్రాయిట్ నగరంలో 1973 నుండి 1979 వరకూ కొనసాగిన చమురు (గ్యాసో లైన్) కొరత విదేశీ లఘు వాహనాలను (చిన్న కార్లు) అమెరికా రోడ్లపై పయనించేలా చేసింది. బచ్ జోన్స్, మసెరాటి రిక్, చాంబర్స్ బ్రదర్స్ ప్రభావంతో నగరంలో క్రాక్ కోకైన్, హెరాయిన్ లాంటి మత్తు పదార్ధాల వినియోగం ఎక్కవై యువతపై దుష్ప్రభావం చూపించింది. నిరంతరంగా సాగుతున్న బృహత్ నిర్మాణాలవైపు నగర పెద్దలదృష్టి పడటంతో 1970లో రినైసెన్స్ సెంటర్ నిర్మించడానికి దోహదమైంది. ఇది నగరంలో మరొక నగరం వర్ణించబడిన బృహత్తర ఆకాశహర్మ్యాల సముదాయం. ఆ తరువాతి కాలంలో 1990 నగరపురాల వలస అనివార్యంగా సాగినా వలసలు చాలావరకు నెమ్మదించాయి అన్నది వాస్తవం.

A 4 p.m. change of work shift at the Ford Motor Company assembly plant in Detroit, 1910s

డెట్రాయిట్ నగరంలో 1980 నిర్వహించబడిన రిపబ్లికన్ నేషనల్ కాన్‌వెన్‌షన్ మహాసభలో రోనాల్డ్ రీగన్ ప్రెసిడెంట్‌గా ప్రతిపాదించబడిన ప్రతిపాద విజయయవంతమై రోనాల్డ్ రీగన్ ను అమెరికా ప్రెసిడెంట్‌ను చేసింది. ఆ తరువాత చాలినంత పోలీస్ బలం లేని కారణంగా మూడు దశాబ్ధాల కాలం మత్తుపదార్ధాల వినియోగం, నేరాలు నగరంలో స్వైర విహారం చేసి ఎల్మ్ హర్స్ట్ బ్లాక్ లాంటి ప్రదేశాలను నిర్మూలించడానికి దారితీసాయి.1980 సమయంలో నిరాదరంగా వదిలివేయబడిన కట్టడాలను పడగొట్టి మత్తుపదార్ధాల అమ్మకందారుల దారులను మూసివేసే ప్రయత్నాలకు ఊపిరి పోసారు. ఇలాంటి ప్రదేశాలు అర్బన్ ప్రెయరీ (నిర్మాణాలను పడగొట్టడం ద్వారా ఏర్పడిన బయలు) లుగా మారాయి.

1990లో డౌన్‌టౌన్ కేంద్రాంలో అధికంగా కలిగిన చైతన్యం నగర ప్రజలను ఆనందపరచింది. కొమెరికా సెంటర్ ఎట్ డెట్రాయిట్ సెంటర్ 1990 డౌన్ టౌన్‌లో ఆకాశసౌధాల జాబితాలో చేరింది.ఆతరువాత నగరంలో ఎమ్‌జి్‌ఎమ్ కాసినో ,మోటర్సిటీ కాసినో , గ్రీక్ టౌన్ కాసినో ల నిర్మాణం జరిగింది.వాటిలో 2007,2008 లలో వసతిగృహాలు నిర్మించి అదనపు సౌకర్యాలను చేర్చారు.2000 నుండి 2002 వరకు డెట్రాయిట్ టైగర్స్ , డెట్రాయిట్ లైన్స్ కొరకు స్టేడియమ్‌లు నిర్మించబడ్డాయి.1974 తరువాత డెట్రాయిట్ లయిన్స్ కు స్వస్థలంలో స్టేడియమ్ వసతి కలిగింది.డెట్రాయిట్ నగరం 2005లో ఎమ్‌ఎల్‌బి ఆల్‌స్టార్ గేమ్ ,2006లో సూపర్ బౌల్ ఎక్స్‌ఎల్ ,2006 వరల్డ్ సీరీస్ , 2007లో రెస్టెల్ మానియా 23 క్రీడలకు ఆతిధ్యం ఇచ్చింది.ఈ క్రీడలు డౌన్ టౌన్ ప్రదేశంలో అత్యంత అభివృద్ధిని తీసుకువచ్చింది.

డెట్రాయిట్ నగర నదీతీరాలు అభివృద్ధి చేయడానికి తగిన కేంద్రాలయ్యాయి.నదీ తీరంలోని కొన్ని మైళ్ళ పొడవున ఉద్యానవనాలు, ఫౌంటెన్లతో చేరిన డెట్రాయిట్ రివర్ వాక్ నిర్మించబడింది.నగరపురాలలో అర్బన్ డెవలప్‌మెంట్ ఇన్ డెట్రాయిట్ పేరొతో ఆరంభించిన ఈ అభివృద్ధి నగరానికి పర్యాటకుల ద్వారా ఆదాయం కలిగేలా చేసింది.నదీతీరం వెంట అత్యంత ఖరీదైన వాటర్ మార్క్ డెట్రాయిట్ లాంటి కట్టడాలను నగరవాసులు ఇదివరకు చూడని విధంగా నిర్మించడం ఆరంభమైంది.వెల్‌కమ్ టు డెట్రాయిట్,ది రీనైసెన్స్ సిటీ ఫౌండెడ్ 1701 ఫలకం అందంగా నగరంలోకి వచ్చేవారికి అతిథిలా స్వాగతం ఇస్తుంది.

క్షీణదశ[మార్చు]

Packard Automotive Plant, an abandoned automobile factory in Detroit.
One of the tens of thousands of abandoned houses in Detroit.

దీర్ఘకాలం అధికంగా జసాంధ్రత, మోటర్ ఇంజన్ల తయారీలలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన డెట్రాయిట్ నగరం ఆర్థిక సంక్షోభం సమయంలో క్షీణదశ మొదలైంది. 1950లో మిగిలిన అమెరికన్ నగరాల మాదిరిగా జనసాంధ్రతలో శిఖరాగ్రనికి చేరుకున్నది. అత్యున్నత జనసంఖ్య 1.8 మిలియన్లు ( 18 లక్షలు). 2010 నాటికి జనసంఖ్యలో 40% తగ్గి 7 లక్షలకు చేరింది. 1950 నుండి జరిగిన ప్రతి గణాంకాలలో జనసంఖ్య క్షీణిస్తూ వచ్చింది. ఎడ్వర్డ్.జె బ్లౌస్టియన్ స్కూల్ అఫ్ పెయొంటింగ్, పబ్లిక్ పూలసీ ఆఫ్ రూట్జర్స్ యూనివర్శిటీ, ప్రింస్టన్ యూనివర్శిటీ ఆవరణలో ఉన్ నప్రింస్టన్ ఎంవిరాన్మెటల్ ఇంస్టిట్యూట్ ప్రొఫెసర్ ఫ్రాంక్.జె పాపర్ మొదలైన ప్రదేశాలు డెట్రాయిట్‌లో జనసంఖ్య క్షీణిచిన ప్రదేశాలలో ముఖ్యమైనవి. నగరప్రాంత జనసంద్రత క్షీణిచిన నగరాలకు డెట్రాయిట్ ఉదాహరణగా ఉంది. క్షీణించిన జనసంఖ్య నగరంలో తన గుర్తులను వదిలి వెళ్ళింది. అధికంగా నగరప్రాంతంలో అనేక నివాసగృహాలు ఖాళీగా మిగిలిపోయాయి. నగరమంతా విడివెళ్ళిన వేలాది గృహాలను పడగొట్టడానికి అవసరమైన పనులు కొనసాగాయి. కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడా మాత్రమే ప్రజలు ఉన్నందున నగరనిర్వహణ వ్యవస్థ సమస్యలను ఎదుర్కొన్నది. నగరంలో అధిక ప్రాంతంలో గృహాలను పడగొట్టడం, వీధి దీపాలను తొలగించడం వంటి సమస్యల పరిష్కారానికి నగరపాలన వ్యవస్థ సహాయం కోరింది. జనసంఖ్య స్వల్పంగా ఉన్న ప్రాంతాల ప్రజలను జనసంఖ్య అధికంగా తరలి వెళ్ళమని నగరపాలిత వ్యవస్థ ప్రజలను ప్రోత్సహించింది.జనసంఖ్య స్వల్పంగా ఉన్న ప్రాంతాలలో పోలీస్ సర్వీదుల వంటి సేవలు అనిదించడంలో సమస్యలు ఎదురయ్యాయి. నగరంలో సగంమందికంటే అధికమైన ఆస్తులయజమానులు 2011లో పన్నులు చెల్లించడంలో విఫలమయ్యారు. 2011లో డెట్రాయిట్ గణాంకాలను అనుసరించి 47% టక్స్ బిల్లులను యాజమాన్యానికి చేరలేదు. ఫలితంగా 246 మిలియన్ల (24 కోట్ల)డలర్ల పన్నులు, రుసుములు చెల్లించబడకుండా నిలిచి పోయాయి. దీనిలో సగం డెట్రాయిట్ నగరానికి చెందినదైతే మిగిలిన సగం వేన్ కౌంటీకి చెందినదని గణాంకాలు వివరిస్తున్నాయి. 2011లో 77 భవనసముదాయాలకు ఒకే యజమాని పన్నులు చెల్లించినట్లు వెల్లడైంది. మద్యతరగతి, శ్వేతాజాతిఒయుల మద్య నిరోద్యోగ సమస్య అధికమైంది. ఆస్తుల ధరలు పడిపోవడంతో పన్నులరూపంలో ఆదాయం క్షీణించడంతో నగరపాలనా వ్యవసస్థ సమస్యలపాలైంది. అధికసంఖ్యలో నేరాలు, జనాభా అసమానతలు నమోదైంది. జనసమ్మర్ధం తగ్గిన ప్రాంతాలలో పహారాకొరకు 20,000 పోలీస్ నిఘాశునకాల ఏర్పాటు జరిగింది. 2010 లో 59 మంది పోస్టల్ ఉద్యోగులను శునకాల చేత బాధించబడినట్లు డెట్రాయిట్ పోస్టల్ అధికారులు నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ సంక్షోభం ఫలితంగా నగరపాలిత వ్యవస్థ నిర్వహణ బాధ్యతను మిచిగాన్ రాష్ట్రం స్వీకరించింది.2013లో మార్చి మాసంలో మిచిగాన్ రాష్ట్ర ప్రభుత్వం ఫైనాంషియల్ ఎమర్జెంసీ ( అత్యవసర ఆర్థికపరిస్థితి ) ప్రకటించింది. డెట్రాయిట్ 2013 జూలై 18 లో యు.ఎస్ నగరాలలో అత్యధికంగా దివాలైన నగరంగా గుర్తించబడింది.

వాతావరణం[మార్చు]

నగరంలోని వాతావరణం నదీ, సరస్సు ప్రభావంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చలికాలంలో స్వల్పమైన హిమపాతంతో కూడిన చలి ఉంటుంది. చలికాలంలో కొన్ని సమయాలలో ఆకస్మికంగా ఉష్ణోగ్రత పడిపోవడం, అలాగే వేసవిలో కొన్ని సమయాలలో హెచ్చుతూ ఉండటం సహజమే. చలికాలంలో అత్యల్పంగా మైనస్ 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వేసవి కాలంలో 90 డిగ్రీల సెంటీ గ్రేడ్ అత్యధిక ఉష్ణం కలిగిన వాతావరణం ఉంటుంది. నవంబరు నుండి ఏప్రిల్ మాస ప్రారంభం వరకు హిమపాతం ఉంటుంది. హిమపాతం 1 నుండి 10 అంగుళాలు పడుతుంది.

భౌగోళికం[మార్చు]

A simulated-color satellite image of the Detroit metro area, including Windsor across the river, taken on NASA's Landsat 7 satellite.
డెట్రాయిట్ నదీతీరం

డెట్రాయిట్ నగర విస్తీర్ణం యునైటెడ్ స్టేట్ సెన్సస్ బ్యూరో గణాంకాలననుసరించి 143 చదరపు మైళ్ళు ఉంటుంది. అందులో 138.8 చదరపు మైళ్ళు భూభాగం,4.2 చదరపు మైళ్ళు జలభాగం. నగరానికి వాయవ్య భాగంలో ఉన్న యూనివర్శిటీ డిస్ట్రిక్ నగర పరిసర ప్రాంతంలోని ఎత్తైన భూభాగం. డెట్రాయిట్, ఆగ్నేయ మిచిగాన్ భూభాగం కలిపి డెట్రాయిట్ మహానగరంగా పరిగణిస్తారు. నగరానికి వాయవ్యంలో ఉన్న యూనివర్శిటీ భూభాగం ఎత్తు 670 అడుగులు. డెట్రాయిట్ నదీతీర భూభాగం నగరంలో లోతట్టు ప్రాంతం. దాని ఎత్తు 579 అడుగులు ఉంటుంది.

A view of the city from Belle Isle Park in April 2008.

బెల్లే ఇస్లే పార్క్ వైశాల్యం 982 చదరపు ఎకారాలు (1,534 చదరపు మైళ్లు లేక 397 హెక్టార్లు). డెట్రాయిట్ నది, ఒటారియో లోని విండ్సర్ నది మద్య ఉపస్థుతమై ఉన్న ఐలండ్ పార్క్ ఉన్నాయి. ఐలాండ్ పార్క్ మెక్ ఆర్థర్ వంతెన ద్వారా ప్రధానభూభాగంతో అనుసంధానమైన ఉంది. బెల్లే ఇస్లే పార్క్‌లో జేంస్ స్కాట్ మెమోరియల్ ఫౌంటెన్, ది బెల్లే ఇస్లే కంసర్వేటరీ, ఐలాండ్ పార్కును ఆనుకుని ది డెట్రాయిట్ యాచ్ట్ క్లబ్, అర మైలు పొడవైన బీచ్, ఒక గోల్ఫ్ కోర్స్, ఒక నేచుర్ సెంటర్, ఙాపక చిహ్నాలు, పూలతోటలు ఉన్నాయి. ఐలాండ్ నుండి నగర ఆకాశసౌధాలు కనిపిస్తాయి.

నగర ఉపస్థితి[మార్చు]

.

నగరంలోని హామ్ట్రాక్, హైలాండ్ పార్కుల ప్రాంతాలను పూర్తిగా చుట్టి డెట్రాయిట్ ప్రవహిస్తూ ఉంది. నగరానికి ఈశాన్యంలో సంపన్నులు అధికంగా నివాసమున్న గ్రాస్ పాయింట్ ఉంది. ది డెట్రాయిట్ రివర్ ఇంటర్నేషనల్ విల్డ్ లఫ్ రెఫ్యూజ్ ప్రాంతం ఉత్తర అమెరికాలోని ఒకే ఒక అంతర్జాతీయ వన్యమృగ సంరక్షణ భూభాగం. మహానగర కేంద్రంలో ప్రతిష్ఠితమై ఉన్న ఈ సంరక్షణ కేంద్రం దీవులు, నదీతీర చిత్తడి నేలలు, పచ్చిక బయళ్ళు, జలచరాలతో సమ్మిశ్రితమై 48 నది, వెస్ట్రన్ లేక్ ఎర్రీ తీరం వెంట వ్యాపించి ఉన్న సుందర ప్రాంతమిది. నగరాన్ని కలుపుతూ మూడు రహదార్లు దాటి పోతుంటాయి.అమెరికా,కెనడా ల సరహద్దులలో ఉన్న ప్రధాన అమెరికా నగరం డెట్రాయిట్ మాత్రమే. నగరంలో సరిహద్దులు దాటటానికి నాలుగు మార్గాలు ఉన్నాయి. ది అంబాసిడర్ బ్రిడ్జ్, డెట్రాయిట్ వండ్సర్ టన్నెల్ గుండా వాహనాలలో వెళ్ళే సదుపాయం ఉంది. 'మిచిగాన్ సెంట్రల్ రైల్వే టన్నెల్ మార్గంలో రైలుద్వారా కెనడాను చేరుకోవచ్చు. నాల్గవ మార్గంలో విండ్సర్ సాల్ట్ మైన్ , జంగ్ ఇలాండ్ ప్రాంతం నుండి డెట్రాయిట్ విండ్సర్ ట్రక్ ఫెర్రీ లద్వారా కెనడాను చేరుకోవచ్చు. 15,00 ఎకరాలలో విస్తరించి ఉన్న విండసర్ సాల్ట్ మైన్ సముద్ర తీరానికి 1,100 అడుగుల లోతు వరకు ఉంటుంది.డెట్రాయిట్ సాల్ట్ మైన్ రోడ్ల పొడవు 100 మైళ్ళు.

నగర నిర్మాణం[మార్చు]

The Detroit International Riverfront in January 2006
The Detroit International Riverfront in January 2006

డెట్రాయిట్ నగర జలాశయతీరాలలో విభిన్న సుందర భవన సముదాయాలు చోటు చేసుకున్నాయి.ఆధినిక నిర్మాణాలకు కొంచం ముందుగా నిర్మించబడిన నియోగోతిక్ గోపురాలు కలిగిన డెట్రాయిట్ సెంటర్లో కోమెరికా టవర్ ఆఫ్ డెట్రాయిట్ సెంటర్ ఆర్ట్ డికో సంస్థ ఆధ్వైర్యంలో1993 లో రూపుదిద్దుకున్నాయి. రినైసెన్స్ సెంటర్‌తో చేర్చి వారు ప్రత్యేకత కలిగిన గుర్తించతగిన ఆకాశసౌధాల నిర్మాణం చేసారు.ఉదాహరణగా డౌన్ టౌన్‌లో ఉన్న ఆర్ట్ డికో శైలిలో నిర్మించబడిన గార్డియన్ బిల్డింగ్ , పెనోబ్‌స్కాట్ బిల్డింగ్ అలాగే వేన్‌సెంటర్‌ డిస్ట్రిక్ లో న్యూ సెంటర్‌లో ప్రదేశంలో ఫిషర్ బిల్డింగ్ , కాడిలాక్ ప్యాలెస్ ప్రధానమైన బృహత్తర నిర్మాణాలు.నగర ప్రముఖ భవనాల మధ్య దేశంలోనే బృహత్తర నిర్మాణాలైన ఫాక్స్ ధియేటర్ ,ది డెట్రాయిట్ ఒపేరా హౌస్ , డెట్రాయిట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ భవనాలు చోటు చేసుకున్నాయి.

Cadillac Place (1923) left, with the Fisher Building (1928) are among the city's National Historic Landmarks.
Detroit Financial District viewed from the International Riverfront

ఒకవైపు డౌన్ టౌన్, న్యూసెంటర్‌లో ఆకాశసౌధాలు ఉన్నట్లే నగరమంతా సాధారణమైన ఎత్తులో నిర్మించిన నివాసగృహాలతో నిండి ఉన్నాయి.నగరవెలుపలి ప్రాంతాలలో ఎత్తైన నివాసగృహ సముదాయాలు ఉన్నాయి.తూర్పుతీరాలలో గ్రాస్ పాయింట్, పాలమర్ పార్క్ వరకు విస్తరించి ఉన్న భవన సముదాయాలు వీటిలో కొన్ని.ఈ భవన సముదాయాలు రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు శ్రామిక వర్గం నిర్మించుకున్నవి.ఈ గృహాలు కలపతో చేసిన చట్రాలూ ఇటుక రాళ్ళు వాడి కట్టబడి ఆకాల నిర్మాణ శైలికి అద్దం పడుతున్నాయి.మధ్యతరగతి వారు నివసించే పెద్ద పెద్ద ఇటుకరాళ్ళ గృహాలు, పురుషుల వసతి గృహాలూ కలిగిన ప్రాంతాలూ నగరంలో ప్రసిద్ధం.ఇవి బ్రష్ పార్క్,ఉడ్ బ్రిడ్జ్,ఇండియన్ విలేజ్ ,పాల్మర్ ఉడ్స్,షర్ ఉడ్ ఫారెస్ట్ , ఇతరాలు.పడమటి తీరంలో దూరంగా 8 మైళ్ళ రోడ్డు సమీపంలో 1950లో శ్రామిక వర్గ గృహనిర్మాణాలు ఉడ్ వార్డ్, జఫర్సన్ సమీపంలో ఉన్న క్రాక్‌ టౌన్ లో తమ ప్రాచీనతను ప్రతిబింబిస్తూ ఉన్నాయి.ప్రస్తుతం ఐరిష్, బ్రష్ పార్క్ ప్రాంతాలలో అనేక మిలియన్ల డాలర్లతో నిర్మించబడుతున్న నివాస గృహసముదాయాలు ఉన్నాయి.

St. Joseph Catholic Church (1873) is a notable example of Detroit's ecclesiastical architecture.

నగరంలోని ప్రత్యేకంగా కళాత్మక విలువలు కలిగిన భవనాలు జాతీయ చారిత్రక భవనాలుగా గుర్తించబడి సంరక్షించ బడుతున్నాయి.నగరంలో పంతొమ్మదవ శతాబ్దం ఆఖరి దశలో, ఇరవై ప్రారంభ దశలో నిర్మించబడిన భవనాలు అనేకం ఇంకా సజీవంగా ఉన్నాయి.వాటిలో సెంయింట్ జోసెఫ్ కాథలిక్ చర్చి ,సెయింట్ అన్నే డీ డెట్రాయిట్ కాథలిక్ చర్చ్ లాంటి చర్చీలు అనేకం ఉన్నాయి.నదీ తీరంలో మూడున్నర మైళ్ళ వరకు విస్తరించి ఉన్న డెట్రాయిట్ ఇంటర్‌నేషనల్ రివర్ ఫ్రంట్ నివాస గృహాలు ఉద్యానవనాల కలయికతో సుందరంగా ఉంటుంది

నగరంలోని 19-20వ శతాబ్ధాలకు చెందిన అనేక భవనాలు సన్యుక్త రాష్ట్రాల దీర్ఘకాలంగా నిలిచిఉన్న భవనాల జాబితా నమోదు చేసిన " నేషనల్ రిజస్టర్ ఆఫ్ హిస్టారిక్ ప్లేసెస్ అండ్ ది సిటీ "లో ఉన్నాయి. నగరంలో గుర్తించతగిన చర్చిలలో ఎస్.టి జోసెఫ్స్, ఓల్డ్ ఎస్.టి మేరీస్, ది స్వీటెస్ట్ హార్టాఫ్ మేరీస్ , ది కేథ్డ్రల్ ఆఫ్ ది మోస్ట్ బ్లెస్స్డ్ సాక్రమెంట్ వంటి ప్రధానమైన చర్చిలు ఉన్నాయి. నగరరూపకల్పన, చారిత్రక కట్టడాల సంరక్షణ , భవననిర్మాణం వంటి అంశాలలో నగరం తగుచర్యలు తీసుకుంటూ ఉంది. మారిస్ పార్క్ వంటి ముఖ్యమైన ప్రదేశాలలో పునర్నిర్మాణం పనులు పూర్తిచేసి తిరిగి ఉపయోగానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నగరం లోని దియేటర్ డిస్ట్రిక్ వద్ద గ్రాండ్ సర్కస్ పార్క్, డెట్రాయిట్ సొంహాలు ఉన్న ఫోర్డ్ -ఫీల్డ్ , డెట్రాయిట్ పులులు ఉన్న కోమెరికా పార్క్ ఉన్నాయి. పడగొట్టబడే ప్రణాళికలో ఉన్న ఇతర భవనాలలలో ఎస్.టి జేంస్ జఫర్సన్ అడిటోరియం ఒకటి. 3-4.5 మైళ్ళపొడవైన " ది డెట్రాయిట్ ఇంటర్నేషనల్ రివర్ ఫ్రట్ " నిర్మాణం పూర్తి అయింది. ఇందులో అంతర్భాగంగా పూలతోటలు, నివాసగృహ భవనాలు, వాణిజ్యప్రదేశాలు ఉన్నాయి. హార్ట్ ప్లాజా నుండి అంబాసిడర్ వంతెన వరకు మరొక రివర్ ఫ్రంట్ 2 కిలోమీటర్లు పొడిగించ బడింది. ఇప్పుడు ఇది 5 మైళ్ళ ( 8 కిలోమీటర్ల) పొడవుంది. ఇంకా నకరంలో పాలిమర్ పార్క్ ( నార్త్ హైలాండ్ పార్క్), రివర్ రివిజ్ (దక్షిణం వైపు), చెనే పార్క్ (ఈస్ట్ రివర్ డౌన్ టౌన్)ఉన్నాయి.

.

పరిసరాలు[మార్చు]

Historic homes in the West Canfield neighborhood in Midtown.

డెట్రాయిట్ నగరానికి వైవిధ్యం కలిగిన పరిసరప్రాంతాలు ఉన్నాయి. పునరుద్ధరించబడిన డౌంటౌన్, మిడ్ టన్, న్యూ సెంటర్ ప్రాంతంలో చారిత్రాత్మకమైన పలు భవనాలతో జనసాంధ్రతను కలిగి ఉన్న తరుణంలో నగర వాయవ్య భాగంలో, నగర సరిహద్దులలో ఖాళీ భూములు పలు సమస్యలు సృష్టిస్తున్నాయి. వాటికి అనేక పరిష్కార మార్గాలు కూడా సూచించబడ్డాయి. 2007 డౌన్‍ టౌన్ ఉత్తమ నగరంగా గుర్తింపు పొందింది.

Historic restoration of the Lucien Moore House (1885), in Brush Park Historic District

నగర తూర్పుప్రాంతాలలో ఉన్న లఫయేట్ పార్క్ పునరుద్ధరించబడింది. లుడ్విగ్ మియాస్ వాన్ రోహి రెసిడెంషియల్ జిల్లా 78 ఎకరాల పూర్వం గ్రాటియట్ పార్క్ అని పిలువబడుతుంది. మీస్ వాన్ డర్ రోహె, లుడ్విగ్ హిల్బర్ సియామర్, ఆల్ఫర్డ్ కాల్డ్వెల్ చేత రూపుదిద్దబడిన ఈ ప్రదేశాంలో 19 ఎకరాలలో వాహనాలకు ప్రవేశం లేని పలు సుందర దృశ్యాలతో ఎత్తు తక్కువైన నివాసగృహాలు నిర్మించబడ్డాయి. ప్రత్యేకంగా నగర ఆగ్నేయ ప్రాంతంలో వలసనివాసితులు నగర పునరుద్ధరణలో తమవంతు సేవలను అందజేసారు. సమీప సంవత్సరాలలో డెట్రాయిట్ నగరం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న ఫలితంగా కొత్త నివాసగృహాలు, వ్యాపారంలో అభివృద్ధికి అవకాశాలు అలాగే మెక్సికన్ ఇంటర్నేషనల్ వెల్కం సెంటర్ ప్రాంరంభించబడింది.

Compuware World Headquarters viewed from Bagley Memorial Fountain on Cadillac Square

నగరంలో ఖాళీ ఆస్తులు కలిగిన పలు పరిసరప్రాంతాలు ఉన్నాయి. అవి నగర ప్రభుత్వరంగ నిర్మాణాలు, సేవలను పొడిగించేలా చేసాయి. 2009లో వస్తురవాణా పరిశోధనలు నగరంలోని నాల్గవవంతు అభివృద్ధి లోపం, ఖాళీగా ఉన్నాయని 10% నగర నివాస గృహాలు ఖాళీగా ఉన్నాయని తెలిపాయి. ఈ పరిశీలనలో నగరంలోని 86% నివాసగృహాలు మంచిస్థితిలో ఉన్నాయని, 9% నివాసగృహాలు కొంచెం మరమ్మత్తు చేయవలసిన స్థితిలో ఉన్నాయని తెలిసింది. ఖాళీ నివాసాల సమస్య పరిష్కారం కొరకు జీర్ణావస్థలో ఉన్న నివాస గృహాలు పడగొట్టబడుతున్నాయి. 2010లో 10,000 గృహాలలో 3,000 గృహాల వరకు పడగొట్టబడ్డాయి. జనసాంద్రతా లోపం నగర ప్రభుత్వ నిర్మాణాల సేవలకు కొంచెం శ్రమను అధికం చేసాయి. ఈ సమస్యకు పరిష్కారంగా సూచించబడిన పలు మార్గాలలో అక్కడి ప్రజలను తరలించి ఆ ప్రాంతాలను వ్యవసాయ భూములుగా మార్చడం ఒకటి.

పరిసరప్రాంతాలలోని ప్రజలను తరలించడానికి ప్రభుత్వ నిధులు, ప్రభుత్వేతర సంస్థలు కావలసిన విశ్వాసం కలిగిస్తున్నారు. 2008 ఏప్రిల్ నగరపాలన వ్యవస్థ ఉపాధి అవకాశాల అభివృద్ధికి, పరిసర ప్రాంతాల పునరుద్ధరణకు 300 మిలియన్ల అమెరికన్ డాలర్లు మంజూరు చేసింది. పరిసరప్రాంతాలలోని బ్రైట్‍మూర్ తూర్పు ఇంగ్లీష్ విలేజ్, గ్రాండ్ నది / గ్రీన్ఫీల్డ్, ఉత్తర-ఎండ్,, ఒస్బోర్న్ పునరుద్ధరణ ప్రణాళికలోని భాగాలు. ఈ ప్రయత్నం కొరకు ప్రభుత్వేతర సంస్థలు నిధులను సమకూర్చే ప్రయత్నాలు కొనసాగాయి. అదనంగా నగరంలోని 1,200 ఎకరాల భూములు పునరుద్ధరిం చబడ్డాయి. ఫార్ ఈస్ట్ సైడ్ ప్లాన్ పేరుతో బృహత్తర ప్రణాళికతో పరిసర ప్రాంత నిర్మాణాలు చేపట్ట బడ్డాయి. మేయర్ పరిసరప్రాంతాలను వాటీ అవసరాలకు అనుగుణంగా వర్గీకరించారు.

పునరుపయోగం[మార్చు]

The Westin Book Cadillac Hotel completed a $200-million reconstruction in 2008, and is in Detroit's Washington Boulevard Historic District

డెట్రాయిట్ ప్రస్తుత సమస్యల నడుమ పలు నిర్మాణసంస్థల పనులు ముందుకు సాగలేకపోతున్నాయి. డెట్రాయిట్ మిడ్‌టౌన్ అత్యధికంగా 96% నివాసాలతో విజయవంతంగా అభివృద్ధిని సాగిస్తుంది. పలు నిర్మాణాలు ప్రస్తుతం వివిధదశలలో పనులు కొనసాగిస్తున్నాయి.డౌన్-టౌన్ లో ఉన్న డెవిడ్ విట్నీ భవనం " వుడ్‌వార్డ్ గార్డెన్ " విభాగం నిర్మాణదశలో ఉంది. డెట్రాయిట్ ప్రజలలో యువ ఉద్యోగుల సంఖ్య క్రమంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా చిల్లర వాణిజ్యం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. అనేకమైన విలాసవంతమైన భనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. తూర్పు నది అభివృద్ధి పధకాలు రెండు దేశల మధ్య జరుగుతున్న సహకార అభివృద్ధి పథకాల జాబితాలోకి చేరింది. ఈ పథకాలు డౌన్ టౌన్ లో నదీ తీరంలో పునరుద్దరించబడిన మిడ్ టౌన్, న్యూ సెంటర్ లోని యువ ఉద్యోగులను ఊరిస్తూ ఉన్నాయి. 2007 గణాంకాలు కొత్త డౌన్ టౌన్ నివాసితులలో 57% ప్రజలు 24-34 మధ్య వయసున్న యువత అని వీరు కళశాల పట్టభద్రులని, 34% ప్రజలు ఉన్నత కళాశాల పట్టభద్రులని తెలుపుతున్నాయి. నగరానికి కొంచెం వెలుపల వసతి గృహాలలో నివసిస్తున్న యువతకు డౌన్ టౌన్ కు సమీపంలో నివసించాలన్న కోరికకు ఈ పథకాలు కొత్త ఆశను చిగురింపజేసాయి. డెట్రాయిట్ నగరంలో మద్యపానం సేవించడానికి కనీసం 19 సంవత్సరాల వయోపరిమితి ఉన్న కారణంగా ఒంటారియో, నిన్డ్సర్ ప్రాంత యువకులకు రాత్రి జీవితం అందుబాటులో ఉంది. 2011 అధ్యయనాలు డెట్రాయిట్ ప్రజలలోమూడింట రెండు వంతుల ప్రజలు తరచుగా రాత్రి విందులు వినోదాలలో పాల్గొంటారని తెలుపుతున్నాయి. అలాగే వీరు సంయుక్త రాష్ట్రాలలో అధికంగా నడవగలిగిన శక్తి కలిగిన వారని కూడా తెలుపుతున్నాయి. నుండి డెట్రాయిట్ నగరంలో సంగీత కచేరీలకున్న ప్రాముఖ్యం ఈ నగరానికి 'మోటౌన్' అన్న ముద్దు పేరు వచ్చేలా చేసింది. మహానగర ప్రాంతం మొత్తంలో అనేక దేశాలకు చెందిన సంగీత వేదికలున్నాయి. లైవ్ నేస్హన్ చేత నిర్వహించబడే కన్సర్ట్ కార్యక్రమాలు డెట్రాయిట్ నగరమంతా నిర్వహించబడుతునాయి. డి టి ఈ మ్యూజిక్ దియేటర్ మచ్ఫ్రియు ప్యాలెస్ ఆఫ్ అబర్న్ హిల్స్లో బృహత్తర కన్సర్ట్ కచేరీలు జరుగుతుంటాయి. సంయుక్త రాష్ట్రాలలో రెండవ స్థానంలో ఉన్న డెట్రాయిట్ థియేటర్ లో బ్రాడ్ వే కచేరీలు జరుగుతుంటాయి. నగరంలోని ప్రధాన థియేటర్లు 5174 ఆసన వసతి కలిగిన ఫాక్స్ థియేటర్, 1,770 ఆసన వసతి కలిగిన మ్యూజిక్ హాల్, 445 ఆసన వసతి కలిగిన జర్,అన్ థియేటర్, 4,404 ఆసన వసతి కలిగిన, మసోనిక్ టెంపుల్ థియేటర్, 2,765 ఆసన వసతి కలిగిన ది డెట్రాయిట్ ఒపేరా హౌస్,2,089 ఆసన వసతి కలిగిన ది ఫిస్హర్ థియేటర్, 2,220 ఆసన వసతి కలిగిన, ది ఫిల్మోర్ డెట్రాయిట్, సెయింట్ ఆండ్రూస్ హాల్, ది మెజెస్టిక్ థియేటర్, 2,286 ఆసన వసతి కలిగిన ది ఆర్కెస్ట్రా హాల్ ఉన్నాయి. డెట్రాయిట్ సింఫోనీ ఆర్కెట్రాక్కు ప్రేక్స్హకుల ఆదరణ అధికంగా ఉంది. న్యూయార్క్ నగరంలో బ్రాడ్ వే కార్యక్రాల మీద ఆధిక్యత కలిగి ఉన్న నెదర్లాండ్ ఆర్గనైజేస్హన్ 1922 లో డెట్రాయిట్ ఒపేరా హాల్ ను కొనుగోలు చేసింది.

530,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న మోటౌన్ మోస్హన్ పిక్చర్ స్టూడియోలు డెట్రాయిట్, దాని పరిసర ప్రాంతాలలో చలన చిత్రాలను చిత్రీకరిస్తూ ఉంది. పాన్టియాక్ చెంటర్ పాయింట్ కేంపస్ 4,000 మందికి చలన చిత్ర పరిశ్రమ్ సంబంధిత ఉపాధి కల్పించగలదని ఎదురు చూస్తున్నారు.

సంగీతం[మార్చు]

Fox Theatre lights up 'Foxtown' in downtown Detroit.

డెట్రాయిట్ నగరానికి సుసంపన్నమైన సంగీత వారసత్వం ఉంది. కొన్ని దశాబ్ధాలుగా అనేక ప్రదర్శనలు ఇచ్చి కొత్త దశాబ్దంలోకి అడుగు పెట్టింది. నగరంలో ప్రధాన సంగీత ఉత్సవాలు డెట్రాయిట్ అంతర్జాతీయ జాజ్ ఫెస్టివల్, డెట్రాయిట్ ఎలెక్ట్రానిక్ మ్యూజిక్ ఫెస్టివల్, ది మోటర్ సిటీ మ్యూజిక్ కాన్ఫరెన్స్, ది అర్బన్ ఆర్గానిక్ మ్యూజిక్ కాన్ఫరెన్స్, ది సెంటర్ ఆఫ్ కలర్స్, ది హిప్ హాప్ సమ్మర్ జాజ్.1940 నుండి నగరంలో నివసిస్తున్న జాన్ లీ హూకర్ నగరంలో దీర్ఘకాలంగా సంగీత కళాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. హూకర్ నగరానికి పొరుగున ఉన్న డెలరీలో నివసిస్తూ ఉన్నాడు. ఉత్తర అమెరికా నగరాలలో డెట్రాయిట్ బ్లూస్ తీసుకురావడానికి డెట్రాయిట్ తీసుకు రాబడిన సంగీత కళాకారులలో హూకర్ ఒకడు. హూకర్ ఫర్చ్యూన్ రికెఎర్డ్స్, ది బిగ్గెస్ట్ ప్రి-మోటన్/సౌల్ లెబుల్ గీతాలు రికార్డుల రూపంలో వెలువడ్దాయి. 1950 నాటికి నగరం జాజ్ సంగీతానికి కేంద్రం అయింది. ఉన్నత కళాకారులు బ్లాక్ బాటంలో కార్యక్రామాలు అందించారు. 1960 ప్రధానంగా వెలుగులోకి వచ్చిన కళాకారులు ట్రమ్ఫెట్ ప్లేయర్ డోనాల్డ్ బైర్డ్ ఒకడు. ఈయన కాస్ టెక్ ఆర్ట్ బ్లేకీ, జాజ్ మెసెంజర్స్ చేసి ఈ రంగంలో ప్రవేశించాడు.అలాగే బైర్డ్ వెంట పనిచేసిన సాక్సోఫోనిస్ట్ పెప్పర్ ఆడమ్స్ గుర్తింపు పొందిన కళాకారులలో ఒకడు. డెట్రాయిట్ లో అంతర్జాతీయ జాజ్ మ్యూజియం, జాజ్ దస్తావేజులు ఉన్నాయి.

Greektown Historic District in Detroit

1950-1960 మధ్య కాలంలో నగరంలో ఉన్న ఇతర ఆర్ &బి ప్రధాన సంగీత కళా కారులు ఆండ్రే విలియంస్, నథానియేల్ మేయర్. ఈ యన ఫార్చ్యూన్ లేబుల్ మీద ప్రంతీయ జాతీయ మైన విజయవంతమైన గీతాలను అందించాడు. స్మోకీ రాబిన్సన్ అభిప్రాయం ప్రకారం ఒక టీనేజర్ గా స్ట్రాంగ్ తన స్వరంతో ప్ర్స్ధానంగా ఆధిపత్యం సాధించాడు. డెట్రాయిట్ మూడవ అవెన్యూలో నివసిస్తున్న నెదర్లాండ్ దంపతులైన జాన్ బ్రౌన్, డివోరా బ్రౌన్ చేత నడుపబడుతున్న ఫార్చ్యూన్ లేబుల్ క్రింద గోస్పెల్ రక్ బెల్లీ ఎల్ పిలు, 45స్ వెలువడ్డాయి.

జూనియర్ బెర్రీ గార్డీ మోటౌన్ రికార్డ్స్ సంస్థను స్థాపించాడు. 1960-1970 మధ్య ఈ సంస్థ స్టెవీ వండర్ చర్యల వలన ఉన్నత స్థితికి చేరుకుంది. ది టెంటేస్హన్స్, ది ఫ్zఒర్ టాప్స్, స్మోకీ రాబిన్సన్ & ది మిరాకిల్స్, డైనా రాస్& ది సుప్రీంస్, ది జాక్సన్ 5, మార్తా, ది వందిల్లాస్, ది స్పిన్నర్స్, గ్లేడీస్ నైట్ & ది పస్ మార్విన్ గ్రీ మొదలైనవి వంటి గీతాలను వెలువరించి 1960-1970 కాలంలో ఈ సం స్థ చరిత్రను సృస్హ్ట్Mచింది. 2002 మోస్హన్ హౌస్ బ్యాండ్ క్రింద పౌల్ జస్ట్ మన్ డాక్యుమెంటరీ మోటౌన్ నేపథ్యంలో చిత్రించబడింది. ఈ డాక్యుమెంటరీ ఆలన్ స్లట్స్కీ పుస్తకం ఆధారితంగా నిర్మించబడింది. ఆఫ్రికన్ అమెరికన్ కళాకారుల సహకార!తో నడుపబడుతున్న ఆఫ్రికన్ అమెరికన్లకు స్వంతమైన మోటన్ సౌండ్ ప్రసిద్ధ మైన సంగీతంతో సంగీత ప్రపంచంలో సంచలనం సృస్హ్టించింది. 1972 లో గార్డీ చలన చిత్ర నిర్మాణం కొరకు డెట్రాయిట్ నుండి లాస్ ఏంజిల్ కు వెళ్లి తిరిగి డెట్రాయిట్ కు తిరిగి వచ్చాడు. ఆర్&బి యొక్క మరొక కళాకారిణి ఆర్థా ఫ్రాంక్లిన్ మోటౌన్ సౌండ్ కు తీసుకురాబడినా ఆమె దాని కొరకు ఎప్పుడూ పాడనే లేదు.

1960-1970 మధ్యకాలంలో ప్రాంతీయ కళాకారులు రాక మొదలైంది. ది ఎమ్ సి5, ది స్టూజెస్, బాబ్ సేగర్, అంబాయ్ డ్యూక్స్ మొదలైన వారు టెడ్ నగ్లెట్, మిట్చ్ రైడర్, ది డెట్రాయిట్ వీల్స్, రేర్ ఎర్త్, అలైస్ కూపర్, సుజీ క్వాట్రో లలో పనిచేసారు. 1999 లో నిర్మించబడిన గ్రూప్ కిస్ చిత్రం డెట్రాయిట్ నగరానికి రాక్ సంగీతానికి ఉన్న అనూబంధం వెలుగులోకి వచ్చింది. 1980 ల్ ఒ హార్డ్ కోర్ పంక్ రాక్ సంగీతానికి డెట్రాయిట్ కేంద్ర బిందువు అయింది. నరం నుండి దాని పర్రిసర ప్రాంతాల నుండి అనేక ప్రాంతీయ, జాతీయ బ్రాండు సంస్థలు నెక్రాస్, ది మీట్ మెన్, నెగేటివ్ అప్రోచ్ వంటివి తలెత్తాయి.

1990, కొత్త మైలేనియం నగరం అనేక హిప్ హాప్ ఆర్ట్స్టులను తయారు చేసింది. హిప్ హాప్ నిర్మాతలైన జె.డిల్లా, రేపర్, ఎస్తం, హిప హాప్ డ్యూలు ఎమినంది హిప్-హాప్ సంగీతంతంతో అత్యధిక అమ్మకాలను సాధించింది. డెట్రాయిట్ తెక్మ్యూజిక్ పుట్తిల్లు. జాన్ అట్కిన్స్, డెర్రిక్ మే, కెమిన్ సౌడర్సన్ వంటి వారు తెక్ మ్ఞూజిక్ లో తమ ప్రతిభను చాటుకున్నారు.

పర్యాటక రంగం[మార్చు]

Detroit Institute of Arts

నగరంలోని అనేక పురాతన వస్తు ప్రదర్శన శాలలు కల్చరల్ సేటర్ పక్కన ఉన్న "స్టేట్ యూనివర్సిటీ ", " ది కాలేజ్ ఫర్ క్రియేటివ్ స్టడీస్" చుట్టు పక్కల ఉన్నాయి. పురాతన వస్తు ప్రదర్శన శాలలు వరుసగా ది డెట్రాయిట్ ఇన్స్టిత్యూట్ ఆఫ్ ఆర్ట్స్, ది డెట్రాయిట్ హిస్టారికల్, చార్లెస్ ఎః. రైట్ మ్యూజియం ఆఫ్ ఆఫ్రికన్ అమెరికన్ హిస్టరీ, ది డెత్రాయిట్ సైన్స్ సెంటర్ అలాగే డెట్రాయిట్ ప్రభుత్వ గ్రంథాలయ ప్రధాన లార్యాలయం మొదలైనవి. ఇతర సాంస్కృతిక పురాతన వస్తు ప్రదర్శన శాలలు మోటౌన్ హిస్టారికల్ మ్యూజియం, ది పివాదిక్ పాటరీ స్టూడియో అండ్ స్కూల్, ది టస్క్జీ అయిర్ మ్యూజియం, ఫోర్ట్ వేన్, ది డోసిన్ గ్రేట్ లేక్స్ మ్యూజియం, ది మ్యూజియం ఆఫ్ కాంటెంపరరీ ఆర్ట్ డెట్రాయిట్, ది కాంటెంపరరీ ఆర్ట్స్ ఇన్స్టియూట్ ఆఫ్ డెట్రాయిట్, బిల్లీ ఇస్లే కన్సర్వేటరీ. 2010 లో మిడ్ టౌన్ లో 1600 చదరపు అడుగుల విస్తీర్ణంలో గి.ఆర్ ఎన్' నండీ ప్రదర్శన శాల తెరవబంది. అమెరికా, డెట్రాయిట్ ముఖ్యమైన చరిత్ర సంయుక్త రాస్హ్ట్రాల అతి పెద్ద ప్రదర్శనశాల కూడై లోని హెన్రీ ఫోర్డ్ లో ప్రదర్శించబడుతుంది. ది డెట్రాయిట్ హిస్టారికల్ సొసైతీ ప్రంతీయ చర్చిల గురించిన సమాచారం అందిస్తుంది. స్లైసర్స్, మేన్స్హన్ మొదలైన ప్రదేశాల పర్యటన సమాచారం అందిస్తుంది. అదే సయంలో డెట్రాయిట్ నగరంలో అతిథి పర్యటనలు, విద్య సంబంధిత కార్యక్రమాలు, డౌన్ టౌన్ స్వాగత కేంద్రం ఉన్నాయి. డెట్రాయిట్‌లో ఉన్న ఇతర పర్యాటక ఆకర్షణలు రాయల్ ఓక్ లో ఉన్న జంతుప్రదర్శన శాల, బ్లూం ఫీల్డ్ హిల్స్ లో ఉన్న్ క్రాన్ బ్రూక్ ఆర్ట్ మ్యూజియం, బిలే ఇస్లేలో ఉన్న ది అన్నా స్క్రిప్స్ వైట్ కోబ్ అబ్సర్వేటరీ, అబర్న్ హిల్ల్స్ లో ఉన్న వాటర్ పి.క్రిస్లర్ లో మొదలైనవి.

Eastern Market Historic District

. నగర వినోద కేంద్రాలుగా ది సిటి గ్రీక్ టౌన్, త్రీ డౌన్ డౌన్ టౌన్ కాసినో రిసార్ట్ హోటెల్స్ వంతివి ఉన్నాయి. 150 కంటే అధికంగా ఆహార సంబంధిత విక్రయశాలలు ఉన్న ది ది ఈస్టర్న్ మార్కెట్ ఫార్మర్స్ డిస్ట్రిబ్యూస్హన్ సెంటర్ సంయుక్త రాస్హ్ట్రాలలో పెద్ద ఫ్లవర్ బెడ్ మార్కెట్ గా గుర్తింపు పొందింది. శనివారాలలో దాదాపు 45,000 వేల మంది ఈస్టర్న్ మార్కెట్లో కొనుగోలు చేస్తారు. వేన్ స్టేట్ యూనివర్సిటీ, హెన్రీ ఫోర్డ్ హాఇటల్ లకు మిడ్ zతౌన్, న్యూ టౌన్ సెంటర్ కేంటర్ మధ్యలో ఉంటాయి. దాదాపు 50,000 మంది నివసిస్తున్న మిడ్ టౌన్ లో ఉన్న మ్యూజియాలు మరిఉ సాంస్కృతిక కేంద్రాలు వేలమంది పర్యాటలులను ఆకర్స్హిస్తునాయి. ఉదాహరణగా మిడ్ టౌన్ లో జరిగిన డెట్రాయిట్ ఫెస్టివల్ ఆఫ్ ది ఆర్ట్స్ దాదాపు 35,000 సందర్శకులను ఆకర్స్హించింది.

ఎలెక్ట్రానిక్ మ్యూజిక్ ఫెస్టివల్, ఇంటర్నేస్హనల్ జాజ్ ఫెస్టివల్, ది కంట్రీ మ్యూజిక్ హ్యూడౌన్, ది వుడ్వర్డ్ డ్రీం క్రూసీ, ది ఆఫ్రికన్ వరల్డ్ ఫెస్టివల్, నియోల్ నైట్, డేలీ ఇన్ ది అల్లే వంటి వారిస్హిక ఉత్సవాలు జరుగుతుంటాయి. డౌన్ టన్ లోపల మార్స్హిస్ పార్ఖ్ పెద్ద వేడుకలకు ఆతిథ్యం ఇస్తుంది. వాటిలో మోటౌన్ వింతర్ బెస్ట్ ప్రధానమైనది. అంతర్జాతీయ ఆటో మొబైల్ సంప్రదాయక కేంగ్రంగా నగరం నగరం నార్త్ అమెరికన్ ఇంటర్నేస్హనల్ ఆటో స్హోకు 1924 నుండి ఆతిథ్యం ఇస్తుంది. జాతీయంగా అతి పెద్దదని గుర్తింపు తెచ్చుకున్న థాంక్స్ గివింగ్ పేరేద్ కూడా నగరంలో జరుగుతున్న ఉత్సవాలలో ప్రధానమైనదే. ఐదు రోజులాటు ఇంతర్నేస్హనల్ రివర్ ఫ్రంట్ వద్ద జరిగే రివర్డేస్ ఉత్సవాలలో జరిగే ఫైర్ వర్క్స్ చూడడానికి దాదాపు 3 మిలియన్ల ప్రేక్స్హకుజు హాజర్ ఒఉతారు.

కోల్ మామ్ యంగ్ మునిసిపల్ సెంటర్ వద్ద ఉన్న "స్పిరిట్ ఆఫ్ డెత్రాయిట్ " శిల్పం ప్రముఖ రౌర శిపంగా మన్నలను అందుకుంది. ఈ శిపం తరచుగా డెట్రాయిట్ నగరానికి చిహ్నంగా వాడుతుంతారు. ఈ శిపం డెట్రాయిట్ క్రీడాకారులు విజయం సాధించిన సందర్భాలలో స్రోర్ట్స్ ద్రెసును ధరిస్తుంది. జఫర్సన్, వుడ్వార్డ్ అవెన్యూ ల కూదలిలో జ్యూ లూయిస్ జ్నాపక చిహ్నం 1986 అకోబర్ 16 తేదీన దేశానికి సమర్పించబడింది. ఈ శిపాన్ని రాబర్ట్ గ్రహం స్పృట్స్ ఇల్లస్ట్రేత్ కొరకు తయారు చేసాదు.

1986లో హైడెల్ బర్ఘ్ ప్రాజెక్ట్ పేరుతో కళాకారుడైన కైరీ గైటన్ ఒక వివాదాదమైన వీధి ప్రదర్శన ఏర్పాటు చేసాడు. ఈ ప్రదర్శన కొరకు ఆయన హైడల్ బర్ఘ్ దాని సమీపంలో ఉన్న పనికిరాని కారు భాగాలను, దుస్తులను, స్హూస్ వంటివి వాడాడు. గైటన్ ఇక్కడి నివాసితులు, పర్యాటకుల సాయంతో ఈ ప్రదర్శన ఈ ప్రాంతంఓ కొనసాగిస్తూనే ఉన్నాడు.

మాధ్యమం[మార్చు]

The Detroit Public Library.

డెట్రాయిట్ నగరంలో ప్రధాన దినపత్రికలు " ది డెట్రాయిట్ ఫ్రీ ప్రెస్స్ ",. " డెట్రాయిట్ న్యూస్ " . ఈ రెండు పత్రికలు సమైక్య ఒప్పందంతో తమ ప్రచురణాకార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. " ది డెట్రాయిట్ ఫ్రీ ప్రెస్స్ ", ఓల్డ్ న్యూస్ గుడ్ ఫెలో " మీడియా ఫిలియాంత్రోఫీలో అంతర్భాగంగా డెట్రాయిట్ నిధిసహాయంతో పనిచేస్తూ ఉన్నాయి. 2008లో డెట్రాయిట్ మీడియా భాగస్వామ్యం రెండు పత్రికలను డోర్ డెలివరీని వారానికి 3 రోజులకు తగ్గిస్తున్నామని ప్రకటించింది. ప్రచురణ లేని రోజులలో దినపత్రిక ప్రచురణ నిలిపివేయబడింది. ఈ మార్పులు 2009 నాటికి ఫలితం చూపడంతో 1980 లో స్థాపించబడిన " ది మెట్రో టైంస్ " వారపత్రిక వార్తలు, కళలు & వినోద సంబంధిత సమాచారం అందించసాగింది. అలాగే 1935 లో స్థాపించబడి డెట్రాయిట్ నుండి వెలువడుతున్న " మిచిగాన్ క్రోనికల్ " అమెరికాలో అతిపురాతన , గౌరవాదరాలు కలిగిన ఆఫ్రికన్- అమెరికన్ వార్తాపత్రికలలో ఒకటిగా గుర్తించబడుతూ ఉంది. ఇందులో రాజకీయ, వినోదాత్మక, క్రీడాసంబంధిత , కమ్యూనిటీ ఉత్సవాలు ప్రచురించబడుతూ ఉంటాయి. డెట్రాయిట్ టెలివిషన్ మార్కెట్ అమెరికాలో అతిపెద్ద టెలివిషన్ మార్కెట్లలో 11వ స్థానంలో ఉంది.డెటరాయిట్ రేడియో మార్కెట్ అమెరికాలో 11వ స్థానంలో ఉంది.

ఆర్ధిక రంగం[మార్చు]

The Renaissance Center is the world headquarters of General Motors.

డెట్రాయిట్‌ డౌన్‌టౌన్లో 80,500 మంది పనిచేస్తున్నారు. నగరంలో పనిచేస్తున్న వారిలో 1/5 ఉద్యోగులు డౌన్‌టౌన్లో పనిచేస్తున్నారు. 2012 మే మాసంలో " డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ " నివేదికలు నగరంలో నిరోద్యుగులు 15.8% ఉన్నట్లు తెలియజేస్తున్నాయి.

డెట్రాయిట్ అభివృద్ధిప్రణాళికలు తీవ్రంగా దెబ్బతినడం ప్రాంతీయంగా , రాష్ట్రీయంగా తీవ్రపరిణామాలకు దారితీసాయి. డెట్రాయిట్ నగరం సరికొత్ర పరిశ్రమలను నగరానికి తీసుకురావడానికి వైర్లెస్ ఇంటర్నెట్ జోన్(తంత్రీరహిత అంతర్జాలం), వాణిజ్య పన్ను రాయితీ, వినోదం, డెట్రాయిట్ ఇంటర్నేషనల్ రివర్ ఫ్రంట్ , హై-రైస్ నివాసగృహాల వటి సౌకర్యాలతో పెట్టుబడి దారులను ఊరింస్తుంది. 2003 నాటికి కాంపూవేర్ డెట్రాయిట్‌లో తనప్రధానకార్యాలయం ఏర్పాటుచేసింది. ఆన్‌స్టార్, బ్లూ క్రాస్ బ్లూ షీల్డ్ , హెచ్.పి ఎంటర్ప్రైస్ సర్వీసెస్ మొదలైనవి రీనైసెంస్ సెంటర్ వద్ద ఉన్నాయి.2006లో ఫోర్‌ఫీల్డును పక్కన ప్రైస్‌వాటర్‌హౌస్కూపర్స్ ప్లాజా , ఇఎమెస్‌టి & యంగ్ " ఒన్ కెనడీ స్క్వేర్ " వద్ద కార్యాకయాలు ఏర్పాటు చేసుకున్నాయి. 2010లో క్వికెన్ 4,000 మంది ఉద్యోగులతో డెట్రాయిట్ నగరంలో అంతర్జాతీయ కార్యాలయం చేసుకుంటూ శివార్లలో ఉన్న కార్యాలయాలను సంఘటితం చేయాలనుకోవడంతో డెట్రాయిట్ నగరం డైన్‌టౌన్ విస్తరించవలసిన అవసరం ఏర్పడింది. జనరల్ మోటర్స్, ఆటో పార్ట్స్ మేకర్ ఆక్సెల్ & మాన్యుఫ్యాక్చరింగ్ , డిటి.ఇ ఎనర్జీ వంటి " ఫార్చ్యూన్ 500 " కంపెనీలు కొన్ని డెట్రాయిట్‌లో కార్యాలయాలు ఏర్పాటుచేసుకున్నాయి. 2013లో ప్రకటనా సంస్థ లవ్ క్యాంప్‌బెల్ ఈవెయిడ్ తమకార్యాలయాన్ని వారెన్ నుండి డెట్రాయిట్ డౌన్‌టౌన్‌కు మార్చకుంటామని ప్రకటించాడు. ఫ్రకటనా సంస్థలు, లా, ఫైనాంస్, బయోకెమికల్ రీసెర్చ్, హెల్త్ కేర్, కంఫ్యూటర్ సాఫ్ట్‌వేర్ సంస్థలు తమకార్యాలయాలను డెట్రాయిట్‌కు మార్చుకున్నాయి. ది లా ఫర్ం ఆఫ్ మిల్లర్, పాడాక్ & స్టోన్ వారి కార్యాలయాలు విండ్సర్, డెట్రాయిట్ నగరాలలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి. నగరంలోని చారిత్రాత్మక భవనాలను నిలిపి ఉంచడానికి ప్రయత్నిస్తూనే నగరం పలుప్రదేశాలలోని భవనాలను తొలగించింది. నగరం ఆర్థికసంక్షోభం నుండి వెలువడడానికి 2008 లో బాండ్లను విడుదల చేసి శిథిలభవనాలు తొలగించడానికి నిధులు సమకూర్చింది. 2006 డౌన్‌టౌన్ డెట్రాయిట్ పునరుద్ధరణకు, సరికొత్త అభివృద్ధి కొరకు 1.3 బిలియన్ల డాలర్లు వ్యయంచేయాలని ప్రకటించింది. ఇందువలన నిర్మాణరంగంలో ఉద్యోగావకాశాలు అధికమయ్యాయి. 2006లో డౌన్‌టౌన్ డెట్రాయిట్ ప్రైవేట్, ప్రభుత్వరంగాల పెట్టుబడులద్వారా 15 బిలియన్ల డాలర్ల ఆదాయం పొందింది.

జన సంఖ్య[మార్చు]

Race and ethnicity in Detroit according to the 2000 United States Census. Each dot is 25 people.
  Caucasian
  African-American
  Asian
  Hispanic(of any race)
  Other

డెట్రాయిట్ నగరంలో 6.8% ప్రజలు తాము హిస్పానిక్ వర్గానికి చెందినవారమని నమోదుచేసుకున్నారు. వీరు మెక్సికో, ప్యూరిటో రికో నుండి వచ్చరని అంచనా. 20వ శతాబ్దంలో నగర జనాభా 6 రెట్లు వృద్ధిచెందింది. ఆటోమొబైల్ సంస్థలలో పనిచేయడానికి ఐరోపా, మధ్యప్రాచ్యదేశాలు (లెబనానీయులు, సిరియన్లు) అని భావిస్తున్నారు. 1940లో నగరంలోని జనాభాలో 90.4% ప్రజలు హిస్పానిక్ వర్గానికి చెందిన శ్వేతజాతీయులని గణాంకాలు తెలియజేస్తున్నాయి. 1910లో నగరంలో నివాసగృగసముదాయాలు 6,000 ఉండగా, 1930 నాటికి నివాసగృగసముదాయాలు 1,20,000 కు చేరుకున్నాయి. 20వ శతాబ్దంలో మహావలసల కాలంలో దేశం దక్షిణప్రాంతాల నుండి డెట్రాయిట్ ఆటోమొబైల్ సంస్థలలో పనిచేయడానికి వేలాది ఆఫ్రికన్ అమెరికన్లు నగరానికి వరదలా వచ్చిచేరారు.

సంయుక్తరాష్ట్రాలలో జాతివారీగా అధికంగా విభజించబడిన నగరాలలో డెట్రాయిట్ ఒకటి. 1940 -1970 వరకు జిం క్రో చట్టాలకు భీతిచెందిన ఆఫ్రికన్ అమెరికన్లు ఉద్యోగాలను వెతుక్కుంటూ డెట్రాయిట్ పెద్ద ఎత్తున రెండవసారి వచ్చి చేరారు. ఏదిఏమైనప్పటికీ వారు హింస, చట్టం, ఆర్థిక నేరాల కారణంగా శ్వేతజాతీయుల ప్రదేశాల నుండి బహిష్కరించబడ్డారు. శ్వేతజాతీయులు నల్లజాతీయుల ఇళ్ళ కిటికీలను పగులకొట్టడం, తగులపెట్టడం, బాంబులు కాల్చడం వంటివి చేసారు. శ్వేతజాతీయులు నగరశివార్లకు తరలి వెళ్ళిన తరువాత ఈ జాతి విభాగాలు అధికం అయ్యీయి. శ్వీతజాతీయులు, నల్లజాతీయుల సరిహద్దురేఖగా 8 మైళ్ళరోడ్డు ఉంటూ చచ్చింది.

జాతి విభాగాలు క్రమంగా వర్గవిభాగాలకు దారి తీసింది. 2010 నుండి క్రమంగా జాతి విభాగాల మద్య దూరం తరుగుతూ వచ్చింది. 2000 నాటికి సమైక్యంగా నివసిస్తున్న ప్రాంతాల సంఖ్య 100 కు చేరుకోగా 2010 నాటికి అది 204 కు చేరుకుంది. 2011 లో న్యూయార్క్ టైంస్ జాయివిభాగాలు దాదాపు లేకుండా పోయినట్లు పేర్కొన్నది. 21వ శతాబ్దంలో డెట్రాయిట్ మహానగరంలోని నల్లజాతీయులలో మూడింట రెండువంతుల మంది నగరశివార్ల లోపల నివసించసాగారు. 2010 గణాంకాలను అనుసరించి నగరంలో నల్లజాతీయుల మిచిగాన్ జనసంఖ్యలో 13% ఉన్నారు. డెట్రాయిట్ జంసఖ్యలో 82% నల్లజాతీయులు ఉన్నారు. తరువాత అధికసంఖ్యలో ఉన్న శ్వేతజాయీయులు 10% ఉన్నారు. హిస్పానికులు 6% ఉన్నారు. 60 సంవత్సరాలకు పైగా నగరం నుండి శ్వేతజాతీయుల వలసలు కొనసాగాయి. 2008 - 2009 హిస్పానిక్ వర్గానికి చెందని శ్వేతజాతీయుల శాతం 8.4% నుండి 13% నికి చేరుకుంది. కొంతమంది శ్వేతజాతి యువకులు నగరంలోకి తరలి వెళ్ళగా అనేక నల్లజాతీయులు నగరశివార్లకు తరలి వెళ్ళారు. డెట్రాయిట్ నగరంలో మెక్సికన్- అమెరికన్లు కూడా నివసిస్తున్నారు. 20వ శతాబ్దంలో వేలాది మెక్సికన్ - అమెరికన్లు వ్యవసాయ క్షేత్రాలు, ఆటోమొబైల్, స్టీల్ సంస్థలలో పనిచేయడానికి వచ్చి చేరారు. 1930లో మెక్సికన్ అమెరికా నుండి విడిపోయిన తరువాత మెక్సిక అమెరికన్లు ఇష్టపడి కొందరూ వత్తిడితో కొందరూ డెట్రాయిట్ నగరాన్ని వదిలి వెళ్ళారు. 1940 నాటికి మెక్సికన్ ప్రజలు ప్రస్తుత మెక్సికన్ టౌన్‌లో స్థిరపడ్డారు. 1990 నాటికి జాలిస్కో నుండి వచ్చిన ప్రజలరాకతో మెక్సికన్ ప్రజలసంఖ్య అధికమైంది. 2010 డెట్రాయిట్నగరంలో 36,452 మెక్సికన్లతో చేరి హిస్పానిక్కుల సంఖ్య 48,679. 1990 నాటికి హిస్పానిక్కుల సంఖ్య 70% వృద్ధిచెందింది. రెండవప్రపంచ యుద్ధానంతరం అప్పాలాచియా నుండి వచ్చిన ప్రజలు అనేకమంది డెట్రాయిట్‌లో స్థిరపడ్డారు. రెండవ ప్రపంచయుద్ధానంతరం లిథుయానియన్లు అనేకమంది డెట్రాయిట్ నగరంలో స్థిరపడ్డారు. వీరు ప్రత్యేకంగా నగరంలోని వాయవ్యప్రాంతంలో లుఫ్తానియన్లు హాల్ సమీపంలో స్థిరపడ్డారు.2001లో నగరంలో 1,03,000 యూదులు (1.9%) నివసిస్థున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. వీరు డెట్రాయిట్, అన్న ఆర్బర్ ప్రాంతాలలో నివసిస్తున్నారు.

చట్టం ప్రభుత్వం[మార్చు]

The Coleman A. Young Municipal Center houses the City of Detroit offices.

నగర ప్రభుత్వం ఎన్నిక చేయబడిన మేయర్, 9 మంది సభ్యులు కలిగిన కౌంసిల్, క్లర్క్ నిర్వహణలో కొనసాగుతుంది. 1974లో ఓటర్లు సిటీ చార్టర్‌కు అనుమతి తెలిపినప్పటి నుండి డెట్రాయిట్‌లో శక్తివంతమైన మేయర్ విధానం కొనసాగుతుంది. మేయర్ డిపార్ట్ మెంటల్ నియామకాల బాధ్యత వహిస్తాడు. కౌంసిల్ బడ్జెట్‌ను అనుమతిస్తుంది. నగర ఆర్డినెంస్, పెద్ద కాంట్రాక్టులకు కౌంసిల్ అంగీకారం అవసరం. సిటీ క్లర్క్ ఎన్నికలు, ముంసిపల్ రికార్డుల పర్యవేక్షణ చేస్తుంది. మేయర్, కౌంసిల్ క్లర్క్ ఎన్నికలు ప్రతి 4 సంవత్సరాలకు ఒక సారి నిర్వహించబడుతుంటాయి. 2009 నవంబరు రిఫరెండం తరువాత 2013 నుండి డిస్ట్రిక్ నుండి 7 గురు కౌంసిల్ సభ్యులను ఎన్నుకునే విధానం అమలులో ఉంది. 2009 నుండి డెట్రాయిట్ మేయర్‌గా డేవ్ బింగ్ పనిచేస్తున్నాడు.

కోర్టులు[మార్చు]

డెట్రాయిట్ కోర్టుల ఎన్నికలు నాన్ పార్టిషన్ విధానంలో కొనసాగుతుంది. ఇవి స్టేట్ నిర్వహణలో పని చేస్తాయి. కోల్మన్ - ఏ వద్ద వ్యానే కౌంటీ పోర్టబుల్ కోర్ట్ ఉంది. గ్రేటియాట్ అవెన్యూ ఫ్రాంక్ మర్ఫీ హాల్ ఆఫ్ జస్టిస్ వద్ద సర్క్యూట్ కోర్ట్ ఉంది. నగరంలో తర్టీ - సిక్స్ డిస్ట్రిక్ కోర్ట్ ఉంది.

రాజకీయాలు[మార్చు]

Dave Bing has been the mayor of Detroit since May 2009.

రాజకీయంగా నగరం రాష్ట్రీయ, ప్రాంతీయ, జాతీయ ఎన్నికలకు స్థిరంగా డెమక్రటిక్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉంది. " బే ఏరియా సెంటర్ ఫర్ రీసెర్చ్ " విడుదల చేసిన నివేదిక అనుసరించి అమెరికాలో డెట్రాయిట్ స్వేచ్ఛాయుతమైన పెద్ద నగరంగా గుర్తించబడుతుంది.2000 లలో నగరం " యునైటెడ్ స్టేట్ జస్టిస్ డిపార్ట్మెంట్ "ను పోలిస్ డిపార్ట్ మెంటు మీద విచారణజరపవలసినదిగా అభ్యర్థించిన తరువాత 2003 లో విచారణ చేపట్టబడింది. తరువాత నగరం పోలీస్ డిపార్ట్మెంట్ ప్రధాన రీ ఆర్గనైజేషన్ చర్యలు చేపట్టింది. 1802 లో నగరకార్పొరేట్ రూపొందించిన తరువాత డెట్రాయిట్ నగరంలో 74 మేయర్లు నియమినచడ్డారు. రిపబ్లికన్ పార్టీ నుండి చివరిగా " లూయిస్ మిరియాని " (1957-1962) నియమితుడయ్యాడు. 1973లో నగరంలో మొదటి సారిగా నల్లజాతి వ్యక్తి మేయర్‌గా " కోలమన్ యంగ్ " ఎన్నిక చేయబడ్డాడు. ఆయన నగరాభివృద్ధి పనులు , నిర్వహణ నగర పౌరులను సంతృప్తి పరచలేదు. గతంలో సుప్రిం కోర్ట్ జస్టిస్‌గా పనిచేసిన మేయర్ డెనిస్ ఆర్చర్ నగరం డౌన్ టౌన్‌లో మూడు కాసినోలకు అనుమతి ఇవ్వడం మొదలైన ప్రణాళికలతో పునరభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు. 2008 నాటికి మూడు కాసినో రిసార్ట్ హోటల్స్ నిర్మాణం పనులు పూర్తిచేసుకుని పనిచేస్తున్నాయి.

నేరం[మార్చు]

డెట్రాయిట్ నగరానికి తీవ్రమైన నేరవ్యవస్థ సమస్య ఉంది. 2007 గణాంకాలు అనుసరించి హింసాత్మక నేరాలు , తలసరి నేరాలలో డెట్రాయిట్ యు.ఎస్. లోని 25 నగరాలలో 6 వ స్థానంలో ఉంది. 2011 లో మిచిగాన్ రాష్ట్రంలో జరిగిన హత్యలలో మూడింట రెండు వంతులు డెట్రాయిట్‌లో సంభవించాయి. 2008 లో హింసాత్మక నేరం 11% తగ్గుముఖంపట్టింది. 2007-2011 మద్య కాలంలో డెట్రాయిట్‌ నగరం అత్యధికంగా హింసాత్మక నేరాలు జరుగుతున్న యునైటెడ్ నగరాలలో ఒకటిగా ఉంది. నైబర్హుడ్స్కౌట్.కాం నివేదిక అనుసరించి నేరాలు 1000 మందికి 62.18 శాతం , హింసాత్మక నేరాలు 1000 మందికి 16.73 శాతం ఉంది. జాతీయంగా ఆస్తి సంబంధిత నేరాలు 1000 మందికి 32 శాతం , హింసాత్మక నేరాలు 1000 మందికి 5 శాతం ఉంది. నగర డౌన్ టౌన్‌లో నేరాలు జాతీయ , రాష్ట్రీయ సరాసరి కంటే తక్కువగా ఉంది. 2007 లో విశ్లేషకులు, డెట్రాయిట్ అధికారులు నగరంలో జరుగుతున్న హత్యలలో 65-70 హోమీసైడ్స్ (గృహాంతర హత్యలు) ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇవి అధికంగా డ్రగ్ సంబంధిత హత్యలని భావిస్తున్నారు. వీటిలో 70% అపరిష్కృతంగా ఉన్నాయి. ఫోర్బ్స్ మ్యాగజిన్ యునైటెడ్ స్టేట్స్‌లో డెట్రాయిట్ అత్యంత ప్రమాదకరమైన నగరమని తెలియజేస్తుంది.ఫోర్బ్స్ పత్రిక 2,00,000 కంటే తక్కువ ఉన్న నగరాలను ఈ గణాంకాలలో చేర్చుకోలేదు. 2012 లో డెట్రాయిట్ నగరంలో నేరాల శాతం 10% క్షీణించింది.ఫోర్బ్స్ పత్రిక ఎఫ్.బి.ఐ. నుండి సేకరించిన " యూనిఫాం క్రైం డేటాబేస్ " ఆధారంగా ప్రమాదకరమైన నగరాల జాబితాను తయారుచేసింది. పోలీస్ రిపోర్టింగ్ స్టాండర్స్ విభేదాలను కారణంగా చూపుతూ ఎఫ్.బి.ఐ ఫోర్బ్స్ ప్రచురణకు వ్యతిరేకంగా వార్నింగ్ ఇచ్చింది.

విద్య[మార్చు]

Old Main, a historic building at Wayne State University
Sacred Heart Major Seminary
Commons at University of Detroit Mercy

డెట్రాయిట్ పలు విద్యాసంస్థలకు నిలయం. వీటిలో వేనే స్టేట్ యూనివర్శిటీ, మిడ్ టౌన్ ప్రాంతంలో ఉన్న నేషనల్ రీసెర్చి యూనివర్శిటీ (మెడికల్ , లా) లో వందలాది అకాడమిక్ డిగ్రీ , ప్రోగ్రాంలను అందిస్తూ ఉంది. నార్త్ వెస్ట్ డెట్రాయిట్ యూనివర్శిటీ డిస్ట్రిక్‌లో ఉన్న " డెట్రాయిట్ మెర్సీ యూనివర్శిటీ "ని సొసైటీ ఆఫ్ జీసెస్ , సిస్టర్స్ ఆఫ్ మెర్సీ సహకారంతో స్థాపించబడింది. ప్రముఖ రోమంకాథలిక్ కోయెజ్యుకేషన్ యూనివర్శిటీ వందలాది డిగ్రీ కోర్సులను , బిజినెస్, డెంటిస్ట్రీ, లా, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, నర్సింగ్ , ఆరోగ్యసరక్షణ సంబంధిత కోర్సులను అందిస్తుంది. ది యూనివర్శిటీ ఆఫ్ డెట్రాయిట్ మెర్సీ స్కూల్ ఆఫ్ లా డెట్రాయిట్ డౌన్‌టౌన్‌లో ఉంది. పొనిటికల్ యూనివర్శిటీ అనుబంధంగా 1919 లో స్థాపించబడిన శాక్రడ్ హార్ట్ మేజర్ సెమినరీ పలు పొనిటిఫికల్ డిగ్రీలను అందిస్తుంది. శాక్రడ్ హార్ట్ మేజర్ సిమినరీ వైవిధ్యమైన అకాడమిక్ ప్రోగ్రాంస్ అందిస్తుంది. నగరంలో కాలేజ్ ఫర్ క్రియేటివ్ స్టడీస్, లెవిస్ కాలేజ్ ఆఫ్ బిజినెస్, మేరీగ్రోవ్ కాలేజ్ , వేనే కౌంటీ మొదలైన కమ్యూనిటీ కాలేజీలు ఉన్నాయి. 2009 జూన్‌లో మిచిగాన్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఆస్తియోపతిక్ మెడిసిన్ (ఈస్ట్ లాంసింగ్) డెట్రాయిట్‌ మెడికల్ సెంటర్‌లో ఒక శాటిలైట్ కాంపస్‌ను ప్రారంభించింది.1837 లో డెట్రాయిట్‌లో యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్ స్థాపించబడింది. 1859 లో ఇది అన్నె ఆర్బర్‌కు తరలించబడింది. 1959 లో డియర్బన్‌లో " యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్ - డియర్బన్ " స్థాపించబడింది.

ప్రాధమిక , మాధ్యమిక పాఠశాలలు[మార్చు]

2011-2012 డెట్రాయిట్ ప్రభుత్వ పాఠశాలలో 66,000 మంది విద్యార్థులు ఉన్నారని అంచనా. మిచిగాన్ రాష్ట్రంలో డెట్రాయిట్ స్కూల్ డిస్ట్రిక్ అతి పెద్దదిగా గుర్తించబడుతుంది. డెట్రాయిట్‌లో 56 వేల చార్టర్ స్కూల్ విద్యార్థులు ఉన్నారు. 2009 గణాంకాలు అనుసరించి మొత్తం విద్యార్థుల సంఖ్య 1,22,000 అని అంచనా. 1990 లో మిచిగాన్ లెజిస్లేటివ్ ప్రాంతీయంగా ఎన్నిక చేయబడిన బోర్డును మేజేజిమెంట్ లోపాలను కారణంగా చూపి తొలగించి ఆదేస్థానంలో సంస్కరించబడిన బోర్డును మేయర్, గవర్నర్ల ఆధ్వర్యంలో నియమించింది. 2005 లో రిఫరెండం తరువాత 2005 నవంబరు 8 న ఎన్నికచేయబడిన బోర్డ్ తిరిగి స్థాపించబడింది. మొదటి ఎన్నికలలో 11 మంది సభ్యులను ఎన్నుకున్నది. డెట్రాయిట్ చార్టర్ పాఠశాలలలో విద్యార్థుల నియామకాలు అధికరించిన కారణంగా నగరం పలు ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని యోచిస్తుంది. నగరంలోని పబ్లిక్, చార్టర్ స్కూల్ విద్యార్థులు స్టండర్డైజ్డ్ పరీక్షలలో ప్రదర్శిస్తున్న నైపుణ్యం బలహీనంగా ఉంది. డెట్రాయిట్ పబ్లిక్ స్కూల్స్ నేషనల్ టెస్ట్ ఫలితాలు ఆశాజనకంగా లేవు. ప్రభుత్వ నిధిసహాయంతో నిర్వహించబడుతున్న చార్టర్ స్కూల్ ఫలితాలు పబ్లిక్ స్కూల్ కంటే మరింత దిగువన ఉన్నాయి. 2011లో రైట్ వింగ్ వెబ్ సైట్ వెలువరించిన వ్యాసం మిచిగన్ పబ్లిక్ స్కూల్స్ 8 గ్రేడర్లలో 23% బేసిక్ కంటే దిగువ స్థాయిలో ఉన్నారని, 45% బేసిక్ స్థాయిలో ఉన్నారని, 29% ప్రొఫీషియంట్ స్థాయిలో ఉన్నారని, 3% అడ్వాంస్డ్ స్థాయిలో ఉన్నారని తెలియజేస్తుంది. వ్యాసంలో పేర్కొనపోయినప్పటికీ ఇతర వనరుల ఆధారంగా దక్షిణ రాష్ట్రాలైన టెక్సాస్, ఫ్లోరిడాల కంటే డెట్రాయిట్ నాణ్యతా స్థాయి మెరుగ్గా ఉంది. అదే వ్యాసం వివరణలో డెట్రాయిట్ పబ్లిక్ స్కూల్ 8 గ్రేడర్ల రీడింగ్ స్థాయి 57% బేసిక్ కంటే దుగువన ఉంది, 36% బేసిక్ స్థాయిలో ఉంది, 7% ప్రొఫీషియంట్ స్థాయిలో ఉందని తెలియజేస్తుంది. వారు 8 గ్రేడర్లను మాత్రం ఎందుకు ఎంచుకున్నారో వ్యాసంలో వివరించబడలేదు.

ప్రైవేట్ స్కూల్స్[మార్చు]

డెట్రాయిట్‌లో వైద్యమైన ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే డెట్రాయిట్ ఆర్చిడియోసెస్ నిర్వహించే రోమన్ కాథలిక్ పాఠశాలలు ఉన్నాయి. నగరంలో ఆర్చిడియోసెస్ పలు

ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు నిర్వహిస్తుంది.ఆర్చిడియోసిస్ నిర్వహణలో 23 కాథలిక్ హై స్కూల్స్ ఉన్నాయి. మూడు కాథలిక్ హైస్కూల్స్‌లో రెండింటిని సొసైటీ ఆఫ్ జీసెస్ నిర్వహిస్తుండగా ఒకదానిని సిస్టర్స్ నిర్వహణలో పనిచేస్తుంది.

ఆరోగ్యం[మార్చు]

డెట్రాయిట్ నగరంలో 12 ప్రధాన ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో డెట్రాయిట్ మెడికల్ సెంటర్, హెంరీ ఫోర్డ్ హెల్త్ సిస్టం, ఎస్.టి. జాన్ హెల్త్ సిస్టం, జాన్ డి.డింగెల్ వి.ఎ. మెడికల్ సెంటర్ ప్రధానమైనవి. ది డి.ఎం.సి. లెవల్ 1 ట్రూమా సెంటర్ (డెట్రాయిట్ రిసీవింగ్ హాస్పిటల్, యూనివర్శిటీ హెల్త్ సెంటర్), చిల్డ్రంస్ హాస్పిటల్ ఆఫ్ మిచిగాన్, హార్పర్ యూనివర్శిటీ హాస్పిటల్, హత్జెల్ వుమంస్ హాస్పిటల్, క్రెస్జ్ ఐ ఇంస్టిట్యూట్, రిహాబిలిటేషన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ మిచిగాన్, సినై-గ్రేస్ హాస్పిటల్, కర్మనోస్ కేంసర్ ఇంస్టిట్యూట్ ఉన్నాయి. డి.ఎం.సి.లో 2,000 కంటే అధికమైన లైసెంస్డ్ బెడ్స్, 3,000 ఫిజీషియన్లు ఉన్నారు. ఇది డెట్రాయిట్ నగరంలో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న సంస్థగా గుర్తించబడుతుంది. ఈ సంస్థకు అవసరమైన ఫిజీషియన్లు " వేనే స్టేట్ యూనివర్శిటీ స్కూల్ అఫ్ మెడిసిన్ " నుండి నియమించబడ్డారు. వేనే స్టేట్ యూనివర్శిటీ స్కూల్ అఫ్ మెడిసిన్ యునైటెడ్ స్టేట్స్‌లో అతి పెద్ద సింగిల్ కాంపస్ మెడికల్ స్కూలు, యునైటెడ్ స్టేట్స్‌లో అతి పెద్ద మెడికల్ స్కూల్స్‌లో 4వ స్థానంలో ఉంది. డెట్రాయిట్ మెడికల్ సెంటర్ క్రమంగా " వ్యాంగార్డ్ హెల్త్ సిస్టంస్ " (2010 డిసెంబరు 30) లో భాగం అయింది.

ప్రయాణ సౌకర్యాలు[మార్చు]

Rosa Parks bus terminal downtown

రోసా పార్క్ బస్ టర్మినల్ డౌన్ టౌన్ నుండి కెనడా, పోర్ట్స్, మేజర్ హైవేలు, రైల్ కనెక్షన్లు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులకు సులువుగా చేరుకోవచ్చు. నగరంలో మూడు అంతర్జాతీయ సరిహద్దు క్రాసింగులు ఉన్నాయి. ది అంబాసిడర్ బ్రిడ్జ్, డెట్రాయిట్ - విండ్సర్ టన్నెల్, మిచిగాన్ సెంట్రల్ రైల్వే టన్నెల్ డెట్రాయిట్‌ను విండ్సర్, ఓంటారియాతో అనుసంధానం చేస్తూ ఉంది. ది అంబాసిడర్ బ్రిడ్జ్ ఉత్తర అమెరికాలో ఏకైక సింగిల్ బిజియస్ట్ బ్రిడ్జిగా గుర్తించబడుతుంది.

విమానాశ్రయం[మార్చు]

రొమూలస్ ప్రాంతంలో ఉన్న " డెట్రాయిట్ మెట్రోపాలిటన్ వానే కౌంటీ ఎయిర్ పోర్ట్ (డి.టి.డబల్యూ)" డెట్రాయిట్ ప్రజలకు ప్రధాన విమానాశ్రయంగా సేవలందిస్తూ డెల్టా ఎయిర్వేస్ ప్రధాన కేంద్రంగా, స్పిరిట్ ఎయిర్ లైంస్ ద్వితీయ ప్రధానకేంద్రంగా ఉంది. ఫ్లింట్ ప్రాంతంలో బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (ఇ.ఎన్.టి) (మిచిగాన్) ఈప్రాంతంలో బిజియస్ట్ విమానాశ్రయంగా సేవలు అందిస్తూ ఉంది. డెట్రాయిట్ ఈశాన్యంలో కోల్మన్ ఎ.యంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (డి.ఇ.టి) (గతంలో దీనిని డెట్రాయిట్ సిటీ ఎయిర్ పోర్ట్) ఉంది. ఒకప్పుడు ఇక్కడ నుండి " సౌత్ వెస్ట్ ఎయిర్ వేస్ " పయనించేవి. ప్రస్తుతం ఇది చార్టర్ సర్వీస్, జనరల్ అవియేషన్ విమానసేవలు అందిస్తుంది. ఫార్- వెస్టర్న్ వేనే కౌంటీ సమీపంలో ఉన్న " విల్లో రన్ ఎయిర్ పోర్ట్ " జనరల్ అవియేషన్, కార్గో సేవలు అందిస్తుంది.

బస్ మార్గం[మార్చు]

People Mover train comes into the Renaissance Center station.

మాస్ ట్రాంసిస్ట్ బస్ సర్వీసులు అందిస్తుంది. ది డెట్రాయిట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాంస్పోర్టేషన్ (డి.డి.ఒ.టి) నగరం వెలుపల వరకు సర్వీసులు అందిస్తుంది. సబర్బన్ మొబైలిటీ అథారిటీ ఫర్ రీజనల్ ట్రాంస్పోర్టేషన్ (ఎస్.ఎం.ఆర్.టి) నగరశివారు ప్రాంతాలకు బస్ సర్వీసులు అందిస్తుంది." ట్రాంసిస్ట్ విండ్సర్ " సంస్థ టన్నెల్ బస్ మార్గంలో డెట్రాయిట్, విండ్సర్ డౌన్ టౌన్ మద్య క్రాస్ బార్డర్ బస్ సర్వీసులు అందిస్తుంది.

రైలు[మార్చు]

1987లో ఎలివేటెడ్ రైల్ సిస్టం ప్రజలను తరలించే సేవలు అందిస్తుంది. ఇది లూప్ డౌన్ టౌన్‌లో 2.9 మైళ్ళ పొడవైన మార్గంలో పయనిస్తుంది. అంట్రెక్ వాల్వెరిన్ సర్వీసులను డెట్రాయిట్, చికాగో, పోంటియాక్ మద్య రైలు సర్వీసులు అందిస్తుంది. బ్యాగేజ్ చకిన్ లేనప్పటికీ ఇది రెండు సూటుకేసులు, అదనంగా బ్రీఫ్‌ కేస్, పర్సులు, లాప్ టాప్ బ్యాగ్, ఇంఫెంట్ ఎక్విప్మెంట్లు మాత్రం అనుమతిస్తుంది.అంట్రాక్ స్టేషన్ ఉత్తర డెట్రాయిట్ డౌన్ టౌన్‌లో ఉంది. ది.జె.డబల్యూ వెస్ట్ కాట్ II, మైల్స్‌ను డెట్రాయిట్ నది ద్వారా పనిచేస్తున్న లేక్ ఫ్రైటర్‌కు (ప్రపంచం లోని ఏకైక ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్) చేరవేస్తుంది.

ఫ్రీ వే[మార్చు]

మెట్రో డెట్రాయిట్ విస్తారమైన " టాల్- ఫ్రీ " రహదారులతో అనుసంధానితమై ఉంది. వీటి నిర్వహణాబాధ్యత మిచిగాన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాంస్పోర్టేషన్ వహిస్తుంది. నగరంలో 4 ఇంటర్స్టేట్ హైవేలు ఉన్నాయి. డెట్రాయిట్ లోని ఇంటర్స్టేట్ -75 (ఐ-75), ఇంటర్స్టేట్ -96 (ఐ-96) హైవేలు కింగ్ హైవే 401 తో అనుసంధానించబడ్డాయి. కింగ్ హైవే -401 ద్వారా లండన్, ఒంటారియో, గ్రేటర్ టొరెంటో ప్రాంతాలను చేరుకోవచ్చు. ఐ-75 (క్రిస్లర్, ఫిషర్ ఫ్రీవేలు) ఎర్రీ సరోవర తీరంలో నివసిస్తున్న పలు కమ్యూనిటీ ప్రజకకు రవాణా సౌకర్యం అందిస్తుంది. ఐ-94 (ఎడ్సెల్ ఫోర్డ్ ఫ్రీవే) డెట్రాయిట్ నగరం తూర్పు -, పడమరలలో పయనిస్తూ ఉంది. ఇది పడమరలో అన్న ఆర్బర్ (అక్కడి నుండి చికాగో వరకు సాగుతుంది) మరుయు ఈశాన్యంలో హ్యూరాన్ పోర్ట్ వరకు రవాణా సౌకర్యం కలిగిస్తుంది. రెండవ ప్రపంచయుద్ధం సమయంలో విల్లో రన్, డియర్బన్ వరకు ఉన్న ఫ్యాక్టరీలను అనుసంధానం చేస్తూ హెంరీ ఫోర్డ్ దీనిని నిర్మించాడు. ఇందులో కొంత భాగాన్ని విల్లో రన్ ఎక్స్ప్రెస్ వే అంటారు. ఐ- 96 ఫ్రీ వే నగరం వాయవ్యం - నైరుతీ మద్య నిర్మించబడింది. ఇది లివింగ్స్టన్, ఓక్లాండ్, వ్యానే కౌంటీలను అనుసంధానం చేస్తూ నగరం తూర్పున ఉన్న డెట్రాయిట్ డౌన్ టౌన్ వద్ద ముగుస్తుంది. ఐ-275 రంస్ ఉత్తరం- దక్షిణం వరకు దక్షిణంలో ఐ-75 నుండి ఐ- 96 కూడలిని కలుపుకుంటూ ఉత్తరంలో ఐ- 696 వరకు కొనసాగుతుంది. ఇది డెట్రాయిట్ శివారు ప్రాంత బైపాస్ రోడ్డుగా సేవలు అందిస్తూ ఉంది. ఐ-375 డెట్రాయిట్ డౌన్ టౌన్ చేరడానికి దగ్గర మార్గం. ఇది క్రిస్లర్ ఫ్రీవే వరకు కొనసాగించబడింది.ఉత్తరంలో ఉన్న ఐ-696 (ర్యూతర్ ఫ్రీవే) ఐ-96, ఐ-275 కూడలి నుండి తూర్పు పడమరలకు పయనిస్తుంది. ఇది డెట్రాయిట్ శివారు ప్రాంతానికి రవాణా సౌకర్యం అందిస్తూ ఉంది.

మూలాలు[మార్చు]

  1. "USGS detail on Detroit". Retrieved 2007-02-18.
  2. "Annual Estimates of the Population for Incorporated Places Over 100,000, Ranked by July 1, 2006 Population: April 1, 2000 to July 1, 2006". U.S. Census Bureau. Archived from the original on 2009-05-08. Retrieved 2007-06-28.
  3. "American FactFinder". United States Census Bureau. Retrieved 2008-01-31.
  4. "US Board on Geographic Names". United States Geological Survey. 2007-10-25. Retrieved 2008-01-31.
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Woodford అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు